EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Monday, 20 February 2023

మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు.

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు.

👉 _సామెతలు 30:24-28_

*1.చీమలు..*  దూరదృష్టి

బలము లేని జీవులు అవి ఆహారము సంపాదించుకొనుటకు సరియైన సమయం ముందుగా ఎంచుకొనును.
సామెతలు 6: 6-8.

సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

ముందుచూపు అనేది తెలివైన లక్షణము. 

యేసు ప్రభువు గోపురము కట్టగోరిన వ్యక్తి, యుద్ధమునకు పోవు రాజు ముందుగా ఆలోచించుకొనుటను గూర్చి చెప్పెను.(లూకా 14:28-32) అన్యాయస్తుడైన గృహనిర్వాహకుడు ఉపమానము కూడా ఇదే సూత్రం నేర్పించును.(లూకా 16:1-8)

పేతురు తన రెండవ పత్రికలో దేవుని వాగ్దానాలు నమ్మి ఆత్మీయజీవితమునకు కావలసిన వాటిని అమర్చుకొనలేనివారు దూరదృష్టి లేనివారని వ్రాసెను. (2పేతురు 1:9)

*2.చిన్న కుందేళ్లు...* భద్రత.

సామెతలు 30: 26
చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
కీర్తనలు 104: 18

గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
బండ అనేది పునాది మీద కట్టిన ఇల్లు ఉపమానము గుర్తు చేయును.(మత్తయి 7:24) పేతురు ఒప్పుకొనిన బండ -క్రీస్తు దేవుని కుమారుడు. (మత్తయి 16:18)

మనము ఎక్కడ నివసింపగోరుచున్నామో దానిని బట్టి మన జ్ఞానము వెళ్లడి అవుతుంది.
భద్రత అనేది మనందరి అవసరత. స్థిరనివాసము ఎక్కడ అనేది కూడా జ్ఞానవంతులే ఎంపిక చేసుకొంటారు.
కీర్తనలు 91: 1
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
యోహాను 14: 2
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
మనం మన నివాసం కల్పించుకోవాలి. ఆత్మీయజీవితమునకు అనువైన మంచి క్షేమకరమైన వాతావరణం క్రీస్తు సంఘమే.

*3.మిడతలు...* ఐక్యత

సామెతలు 30: 27
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.

మిడతలు గుంపులు గుంపులుగా తిరుగుచుండునవి. 

కీర్తనలు 133: 1
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

అపో.కార్యములు 4: 32
విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
1కోరింథీయులకు 1: 10
సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

యేసు ప్రభువు  వాక్యము వలన అందరూ ఏకము కావలెనని ప్రార్థన చేసెను.(యోహాను17:21-22)

*4.బల్లి... ,సాలె పురుగు..* నిపుణత.

సామెతలు 30: 28
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.

సామెతలు 30:28 లో రాజగృహములలో ఉండినట్లు చెప్పబడినది. కొందరు అది సాలెపురుగు అని తలంచుచున్నారు. ఏమైనను ఈ రెండు ఎలాంటి వైనను అవి ఉన్నతమైన స్థానములలో కనబడుతున్నాయి. సాలెపురుగు పట్టుదల చూచి నిరాశ చెందిన రాజు తన ప్రయత్నం మరలా చేసినట్లు మనం విన్నాము.

రాజుల గృహంలోనికి ఎందరో జ్ఞానులు తేబడినారు,చేరినారు, యేసేపు,దానియేలు, తూర్పు దేశపు జ్ఞానులు, పౌలు రాజుల ఎదుట నిలచి దేవుని జ్ఞానమును వెళ్లడి చేసారు.

సామెతలు 22: 29
తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును.

దానియేలు 12: 3
బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

బైబిలు దేవుని జ్ఞానము. ఈ జ్ఞానమును పొందినవారు ఉన్నతమైన స్థితిలో ఉంటారని మనం నేర్చుకొంటున్నాము.
ప్రకటన గ్రంథం 3: 12
జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. 

మరి ఈ సందేశం ధ్యానం చేయుచున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎలా వున్నారు..అల్పమైన ఆ చిన్న జీవులే అంత జ్ఞానంతో, ఆత్మీయంగా వుంటే మనం ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యము ప్రకారం జీవించాలో ఆలోచించండి.. మీ విశ్వాసం కాపాడుకోండి..అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక..ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Sunday, 19 February 2023

నీ అందమే నీ అతిశయమా..?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- నీ అందమే నీ అతిశయమా..?

దేవుడు సృష్టించిన సృష్టి మహోన్నతమైనది, అత్యంత సుందరమైనది. ఆ సృష్టిలో స్త్రీ అందమైనది. అయితే, తన అందాన్ని ఇంకా యినుమడింప జేసుకోవడానికి తాను పడని తిప్పలంటూ ఏమి లేవేమో? చెప్పుకొంటూపోతే దానికి అంతమంటూ వుండదేమో? పరిశుద్ధ గ్రంథములో కూడా కొందరి స్త్రీల అందమును గూర్చి ప్రస్తావించబడింది. కానీ వారి అందమునుబట్టి కొనియాడబడిన స్త్రీ ఒక్కరూ లేరు సరికదా. అందము మోసము, అది వ్యర్థమని పరిశుద్ధ గ్రంధం ప్రభోధిస్తుంది. 

*శారీరిక అందము* 

👉 శారాయి చక్కనిది (ఆది 12:11)
👉 రిబ్కా మిక్కిలి చక్కనిది (ఆది 24:16)
👉 రాహేలు రూపవతి, సుందరి (ఆది 29:17)
👉 అబీగయీలు రూపసి (1 సమూ 25:3)
👉 బత్షెబ బహు సౌందర్యవతి (2 సమూ 11:3)
👉 వష్తి సౌందర్యవతి ( ఎస్తేరు 1:11 )
👉 ఎస్తేరు,  అందమైన రూపము, సుందర ముఖమును గలది (ఎస్తేరు 2:7)
👉 యెమీమా, కెజీయా, కెరెంహప్పుకు (యోబు కుమార్తెలు) ఊజు దేశమంతటిలో సౌందర్యవతులు. ( యోబు 42:15)

*🤞అందము వ్యర్ధము:*

అందము మోసకరము. అది నిన్ను కొన్నిసార్లు శోధనకు గురిచెయ్యవచ్చు. అట్లా అని శోధించబడటం పాపం కాదు. శోధనలో పడడమే పాపం. అందముగా ఉండడం తప్పు కాదు, అందుకే దేవుడు నిన్ను అందముగా రూపొందించారు. అయితే,  ఆ అందాన్ని చూచుకొని తప్పు చెయ్యడం పాపం. నీ అందానికి అంతరంగ సౌందర్యము జతకలిస్తే అది పరిపూర్ణమవుతుంది. షూలమ్మితి నల్లనిదైననూ బహు సౌందర్యవంతురాలు. ఆంతరంగిక సౌందర్యము లేని అందం వ్యర్థం. “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము (సామెతలు 31:30) వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది. (సామెతలు 11:22)

*👌- ఆత్మ సంబంధమైన సౌందర్యము*

శరీర సంబంధమైన భౌతిక అలంకరణ ఖచ్చితంగా వేరొకరిని పాపమునకు ప్రేరేపించే అవకాశం వుంది. అంటే, నేరుగా నీవు పాపము చెయ్యకపోయినప్పటికీ, పాపము చెయ్యడానికి అవకాశం కల్పిస్తున్నావనే విషయం మరచిపోవద్దు. భౌతికమైన అలంకరణ కాదు ప్రభువుకు కావలసింది “అంతరంగ సంబంధమైన” అలంకరణ. “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది”. (1 పేతురు 3:3,4). “దీనత్వము” అనే సుగుణాన్ని కలిగియుండడం ద్వారా రక్షణతో అలంకరింపబడగాలి. “యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును”. (కీర్తనలు 149:4)

*👍 -నీ అందం నిన్నెక్కడకి నడిపిస్తుంది?*

అందాన్ని బట్టి అతిశయించేవారు లెక్కలేనంతమంది. అయితే, అతిశయించేవారిలో నీవున్నావేమో సరిచూచుకో! సరిచేసుకో! వారిలో నీవుంటే, నీవు పాపములో వున్నావనేది నిస్సందేహం. 

*🙆‍♂️-అందమును గూర్చిన అతిశయం నీలో ఉంటే?*

🔸అది నేరుగా నీతోనే పాపం చేయించొచ్చు 
🔸వేరొకరిని పాపమునకు ప్రేరేపించొచ్చు 
🔸నీ తోటివారిని నీ మనస్సులోనే చులకన చెయ్యొచ్చు, హేళన చెయ్యొచ్చు 
🔸గర్వం నీ హృదయంలో తిష్ట వెయ్యొచ్చు 
🔸ఆ గర్వమే నిన్ను పతనానికి నడిపించొచ్చు.

రాణియైన వష్తి తన సౌందర్యాన్ని బట్టి అతిశయించింది, చివరకు అధోగతి పాలయ్యింది. అయితే, శారాను ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా వేరొక రాజు కోరుకున్నాడు. అంటే ఆ వయస్సులో కూడా ఆమె ఎంత అందమైనదో కదా? అయితే, తన అందాన్ని బట్టి అందలమెక్కాలని భావించిన స్త్రీ కాదు. ఆమె కేవలం శారీరిక సౌందర్యవంతురాలు మాత్రమే కాదు, ఆమె సౌందర్యము అంతరంగికమైనది, అది ఆత్మీయమైనది. 

నీ శారీరిక అందానికి ఆత్మీయ సౌందర్యాన్ని జతచేసి దానిని పరిపూర్ణము చెయ్యగలిగితే నీ జీవితం సార్ధకమైనదే. ఆంతరంగిక సౌందర్యము లేని అందం ఎట్లాంటిదంటే? డ్రైనేజీ లో పొర్లే పంది వంటిది. ఇది ఊహించుకోవడమే కష్టం కదా? అవును! శారీరిక అందం లేకపోయినా పర్వాలేదు. అట్లా అని నల్లగా ఉంటే, పొట్టిగా ఉంటే, లావుగా ఉంటే, సన్నగా ఉంటే నేనేదో అందముగా లేనని నీకు నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిలో నిన్ను పోలిన వారెవరూ లేరు. నీకు నీవే ప్రత్యేకం, నీ అందం ప్రత్యేకం. అందులనుబట్టి ప్రభువును స్తుతించు. శారీరిక అందం వున్నా అది వున్నా కొంత కాలమే కదా? ఆత్మీయ సౌందర్యము ఒక్కటి చాలు, అది శాశ్వత కాలం ప్రభువుతో నిన్ను జీవింపజేస్తుంది. 

చివరిగా మరొక్కసారి చెప్తున్నాను శారీరిక అందమునుబట్టి కొనియాడబడిన స్త్రీ పరిశుద్ధ గ్రంధములో ఎవ్వరూ లేరు. ఈ లోకంలో కూడా లేరు. ఒకవేళ నీకు ఎవరైనా గుర్తొస్తే ఖచ్చితంగా వారు శరీరానుసారులే. దానిలో సందేహం లేనేలేదు. నిన్ను నీవు సరిచూచుకో! సరిచేసుకో! ఆంతరంగిక సౌందర్యము గలిగి అనునిత్యమూ ప్రభువుతో జీవించు! అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Friday, 17 February 2023

నా గొర్రెలు నా మాట వినును..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- నా గొర్రెలు నా మాట వినును..
 
ప్రియమైన క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులారా..మీ సేవకున్ని అయిన నా స్వరము మీకు వినబడుతోందా ? పరీక్ష చేసుకోండి..

👉 నీ కాపరి స్వరాన్ని వినగలుగుతున్నావా ?
👉 ఆ స్వరానికి లోబడగలుగుతున్నావా ? 
👉 నీ కాపరిని వెంబడించగలుగుతున్నావా ?

_నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. - యోహాను 10:27_

*నీవు గొర్రెవు అయితే ?*

▫️నీముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య వుండాలి.

▫️నీ కాపరి (పాస్టర్) అడుగుజాడల్లో నడవాలి.

▫️ఆయన స్వరం వినాలి.

▫️గొర్రెలకు గాయపరచే అవయవాలు( కొమ్ములు) లేవు. అట్లాంటి సాదు స్వభావం నీకుండాలి. ( సేవకుని మీద కూడా తిరగబడి మాట్లాడుతూ , సంఘం కు రాకుండా నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావంటే నీకు కొమ్ములు వున్నాయని అర్థం)

▫️ నీ మాటలు గాని, నీ క్రియలుగాని ఎవ్వరిని గాయపరచే విధంగా ఉండకూడదు.

▫️వాటి సంఖ్యా బలం వాటిని రక్షించ లేదు. ఒక్క  గొర్రెవున్నా, లక్ష గొర్రెలు కలసి వున్నా తోడేలు సులభంగా వాటిని ఎత్తుకొని పోగలదు. నీవెనుకనున్నవారు, నీ ఆస్తులు, నీ ధనము నీ బలం కాకూడదు. యేసయ్య నీ బలం అయ్యుండాలి.

▫️గొర్రె స్వచ్చమైన నీరు త్రాగుతుంది. మరి మనం ?

▫️స్వచ్చమైన ఆకుపచ్చని మొక్కలను తింటుంది. ఎండినవి, క్రుల్లినవాటి జోలికిపోదు. మరి మనం ?

▫️గొర్రెను  బలవంతంగా త్రోసినా బురదలో పడడానికి ఇష్టపడదు..మరి మనం ? 

▫️గొర్రె  ఒకవేళ అది బురదలో పడినా ఒక్క నిమిషం దానిలో ఉండలేదు. ఆలస్యం అయితే చనిపోతుంది కూడా..మరి మనం? ( మందిరానికి రాక ఎన్ని వారాల నుండి బురదలో వున్నావు ?  

▫️సంవత్సరాల తరబడి బురద కలిగిన జీవితం..జీవిస్తున్నారు కదా ? కాపరి గద్ధింపు నీకు అసహ్యమా ? దేవుని మందిరం అంటే నీకు భయం లేదా ? వాక్యం అంటే నీకు భయం లేదా ? నీ జీవితం ఒకసారి పరీక్ష చేసుకో ?

▫️మాంసం అమ్మే వాడు ఒక గొర్రెను మెడ నరికినా, దానిని చూచి మిగిలిన గొర్రెలు వాడిమీద తిరుగబడవు. ( మరి నీ సంగతేంటి ? నీకు నచ్చినట్లు వాక్యం చెబితే మంచి పాస్టర్ అంటావు. తప్పు చేస్తున్నావు అని వాక్యం చేత గద్ధిస్తే ఈ రోజు నాగురించే వాక్యం చెప్పినాడు అని పది మందికి చెప్పి పాస్టర్ మీద తిరగబడి మాట్లాడుతూ..నీవు చెడిపోయింది కాక అందరినీ చేడుపుతూ సంఘాన్ని పాడుచేస్తున్నావా ?

▫️నిజమైన విశ్వాసులు సంఘం కోసం, దేవుని కోసం ప్రాణం పోగొట్టుకోవలసిన పరిస్టితులు వచ్చినా వాటికోసం సిద్దపడాలి..ఆలాంటి తెగింపు నీలో వుందా ?

*- గొర్రె వంటి అనుభవాలు నీకు లేకపోతే ?*

▫️ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య స్వరాన్ని వినలేవు. 

▫️ ఆ స్వరానికి లోబడలేవు. 

▫️ నీ ప్రియ రక్షకుని వెంబడించలేవు. 

👉 దీని ఫలితం అత్యంత ఘోరం! 
నీవు క్రూరమృగమనే సాతాను మృత్యుకోరల్లో చిక్కుతావు. ఇక నిత్య మరణమే శరణ్యం! 

 వద్దు! వద్దు! ఈ రోజే అహంకారం, గర్వం వదిలేసి సంఘ సేవకునితో సమాధానం పొందుకో ! సంఘంలో చెర్చబడదాము. ఆయన మెల్లనైన స్వరాన్ని విందాం! 

👉 *దైవ సేవకుడు నీ కోసం కన్నీళ్లు కారిస్తే నీకు ఆశీర్వాదం..కానీ నిన్ను బట్టి నీ ప్రవర్తన బట్టి కన్నీళ్లు కారిస్తే అది నీకు శాపము తెలుసా ?*

మీ సంఘంలో మీ పాస్టర్ ను గౌరవిస్తున్నారా ? ఆయన మాట వింటున్నారా ? ఆయన పిలుపు నీకు వినబడుతుందా ?

_ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. (ప్రకటన 3:20)_

▫️కాపరి స్వరానికి లోబడదాం!

▫️ప్రియ రక్షకకుడును, మంచి కాపరి, ప్రధాన కాపరియైన యేసయ్యను వెంబడిద్దాం! 

▫️నిత్యరాజ్యానికి చేరుదాం!

అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! 

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 16 February 2023

సేవకులకు సలహా -

- సేవకులకు  సలహా -
 సేవకులకు  సలహా -
 
👉 *1. బ్రతుకు భారమై సేవకు రాకు,  ఆత్మల భార మెక్కువై సేవకు రా*

👉 *2. నీ ఆకలి తీర్చుకొనుటకు సేవకు రాకు,  అనేకుల ఆత్మీయ ఆకలి తీర్చుటకు సేవకు రా*

👉 *3.సంఘ రాబడి కోసం సేవకు రాకు,  సంఘములో అనేకులను చేర్చడం కోసం సేవకు రా*

👉 *4. ఆధిక్యతల కోసం సేవకు రాకు,  అణుకువ కలిగియుండుటకు సేవకు రా*

👉 *5. ప్రతి అవసరత కోసం ప్రజల వైపు చూచుటకు సేవకు రాకు, ప్రభువు వైపు చూచుటకు సేవకు రా*

👉 *6. ప్రజల మీద నమ్మకంతో సేవకు రాకు, ప్రభువు మీద నమ్మకముతో సేవకు రా*

👉 *7. నీ వృద్ధాప్యపు ప్రారంభములో సేవకు రాకు, యౌవన కాలం ప్రారంభములో సేవకు రా*

👉 *8. సంఘములో లేఖన సత్యాలను నేర్చుకోకుండా సేవకు రాకు, లేఖన సత్యాలను నేర్చుకొని సేవకు రా*

👉 *9. ప్రభువు పిలుపు లేకుండా సంఘ సాక్షము లేకుండా సేవకు రాకు,  ప్రభువు పిలుపు సంఘ సాక్ష్యము కలిగి సేవకు రా*

👉 *10. నీ పేరు కోసం సేవకు రాకు,  ప్రభువు పేరు మహిమ పరచడం కోసం రా*

✅ _అప్పుడు ప్రభువు నిన్ను సేవలో వాడుకుంటాడు.. తద్వార దేవునికి మహిమ కలుగుతుంది!_

👉 *అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము(తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన(కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.*
           -యాకోబు 3: 2

మోహపు చూపుతో..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మోహపు చూపుతో..

ప్రభువైనయేసు కొండమీద ప్రసంగంలో ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన యెడల అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి అతడు రెండు కళ్ళతో నరకానికి వెళ్ళుటకంటే ఒక కంటిని పెరికివేయుట మంచిదని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి అలవాటుగా ఎల్లప్పుడు మోహపు చూపు చూస్తూనే ఉన్నట్లయితే అతడు నరకానికి కూడా వెళ్ళవచ్చునని ప్రభువు చెప్పారు.

ఆదాము కాలము నుండి ఈనాటివరకు ఒక మనిషి హృదయములో ఉన్న ఆ మోహమనే తలంపు ప్రతి మనిషి హృదయంలో ఉన్నది. పరిశుద్ధాత్మయొక్క అగ్ని మాత్రమే దీనిని నశింపజేయగలదు. నీ హృదయము పాపము చేయుటకు దురాశలో మండుచుండవచ్చు లేక ప్రభువైనయేసు కొరకు ప్రేమతో మండుచుండవచ్చు. *నీవు ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ఒకటి ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరచే అగ్ని లేక భవిష్యత్తులో నిన్ను కాల్చే అగ్ని. మరొకమార్గం లేదు.*

ప్రభువు మాట్లాడిన యూదా ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నత ప్రమాణాలు కలిగియున్నారు. వారు అంత ఖచ్చితముగా ధర్మశాస్త్రమును వెంబడించుటవలన వ్యభిచారులుగా జీవిస్తున్న వారిని చంపి శిక్షించేవారు. ఇప్పటిలాగా లైంగిక సంబంధ పుస్తకములు, పత్రికలు లేక టి.వి కార్యక్రమాలు ఉండెడివి కావు. ఇవి మనుష్యులను జారత్వములోనికి నడుపును.

👉 ప్రతి స్త్రీ కూడా మంచి వస్త్రధారణ కలిగియుండి మరియు పురుషులు స్త్రీలు ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు.
👉 అటువంటి నియమములు కలిగిన సమాజంలో కూడా పురుషులు స్త్రీలను మోహపు చూపు చూస్తారని ప్రభువుకు తెలియును కాబట్టి ఆయన శిష్యులను ఈ విషయంలో హెచ్చరించారు. 

అటువంటి సమాజంలో కూడా ఆ హెచ్చిరిక అవసరమైతే ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో ఆ హెచ్చరిక ఎంత అవసరమో కదా!

మనలో లైంగిక వాంఛలు కలుగజేయుటకు ఈనాటి సమాజం అనేక విధములుగా మన మనసులలోనికి చొచ్చుకొనుచున్నది. కాబట్టి ఈ దినములలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యామోహం అను తలంపు నీవు తీవ్రముగా తీసివేయాలనుకుంటే, వాటన్నిటిని మనం విసర్జించుటకు జాగ్రత్తగా ఉండాలి. కనికరము లేకుండా, తీవ్రముగా ఆ తలంపును నీవు నశింపజేయాలి.

నీకంటిని మరియు నీ చేయిని పెరికి పారవేయుట అనగా అర్ధమిదియే. మనం పాపము చేయుటకు కారణమైన దానిని నశింపజేయమని యేసు ఆజ్ఞాపించారు. పాపము యొక్క ప్రమాదం మరియు నరకాగ్ని గురించి ప్రభువైన యేసుకు తెలుసు కనుక పాపమునుండి మనం రక్షింపబడుటకు మనం ఈ విధంగా పెరికివేయాలని ప్రభువైన యేసు చెప్పారు.

ప్రభువుయొక్క ఆజ్ఞలను మనం ఈ విధముగా అన్వయించుకోవచ్చు. 

👉టి.వి లో ప్రోగ్రామ్స్ లేదా సినిమాలు, లేదా నీ మొబైల్ లో వచ్చే అసభ్య వీడియోలు, అసభ్య సైట్స్ ఒకవేళ నీ మనస్సులో పాపవిషయపు కోరికలను కలుగజేసినట్లయితే వెంటనే దానిని విడిచిపెట్టుము. టి.విలో నీవు చూసిన నటులను బట్టి నీవు నరకానికి వెళ్ళుటకంటే, టి.విలో ఆ కార్యక్రమాలు చూడకుండా పరలోకం వెళ్ళుట ఎంతో మంచిది. ఏదైనా సినిమాలో వచ్చే అసభ్య నృత్యం నిన్ను పాపము చేయుటకు ప్రేరేపించినయెడల, నీవు చూడడం మానివెయ్యి. నీవు పరలోకాన్ని పోగొట్టుకొని నరకానికి నడిపించేటంత విలువైనదేదియు ఈ భూమిమీద మనకు లేదు.

నీవు ఈ సందేశమును చదువుచుండగా..ఆహా ఈ దానియేలు పాస్టర్ ఏం చెప్పినాడు..అబ్బో.. ఆ చిన్న విషయమును చేస్తూ ఉండడం వలన నీవు నరకానికి వెళ్ళనని సాతాను నీతో చెపుతాడు. నీ మొబైల్ లో, సినిమాల్లో అశ్లీల డాన్స్ లు, అర్ధనగ్న వస్త్రాలతో నేటి తరం సినిమాలు చూచి నీవు మోహించుచు ఉండుటకాని లేక టి.విలో నీవు ఎవరినైనూ చూస్తూ ఉండటం వ్యభిచారం కాదని సాతాను చెపుతాడు. అతడు మొదటినుండి అబద్ధికుడని  ప్రభువైనయేసు చెప్పాడు కనుక అతని స్వరాన్ని వినవద్దు. జాగ్రత్త...

ఈ పాపము గురించి నీవు ఇలా చెప్పవద్దు, "భవిష్యత్తులో నేను కొంచెం మెరుగ్గా ఉంటాను లేక భవిష్యత్తులో దీనిని విడిచిపెట్టుటకు ప్రయత్నిస్తాను". కీడుగా కనబడేదానినుండి వెళ్ళిపొమ్మని బైబిలు చెప్పుచున్నది. ఈ పాపమును వెంటనే మరియు పూర్తిగా విడిచిపెట్టుటకు దేవుడు నీకు సహాయం చేస్తాడని పూర్తిగా విశ్వసించు. ఈ రోజునుండి ఈ పోరాటం ఆరంభించు. జీవముగల దేవుని సైన్యములో ఉన్న నీవు, నిన్ను అపవిత్రపరచే గొల్యాతు తల నరికివేయు వరకు పోరాడుతూనే ఉండుము.

ప్రభువు తన మందిరమును మరొకసారి పవిత్రపరచుచునే ఉన్నాడు. నీ దేహమే ఆయన ఆలయమైయున్నది. దేవుడు నీలో లోతుగా పని చేయునట్లు ఆయనను అనుమతించుము.

అమ్మాయిలతో శరీరసంబంధం కలిగియుండవద్దని 1 కొరింథీ 7:1లో హెచ్చిరించబడ్డాము. పరిశుద్ధాత్ముడు దేనినైనా చెడ్డది అని చెప్పినప్పుడు(ఇక్కడ చెప్పబడినట్లు), ప్రతి విశ్వాసి ( నీవు) దానిని తిరస్కరించాలి. ధర్మశాస్త్రానుసారులు అక్షరానుసారముగా జీవిస్తారు కాని శిష్యులు, విశ్వాసులు ఆత్మతో నింపబడి ఆత్మానుసారముగా జీవిస్తారు.

ఉదాహరణకు *ఒకని హృదయములో ఒక స్త్రీ యెడల లైంగిక వ్యామోహం ఉన్నయెడల అది వ్యభిచారమని ప్రభువు చెప్పారు.* ఎందుకనగా ఏడవ ఆజ్ఞను ప్రభువు గ్రహించారు గనుక అదేవిధముగా దేవునియొక్క ఆజ్ఞలన్నిటిలో ఉన్న ఆత్మను మనం చూడగలగాలి.

పౌలు, తిమోతి పత్రికలో ఇట్లు చెప్పాడు. యౌవ్వనస్థులకు కలిగే శోధనల నుండి పారిపొమ్ము 2తిమోతి 2:22. అటువంటి శోధనల నుండి నీవు పారిపోవాలి.

 అట్టి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 15 February 2023

నిందలు బరించడం కూడా గొప్ప భాగ్యమే..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 నిందలు బరించడం కూడా గొప్ప భాగ్యమే..

మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీ 11:24-26

*మోషే:*

▪️ఐగుప్తీయుల సకలవిద్యలను అభ్యసించినవాడు. 
▪️మాటలయందును, కార్యములయందును ప్రవీణుడు. అపో 7:22

అంతటి ప్రావీణ్యం పొందిన మోషే అరణ్యంలో తన మామ మందలను మేపుతున్నాడు.  నిర్గమ 3:1

కారణం? మోషే తేల్చుకోవలసిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి. 

▪️దేవుడా? 
▪️లోకమా?

▪️ఐగుప్తు ధనమా?
▪️క్రీస్తువిషయమైన నిందా?

▪️అల్పకాల పాపభోగమా?
▪️దేవుని ప్రజలతో శ్రమా? 

▪️ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా? 
▪️అధికారాన్ని త్రోసివేయడమా?
..ఆలోచించడం మొదలు పెట్టాడు.

♻️ ఐగుప్తు ధనమా?

నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. (మత్తయి 6:21) ధనము దేవుని నుండి దూరం చేస్తుంది. అది వద్దు అనుకున్నాడు. 

♻️ అల్పకాల పాపభోగమా?

పాప భోగము కొంత శారీరికమైన సంతోషాన్ని ఇవ్వొచ్చు. కాని అది అల్పకాలమే. దాని గమ్యం మాత్రం నిత్య మరణం. అదీ వద్దు అనుకున్నాడు. 

♻️ ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా? 

'హోదాను బట్టి' అతిశయించడం అతనికి ఇష్టం లేదు. కారణం? అతిశయం ఏదైనా వుందంటే? 
భూమిమీద కృపచూపుచు నీతిన్యాయములు జరిగించుచున్న దేవుని బట్టియే. యిర్మియా  9:23,24

♻️ ఇప్పుడు మోషే ముందు మిగిలియున్న అంశాలు: 

▪️క్రీస్తువిషయమైన నింద
▪️దేవుని ప్రజలతో శ్రమ
▪️అధికారాన్ని త్రోసివేయడం. 

అవును! వీటిని సంతోషముతో స్వీకరించాడు. నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి సిద్ధ పడ్డాడు. అంతఃపురాన్ని విడచి అరణ్యానికి చేరాడు. యువరాజు మందల  కాపరిగా మారాడు. 

కారణం? విశ్వాసమునుబట్టి అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
దేవునిని ప్రక్కనబెట్టి ధనం కోసం ప్రాకులాడే మన జీవితాలకు, అల్పకాల సుఖ భోగాలతో దేవుని ఆలయమైన మన శరీరాలను పాడు చేసుకుంటూ, నిత్య మరణానికి దగ్గరవుతున్న మన జీవితాలకు, హోదా, అధికారం కోసం అడ్డ దారులు తొక్కుతూ, వాటితో మనలను మనమే ఘన పరచుకోవాలని ఆరాటపడుతున్న మన జీవితాలకు, మోషే జీవితం గొప్ప ఆధ్యాత్మిక పాఠం. మన జీవితాలు సరిచేసుకుందాం! నిత్యజీవాన్ని చేరుదాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

విశ్వాసము

✝️ CHRIST TEMPLE-PRODDATUR
విశ్వాసము
 
ఒకవేళ పాస్ పోర్ట్, వీసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్లిపోగలవేమో గాని, యేసు క్రీస్తు లేకుండా, నిత్యరాజ్యం చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు. 
 
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. 
           యోహాను 14:6
 
నిత్యజీవాన్ని నీవు చేరాలంటే? దాని 'మార్గమైన' యేసు ప్రభువును నీవు చేరాలి. 'విశ్వాసమే' నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు. 
 
 *1. 'విశ్వాసమే' రక్షణకు మార్గము.*
 
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.
               ఎఫెస్సి 2:8
 
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును (మార్కు ‪16:16‬)
 
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9)
 
*2. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఆయన పిల్లలు.*
 
తన్ను ఎందరంగీకరించితిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను ‪1:12‬)
 
*3. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.*
 
కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. (యోహాను ‪6:47‬)
 
*4. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు తీర్పులోనికి రారు.*
 
ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు.
               యోహాను ‪3:36‬
 
*5. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు.*
 
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను ‪3:16‬
 
దేవుని రాకడ సమీపం కానుంది. అబద్దబోధకులు యేసు క్రీస్తు దేవుడు కాదని అసత్య ప్రకటనలు ముమ్మరం  చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంధము 'సాతాను సమాజము' అని పిలుస్తుంది. 
 
అయితే ఒక్క విషయం ఆలోచించు!!! 
యేసు క్రీస్తును దేవునినిగా,  అంగీకరించనివారు, విశ్వసించనివారు 
🔸ఎట్లా రక్షించ బడతారు? 
🔸ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు? 
🔸ఎట్లా ఎత్తబడే సంఘములో వుంటారు?
🔸ఎట్లా తీర్పు నుండి తప్పించ బడతారు?
🔸ఎట్లా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు? 
 
🔹సాధ్యం కానేకాదు. 
🔹నిత్య మరణమే వారి గమ్యం. 
 
వద్దు! యేసే దేవుడని విశ్వసిద్దాం! ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 9 February 2023

మనల్ని దేవునికి దగ్గరగా నడిపించేవి సమస్యలే..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మనల్ని దేవునికి దగ్గరగా నడిపించేవి సమస్యలే..

ప్రతీ సమస్య వెనుక దేవునికి ఒక ఉద్దేశ్యమున్నది. మన గుణశీలతను మెరుగుపరచడానికి ఆయన పరిస్థితులను వాడుకుంటారు. 

లోకములో సమస్యలు వుంటాయని యేసు మనలను హెచ్చరించారు.

యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

  బాధకు, శ్రమకు ఎవ్వరూ అతీతులు కారు. సమస్యలేని జీవితము లేదు. జీవితము సమస్యల వలయమైయున్నది. ప్రతీసారి ఒక సమస్య పరిష్కరింపబడగానే, మరొకటి సిద్ధంగా ఉంటుంది. వాటిలో అన్నీ పెద్దవికావు. కానీ నీ ఎదుగుదల విధానములో దేవుని దృష్టిలో ఒక పాఠము, అర్ధము కలిగినవే. 

ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. (1 పేతురు 4:12) 

తనకు సన్నిహితముగా నిన్ను ఆకర్షించుటకు దేవుడు సమస్యలను ఉపయోగిస్తాడు. 

విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. (కీర్తనలు 34:18) 

నీ చీకటి రోజుల్లోనే నీ ఆరాధన యొక్క లోతైన, సన్నిహితమైన అనుభవాలుంటాయి. 

👉నీ హృదయం పగిలినప్పుడు.
👉 నీ బాధలు అధికమైనప్పుడు. ఒంటరిగా దేవునివైపు తిరుగుతావు. శ్రమపడు సమయంలోనే మనము ప్రార్ధించుట నేర్చుకుంటాము. మనము బాధలో వున్నప్పుడు పై పై పూత ప్రార్థనలకు మన బలము చాలదు. శ్రమలలోనే ప్రామాణికమైన, హృదయవేదన, నమ్మకమైన ప్రార్ధనలు నేర్చుకుంటాము. 

👉 చెరసాలలో పడకుండా యోసేపును,
👉 సింహముల బోనులో పడకుండా దానియేలును,
👉 బురద గుంటలో పడకుండా యిర్మియాను,
👉 మూడుసార్లు ఓడ ప్రమాదంలో పడకుండా పౌలును,
👉 అగ్ని గుండములో పడకుండా హెబ్రీ యువకులైన షద్రకు, మెషెకు, అబేద్నగోలను,..

దేవుడు తప్పించవచ్చు. కానీ ఆయన తప్పించలేదు. ఆ సమస్యలకు దేవుడే సెలవిచ్చారు. ఫలితంగా వీరందరూ దేవునికి సన్నిహితంగా వచ్చారు. దేవునివైపుకు చూచుటకు సమస్యలు బలముగా పనిచేస్తాయి, మనమీద కాకుండా దేవునిమీద ఆధారపడేటట్లు చేస్తాయి. పౌలుగారి మాటలను గమనించగలిగితే, మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక  యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. (2 కొరింథీ 1:9,10)

కారణమేదైనా దేవుడు నీ జీవితంలోనికి అనుమతించే శ్రమ ఏదైనా, అది నీ మేలు కొరకే ఉద్దేశించబడింది. నీ జీవితంలోని ప్రతీ దినము నీవు పుట్టకముందే దేవుడు గ్రంథస్థం చేశారు. నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను ( కీర్తనలు 139:16) అందుచే, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుకు మరింత సన్నిహితంగా వెళ్ళు. శ్రమలలో నీ విశ్వాస్యతను, శోధనలలో నీ పరిశుద్ధతను కాపాడుకో! ప్రభువు అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదములు అనుభవించు! ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Wednesday, 8 February 2023

మందలో చేరిన గొర్రెలు రెండు రకములు..

✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- మందలో చేరిన గొర్రెలు రెండు రకములు..

ఒకటి : మెదడు ఉన్న గొర్రెలు.
రెండు : మెదడు లేని గొర్రెలు.

ప్రియమైన సంఘమా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈ రోజు మనం ధ్యానం చేయుచున్న అంశం సంఘంలో చేర్చబడుతున్న రెండు రకాలుగా వున్న గొఱ్ఱెపిల్లలు ( విశ్వాసులు) గురించి ధ్యానం చేద్దాం. 

*1.మెదడు ఉన్న గొఱ్ఱెలతో పెద్ద సమస్య ఏమీ ఉండదు.* అవి

👉 తమ కాపరి స్వరాన్ని వింటాయి.
👉 తమ కాపరి ఎవరో గుర్తిస్తాయి.
👉 తమ కాపరిని మాత్రమే వెంబడిస్తాయి.
👉 ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకునే వివేచన ఈ గొఱ్ఱెలకు ఉంది.
👉 కాపరి మాటకు కట్టుబడి వుంటాయి.

కారణం ఇవి “మెదడు ఉన్న గొర్రెలు" ఈ గొఱ్ఱెలకు మెదడు(వివేచన శక్తి) ఉంది.

అపొస్తలుడైన పౌలు బెరయలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు బెరయలోని మనుష్యులు పౌలు ప్రకటిస్తున్న వాక్యం లేఖనాల ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించి, ఆ తరువాత అతని వాక్యప్రకటన లేఖనాల ప్రకారంగానే ఉందని గ్రహించి అప్పుడు పౌలు చెబుతున్నమాటల మీద విశ్వాసం ఉంచారు.

అపో.కార్యములు 17: 11
వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

ఈ బెరయలోనివారు మెదడు ఉన్న గొర్రెలు. అందుకే పౌలు వాక్య ప్రసంగాన్ని పరిశీలించాకే అంగీకరించారు.

*2. మెదడు లేని గొర్రెలు కొన్ని ఉన్నాయి.* 

👉 వీరికి మెదడు( వివేచనా శక్తి) లేదు గనుక ఏది సత్యమో, ఏది అసత్యమో వివేచించలేరు.

👉 వాక్యం వింటున్నప్పుడు అది వాక్య ప్రకారంగా ఉందా లేదా అనేది వీరికి అనవసరం.
👉 లోపల పాపం పెట్టుకొని బయటికి బైబిల్ బోధించే ప్రతీ ఒక్కరి బోధనూ గుడ్డిగా అంగీకరించేస్తారు.
👉 వారు ప్రకటిస్తున్నదాంట్లో సత్యం ఉందా ? ఈ బోధ నన్ను నిత్యజీవానికి నడిపిస్తుందా అనేవి వీరికి అనవసరం.
👉 అక్కడ AC హాలు, DJ ను తలపించే సంగీతం, అబ్బో ఎంతమంది జనాలు..! ఇవి చాలు, అక్కడికి పరిగెడతారు. 
👉 అబ్బో ఆ పాస్టర్ పెద్ద కారులో వచ్చి గట్టిగా కేకలు వేసి ఒక జోకు చెప్పి నవ్వించాడు కదా ? ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నానో..ఈయన నిజంగా ఇంత నవ్విస్తున్నాడు అంటే ఆత్మపూర్ణుడే..అనుకుంటారు.
👉 “మాకు సత్యం తో పనిలేదు… వాక్యంతో పనిలేదు… మంచి DJ మాదిరి మ్యూజిక్ వుంది, పెద్ద పెద్ద కార్లలో జనాలు వస్తున్నారు..అనుకుంటారు.
👉 ఛీ..ఈ సంఘంలో ఏముంది అటు చూడూ.. ఆ సంఘంలో పిలిచి మరీ చందా కట్టించుకొని మెంబర్షిప్ కూడా ఇచ్చారు అక్కడికి వెళ్ళడం మాకు హుందాగా వుంది కాబట్టి దేవుని వాక్యం దొరికే ఈ సంఘం కంటే దుర్బోధ చెప్పే అక్కడికే ఉరుకుతాం..ఇది వీరి మనస్తత్వం.
(గమనిక : దురాత్మ కూడా ఇలాంటి జిమ్మిక్కులు అద్భుతాలు చేయగలదు)
సత్యాన్ని పరిశీలించక ఇలా గుడ్డిగా అంగీకరిస్తూ ముందుకు కదలడం వలన చివరికి వీరు చేరుకునేది నిత్యనరకం.

✅ మెదడు వున్న గొర్రెలు సంఘం కాపరిని మాత్రమే అనుసరిస్తూ వుంటాయి. కాపరి స్వరం వినగానే పరిగెడుతూ రావడం..కాపరి బాటలో నడవడం వీరి మంచి లక్షణం. 

అగ్ని గుండమైనా!
అది గాఢాంధకారమైనా! 

కొండలైనా!
లోయలైనా!

గుట్టలైనా! 
మెట్టలైనా! 

అరణ్యమైనా! 
జల సంద్రమైనా! 

పెద్ద మందిరం లేకపోయినా ..
చిన్న ప్రార్థనా గది అయినా..

పరిస్థితి ఏదైనా సరే! కాపరివైపే మా పయనం! ఆ గొర్రెలకు భద్రత వుంది! క్షేమం వుంది! గొర్రెలు చివరికి చేరవలసిన దేవుని ఇల్లు అనే గమ్య స్థానాలకు వాటిని తప్పక చేర్చుతాడు ఆ కాపరి! 

*- ఎవరి కాపరత్వంలో నీవున్నావ్?*

- లోపల పాపం పెట్టుకొని బయటికి  గ్రాండ్ గా కనబడే కాపరత్వంలో ఉన్నావా ? 
- నిద్ర మేలుకొని, ఉపవాసం ఉంటూ విశ్వాసులు క్షేమం కోసం తెల్లవారు జామున మోకరించి కన్నీళ్లు కార్చే కాపరత్వంలో ఉన్నావా ?

మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రాణం పెట్టిన కాపరియైన యేసయ్య మందలో, ఆయన కాపరత్వంలో
నీవుండగలిగితే? ఆయనను వెంబడించగలిగితే? అది అగ్ని గుండమైనా ఆహ్లాదకరమే! 

యేసయ్యవైపు చూస్తూ….
ఆయననే వెంబడిస్తూ….
మీ పాస్టర్ గారిని వెంబడిస్తూ...
ఆయన ఉపదేశం అంగీకరిస్తూ...
నిత్యమైన జీవం గమ్యం వైపు సాగిపో! 
దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఆమెన్.
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*

Tuesday, 7 February 2023

మీ పిల్లలు ఆశీర్వాదాలకు సూచనలు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ పిల్లలు ఆశీర్వాదాలకు సూచనలు..

ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. యెషయా 8:18

నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీ పిల్లలు మార్గము తప్పిపోకుండా, దేవుని వలన సూచనలుగాను, మహత్కార్యములుగాను ఉండుటకు తీసుకొనవలసిన జాగ్రత్తలేమిటి ? అని మనము చూచినట్లయితే, మన పిల్లలను చిన్న తనమునుండే దేవుని మార్గములో నడిపించినవారము అవుతాము. అప్పుడే, వారు ఆ మార్గము తొలగిపోకుండా వుంటారని బైబిల్ చెబుతుందిలా,

 " బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు'' (సామెతలు 22:6) 

 మీ పిల్లల స్థితి ఎలాగున వున్నదో ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకొనండి. మీ పిల్లల జీవితాలు ఏలా వున్నాయో? ఒక్కసారి గుర్తించండి. మరియు " ఇదిగో నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలనుగా మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము'' (యెషయా 8:18)

 ఈ వచనము ప్రకారము మరియు ప్రతి కుటుంబము దైవీకమైన సంతతిని పొందవలెనని దేవుని చిత్తమై యున్నది. కాబట్టి, ఆలాగుండుటకు మీ హృదయాలను దేవునికివ్వండి, దేవుడే మీ పిల్లలను వృద్ధిపొందిస్తాడు. 

బైబిల్‌లో మోషే తల్లిదండ్రులైన అమ్రాము మరియు యాకెబెదు (సంఖ్యాకాండము 26:59). మోషే తల్లిదండ్రులను చూచినట్లయితే, వారు రాజు ఆజ్ఞను లక్ష్యపెట్టక తమ కుమారుడైన మోషేను మూడు నెలలు దాచిపెట్టిరి (నిర్గమకాండము 2:2). దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించెను. ఈ గొప్ప కార్యములో మోషేకు సహాయంగా తన సహోదరుడైన ఆహరోనును కూడ దేవుడు ఏర్పరచుకొనెను. మోషే సహోదరి అయిన మిరియాము కూడ నృత్యముతోను సంగీతముతోను దేవుని నిత్యం స్తుతించుచు ప్రవక్తిగా మారెను. వారి తల్లిదండ్రులు తమ పిల్లలను భక్తిగల మార్గములో పెంచారు గనుక వారందరు దేవుని యందు భయభక్తులతో నడుచుకొని దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవుడు తన సేవకై వారిని బహుబలంగా వాడుకొన్నాడు. 
అంతమాత్రమే కాదు, మన పిల్లలు దేవుని చేత పెంచబడిన సంతతిగా మారాలని ఆయన మన పట్ల వాంఛకలిగియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి,

 " దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాబట్టి, మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొనుడి '' (మలాకీ 2:15) 

ఈ వచనము ప్రకారము దేవుడు మీ పిల్లలను శ్రద్ధాభక్తులతో పెంచుటకును, దైవీకమైన సంతానమును అనుగ్రహించాలని ఆశించుచున్నాడు. మీ సంతానమును దేవుని యందు భయభక్తులతో పెంచుట మీ చేతిలోనే వున్నది. 

ముందుగా తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులతో జీవించుచు పిల్లలకు మార్గదర్శకముగా ఉండవలెను. ఆలాగున చేసినప్పుడు మీ పిల్లలను దైవీకమైన మార్గములో నడిపించగలరు. ఆలాగున కాకుండ, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుటే ఒకరిని ఒకరు తిట్టుకొని పోట్లాడుకొంటారు, మరికొందరు తన్నుకొంటారు కూడ. ఇది పిల్లల మనస్సులో ఒక రకమైన భయమును, బాధను కలిగిస్తుంది. కనుక వారు తమ జీవితములో ఆసక్తిని కోల్పోయి, వారి చదువులో శ్రద్ధ చూపించరు. ఆలాగున నేడు ఈ సందేశము చదువుచున్న మీరుండకుండ, మీ సంతతిని దేవుని మార్గములో నడిపించుటకు మీ పిల్లల జీవితాలను, మీ వ్యక్తిగత జీవితాలను దేవుని చేతికివ్వండి, ఆయన మీ కుటుంబము పట్ల బాధ్యత వహిస్తాడు. 

అదే విధముగా, ఒకసారి నేను ఒక చర్చిలో దేవుని సందేశమును అందించి, పుల్ పీట్ మీద నుండి క్రిందకు దిగాను. ఆ సమయములో పది సంవత్సరముల వయస్సుగల ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, " అంకుల్ మా అమ్మ నాన్న ఎప్పుడూ పోట్లాడు కొంటారెందుకు? మా అమ్మ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. కనుక ఆమె మాకు భోజనం కూడ పెట్టదు. దేవుడు మాకు సహాయము చేయాలని ప్రార్థించండి '' అని అడిగింది. ప్రియులారా, నేడు అనేక కుటుంబాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో పెరిగిన పిల్లలు ఏ విధంగా దేవుని మహిమకై సూచనలుగాను, మహత్కార్యములుగా ఉంటారు? కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు తమ ఇష్ట ప్రకారముగా ఉండుటకు వదలిపెడతారు. అటువంటి పిల్లలు తను స్నేహితులతో సమయము గడుపుతూ ఉంటారు. చివరికి వారు సమస్త దురాశలకు బానిసలై దైవోగ్రతకు పాత్రులగుచున్నారు, ఆ తరువాత తల్లిదండ్రులు తమ పిల్లల నిమిత్తము ఏడుస్తూ ఉంటారు. 

" వారితో కలిసి మన మందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడ బ్రదికించెను. కృప చేత విూరు రక్షింపబడియున్నారు '' (ఎఫెసీయులకు 2:3-5). 

అవును, నా ప్రియులారా, ఈ సందేశం ధ్యానం చేయుచున్న మిమ్మును ఆశీర్వదించుటకు దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ భూమి మీద ఎలా నీతివంతమైన జీవితమును జీవించాడో, అదేవిధముగా మనము కూడ ఈ భూమి మీద జీవించిన కాలము నీతిగా జీవించాలని ఆ ప్రభువు కోరుచున్నాడు.

 " యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు, యథార్ధవంతుల వంశపువారు దీవింపబడుదురు'' అని బైబిల్ చెప్పిన విధంగా ఎప్పుడైతే యథార్ధంగా నీతిగా జీవిస్తారో అప్పుడు ఆయన మీ తల మీద ఆశీర్వాదములు కుమ్మరించి, మిమ్మును మరియు మీ పిల్లలను సూచనలుగాను, మహత్కార్యములు జరిగించేవారినిగా మార్చి మీ పిల్లలను వర్ధిల్లజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Monday, 6 February 2023

దేవుని కృప

✝️ CHRIST TEMPLE-PRODDATUR
-దేవుని కృప..

నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది... 2కొరింథీయులకు 12:9

నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీకు తన పరిపూర్ణమైన కృపను ఇవ్వాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. నేడు మీరు బలహీనులుగా ఉన్నారని చింతించుచున్నారా? దిగులుపడకండి, దేవుడు మీ బలహీనతలను తొలగించి, మిమ్మును తన యొక్క కృపనిచ్చి బలపరచును. అందుకే నేటి వాగ్దానముగా, బైబిల్ నుండి 
2కొరింథీయులకు 12:9 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది...'' అని ప్రభువు నేడు ఈ సందేశమును చదువుచున్న మీకు సెలవిచ్చుచున్నాడు. దేవుని కృప మనకు చాలునా? అంటే, ఇది అన్నిటికంటే అత్యధికమైనది. అందుకే యాకోబు 4:6వ వచనమును మనము చూచినట్లయితే, " ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును '' అని లేఖనము చెప్పుచున్నది. అవును, దేవుని కృపను మనకు విస్తారముగా కుమ్మరించబడుతుంది. దేవుడు మన లోపాలను జయించుటకు మనలను అంత ఎక్కువ కృపతో నింపుచున్నాడు. కాబట్టి, దేవుని కృపను అంత తేలికగా తలంచకండి. దేవుని కృప అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనది.

నా ప్రియులారా, మనం కోరినదానిని చేయగలమని మరియు ఆయన కృప మనల్ని స్థిరపరుస్తుందని మనం చెప్పవచ్చును. కానీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీ లోపాలను దాచడానికి ఎప్పుడు కూడ ప్రయత్నించకండి. ఎందుకంటే, అవి మీకు ఏ విధంగాను సహాయపడదు. నేడు, మీరు మీ శత్రువులచేత మోసపోకండి. ప్రతిరోజు, మన పాపాలను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చిన్నది కావచ్చును లేదా పెద్దది కావచ్చును. కానీ, మనము వర్ధిల్లాలంటే, మన పాపాలను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టడం ఎంతో ప్రాముఖ్యం. బైబిల్‌లో సామెతలు 28:13వ వచనమును చూచినట్లయితే, " అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును '' అన్న వచనము ప్రకారము మీ పాపములను ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, మీరు అపజయమును పొందుకుంటారు. కానీ, మీరు మీ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే, దేవుని కనికరమును పొందుకొనుటకు, ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు. ఈ రోజు కూడా, ఈ సందేశమును చదువుచున్న మీ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నిశ్చయముగా, మీరు వర్థిల్లుతారు.
మేము ఒకసారి పశ్చిమ గోదావరికి వెళ్లినప్పుడు, ఒక యువకుడు ఇలా తన సాక్ష్యమును పంచుకున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సిగరెట్ త్రాగేవాడు. కానీ, దినములు గడిచిన కొలది, మాదకద్రవ్యములను అంటే త్రాగుడుకు ఆలవాటు పడుటకు ప్రారంభించాడు. తద్వారా, అతడు తన జీవితంలో అపజయాలను ఎదుర్కొన్నాడు. కానీ, ఒకరోజు అతడు, వారి ఇంటికి సమీపంలోని చర్చిలో వస్తున్న దేవుని వాక్యము విని అతను తన చెడు అలవాట్లన్నింటిని తలంచుకుని తాను ఒక పాపిగాను మరియు దోషిగా ఎంచుకున్నాడు. ఆలా భావించినప్పుడు ప్రభువు అతన్ని తాకాడు మరియు అతను నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. అతను నిజంగా తన పాపాలను మరియు అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టినందున అతడు దేవుని సమృద్ధిని పొందుకున్నాడు. అతను తన పరీక్షలలో 80% మార్కులతో ఉత్తీర్ణతను సాధించాడు. ప్రభువు ఈ రోజు అతనికి ఒక చక్కటి ఉద్యోగమును అనుగ్రహించాడు. ఈరోజు తన ఉద్యోగంతో పాటు ప్రభువు కోసం పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు అతడు ఎంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో మీకు తెలుసా? అతను తనను తాను తగ్గించుకున్నాడు మరియు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. ప్రభువు యొక్క బలమైన హస్తం అతనిని ఉన్నత స్థానమునకు హెచ్చించినది. కాబట్టి, నా ప్రియులారా, నేడు అదే హస్తం మీ మీదికి దిగివస్తుంది. ఆయన తన కృపను మీ మీద విస్తారంగా కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన సంపూర్ణమైన కృపను పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే, దేవునికి మిమ్మును మీరు సమర్పించుకోండి, మీ బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమగునట్లు చేసి, మీ బలహీనతలను తొలగించి, మిమ్మల్ని తన దైవీకమైన కృపతో నింపి మిమ్మును దీవించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Saturday, 4 February 2023

మీకు అప్పగించిన పరిచర్యను నెరవేర్చండి..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీకు అప్పగించిన పరిచర్యను నెరవేర్చండి..

కొలొస్సయులకు 4:17 "మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి."

మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యక్రమాలలో, కీర్తనలు పాడటానికి, వాయిధ్యములు ద్వారా సంగీతము ఆలపించడానికి, సంఘ పెద్దగా వుండి సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి, సేవకునికి పరిచర్యలో శిష్యునిగా వుండటానికి, సేవకునికి అండగా నిలవడానికి, లేదా పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప్రత్యేక పిలుపు అయి ఉండవచ్చు.

గుర్తుంచుకోండి, ఈ పరిచర్య మీకు ప్రభువు వలన అనుగ్రహించబడినది. పరిచర్య లేదా పిలుపు ప్రభువు ద్వారా నేరుగా ఇవ్వబడింది, బహుశా ప్రవచనంలో లేదా ఉన్నతమైన పిలుపు ద్వారా ఇవ్వబడింది. అయితే, విధేయత మరియు విశ్వాసంతో ఈ పరిచర్యలో మన పనులను మనం నెరవేర్చాలి.

కొన్ని సార్లు మనకు అప్పజెప్పిన పని చేయుటలో మనం వెనుకంజ వేస్తూ ఉంటాము? కారణం ఏమై యుండవచ్చు? మీరు పరిచర్య చేయడానికి అర్హులు కాదనే భయమా? లేదా సేవకుని మాట లెక్కజేయకుండా ఇష్టానుసారం జీవించడమా ? ఈ రోజు సంఘానికి రాకుండా మీకు ఏదైనా ఎమర్జెన్సీ పని  పడివుండవచ్చు..ఏది ఏమైనా దేవునికి భయపడే మనసు నీలో వుండాలి, సేవకుడు అప్పగించిన పని పూర్తి చేసి నమ్మకమైన వారిగా సంఘంలో నిలవాలి.

ప్రియమైన స్నేహితులారా, దేవుడు నిన్ను మళ్లీ అడుగు ముందుకువేయమని పిలుస్తున్నాడు. మీరు సందేహించాల్సిన అవసరం లేదు. మీరు గతాన్ని మార్చలేరు. మీరు ఇప్పటికే చేసిన దాన్ని రద్దు చేయలేరు. కానీ మీరు ఈరోజు ప్రభువు దగ్గరకు వచ్చి ఇలా చెప్పవచ్చు, "దేవా, సంకోచించినందుకు నన్ను క్షమించు. నా జీవితంలో ఈ సమయంలో మీరు నాకు అప్పగించిన పని, నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను పూర్తిగా అనుసరించాలనుకుంటున్నాను. నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను.. ఆమెన్..అని

మీకు అప్పజెప్పిన పరిచర్యలో దేవుని దిశానిర్దేశంతో ముందుకు సాగండి, ఆయన మీకు సహాయం చేయడానికి మీ పక్కనే నడుస్తాడని గ్రహించండి..సేవకుడు మీకు అప్పగించిన పని నమ్మకంగా చేయండి..దేవుని దృష్టిలో, సేవకుని దృష్టిలో నీవే ముఖ్యమైన వ్యక్తివి అవుతావు..నమ్మకంగా సేవ చేయడం వలననే దానియేలు ముఖ్యుడు అయ్యి ప్రధానమంత్రి అయ్యాడు.. ఈ రోజే ఇక నీవు నిర్ణయం తీసుకోవాలి..ప్రభువా నీవు అప్పగించిన పని చేస్తాను మా సేవకుని మాట ప్రకారం నేను నడుచుకుంటానని.. ఇప్పుడే ప్రార్థన చేసుకో దైవ ఆశీర్వాదములు పొందుకో.. ఆమెన్..

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 1 February 2023

నమ్మకమైన వానికి దీవెనలు మెండు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 నమ్మకమైన వానికి దీవెనలు మెండు..

నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20

నా ప్రియమైనవారలారా, ఈలోకములో జీవించుచున్న మనలను దేవుడు నమ్మకమైన వారినిగా చేయాలని కోరుచున్నాడు. ఎప్పుడైతే, మనము ఆలాంటి నమ్మకమైనవారముగా ఉంటున్నామో అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము మన మీదికి దిగివస్తుంది. ఈ సందేశము ధ్యానిస్తున్న మీ జీవితములో నేడు దీవెనలు లేవని చింతించుచున్నారా ? కలవరపడకండి, మన దేవుడు నమ్మకస్థుడు. కాబట్టి, మీరు కూడ ఆయన యందు నమ్మకము కలిగి జీవించాలని ఆయన మీ పట్ల వాంఛించుచున్నాడు. అందుకే " నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును '' (సామెతలు 28:20) అని బైబిల్ చెప్పిన విధంగా మీరు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకము కలిగియుందురో, అప్పుడు దేవుని దీవెనలు మీ జీవితములో మెండుగా కుమ్మరించబడతాయి. మెండైన దీవెనలు ఏలాగున కలుగుతాయనగా, మనము దేవుని యందు అన్ని విషయములలోను నమ్మకమైన వారలముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనలను మెండైన దీవెనలతో నింపుతాడు. నమ్మకమైనవాడు మెండైన దీవెనలు పొందవలయునని దేవుని ఉద్దేశము. మన శక్తిమంతుడైన దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మరియు మన కుటుంబ జీవితంలో నివసిస్తూ మనలను కాపాడుతూ బహు ఆనందముతో మనయందు సంతోషిస్తుంటాడు. దేవుని యందు నమ్మకము కలిగి జీవించాలని బైబిల్ చెప్పిన విధంగా, మన కష్టాలు, సమస్యలు ఎటువంటివాటిలో అయినా దేవుని యందు నమ్మకముతో నడిచినట్లయితే, దేవుని యొక్క గొప్ప శక్తి మీ సమస్యలను, కష్టాలను తొలగించి మీకు మెండైన దీవెనలను కుమ్మరిస్తుంది.

ఆవిధంగానే, బైబిల్లో నమ్మకత్వానికి తండ్రియైన అబ్రాహామును చూచినట్లయితే, అతడు ఎంతో నమ్మదగినవాడైయున్నాడు. అబ్రాహామును గూర్చి బైబిల్లో ఇలా వ్రాయబడియున్నది, " దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సుగలవాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే '' (నెహెమ్యా 9:7,8) అను వచనములలో అబ్రాహాము ఎంతో నమ్మకమైన వ్యక్తిగా మనకు కనిపించుచున్నాడు. కావుననే, దేవుడు అతని నమ్మకత్వాన్ని చూచి అతనిని విస్తారముగా ఆశీర్వదించియున్నాడు.

అవును నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అబ్రాహాము వలె మనలను కూడ ఆలాంటి నమ్మకమైన వ్యక్తులనుగా దేవుడు చేయాలని కోరుచున్నాడు. ఈనాటి నుండి మనము ఆలాంటి నమ్మదగిన వ్యక్తులముగా వుండుట ద్వారా దేవుడు మనలను ఆశీర్వదించబోవుచున్నాడు. అబ్రాహామును ఆశీర్వదించినట్లుగానే, అబ్రాహాము విషయములో దేవుడిచ్చినటువంటి, ఆశీర్వాదములన్నిటిని గూర్చి, మనము ఆలోచన చేస్తే.. " యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పెను '' (ఆదికాండము 12:1-3) వ వచనములలో మనము ఈ విషయాలను చదువుతాము. ఈనాడే అట్టి ఆశీర్వాదాలను మనము కోరుకుందాము. తద్వారా ఆ ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి.

నా ప్రియ స్నేహితులారా, అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు నమ్మకమైన వ్యక్తుల కొరకు ఎదురుచూస్తున్నాడు. నమ్మకమైన వ్యక్తులు ఎవరైన వున్నారా? అని ఎంతో ఆశతో ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే, ఒక వ్యక్తి నమ్మకముగా వుంటాడో, వాని హృదయములోనికి దేవుడు వస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడని " మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును'' (1 సమూయేలు 16:7; సామెతలు 21:2) వ వచనములు కూడ ఈ మాటలనే చెబుతున్నాయి. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నా డు. ఎప్పుడైతే, మన హృదయము నమ్మదగినదిగా వుంటున్నదో అప్పుడు ఆయన అట్టి నమ్మకమైన హృదయములోనికి వస్తాడు. నేడు ఆయన తన యొక్క ఆశీర్వాదాలను మన మీద వుంచబోతున్నాడు.

ఒక దేశములో ఒక యువరాజు వున్నాడు. ఆ యువరాజు జైలులో వున్న ఖైదీలను చూడడానికి ఒకరోజు వెళ్లాడు. ఎప్పుడైతే, ఆ యువరాజు ఆ జైలుకు వెళ్లియున్నాడో, ఆ ఖైదీలను గూర్చిన వివరాలన్నిటిని ఒకరి తరువాత ఒకరిని అడుగుతూ వచ్చాడు. అప్పుడు ఆ ఖైదీలందరు ఏమి చెప్పారో తెలుసా? ప్రతి ఒక్కరు, ' అయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, నన్ను తీసుకొని వచ్చి, ఇక్కడ పడవేశారు అని చెప్పేవారు.' ఇలాగున ఆ ఖైదీలుగా వున్న ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, నేను అమాయకుడను, నేను ఏ నేరము చేయలేదు, నేను అనవసరముగా ఖైదీగా బంధింపబడ్డాను అని చెప్పారు. ఎవ్వరు కూడ వారు చేసిన తప్పిదమును మరియు నేరమును ఒప్పుకున్నవారు కాదు.

అయితే, వారందరిని చూస్తూ, వారి మధ్యలో నడుస్తున్నప్పుడు, వారిలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా చూశాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతని యొద్ద కూడ ఇదే ప్రశ్న అడిగాడు. నీవు ఏ నేరం చేసి ఇక్కడకు వచ్చావు? అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి యువరాజుతో ఇలా అన్నాడు, ' యువరాజా! నేను ఒక తప్పు చేశాను, నేను ఒక వ్యక్తిని చంపేశాను, నరహత్య చేశాను, నేను ఎవరినైతే, చంపానో, ఆ యింటి వారిని గూర్చి నేను చాలా విచారిస్తున్నాను. అతని యొక్క భార్య విషయములో నేను చాలా దుఃఖిస్తున్నాను. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె యొక్క భర్త చనిపోయాడు గనుక, ఆమె గతి ఏమిటి? ఆ దినము నేను కోపముతో అతనిని చంపేశాను. కానీ, ఈదినాన నేను అతని నిమిత్తము పశ్చాత్తాప పడుచున్నాను. యువరాజా, నేను ఏ వ్యక్తినైతే చంపానో ఆ వ్యక్తి కుటుంబాన్ని మీరు పరామర్శించండి. దయచేసి ఆ కుటుంబమును మీరే పోషించాలి అని చెప్పాడు.' ఆ ఖైదీ " నన్ను బయటకు తీసుకురమ్మని'' చెప్పలేదు, ఏ కుటుంబానికి గాయము చేశాడో ఆ కుటుంబాన్ని మీరు పోషించాలని చెప్పాడు. అప్పుడు ఆ యువరాజుకు అతని మాటలకు చాలా ఆశ్చర్యమనిపించినది. అప్పుడు రాజు, ' స్నేహితుడా, నీవు నీ తప్పును అంగీకరించావు. అంతమాత్రమే కాదు, నీవు చేసిన నేరమును కూడ ఒప్పుకున్నావు, దానిని బట్టి, ఈ రోజు నిన్ను ఈ జైలునుండి విడుదల చేస్తున్నాను.నీవు నీ తప్పిదాన్ని ఒప్పుకున్నావు కనుకనే ఈ రోజు నుండి నీవు స్వతంత్రుడవు, నీవు ఖైదీవి కాదు, నేను నిన్ను క్షమిస్తున్నాను, అని చెప్పాడు. అంతమాత్రమే కాదు, నీవే వెళ్లి ఆ కుటుంబ పోషణ అంతయు చూడాలి దానికి కావలసిన ధనమునంతటిని నేను నీకిస్తాను అని చెప్పాడు. '

చూశారా నా ప్రియ స్నేహితులారా, " మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును '' (1యోహాను 1:9; అపొస్తలుల కార్యము 10:35), ఈ వచనములను మనము చదివినట్లయితే, మనము దేవుని యొద్దకు వెళ్లినప్పుడు, మన తప్పిదములను మనము ఒప్పుకున్నప్పుడు, పై చెప్పబడిన ఆ యొక్క ఖైదీ తన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో, ఆలాగుననే, మీరు కూడ మీ దేవునితో " ప్రభువా, నేను ఒక పొరపాటు చేశాను, నేను పాపము చేశాను ప్రభువా, నా సహోదరునికి లేక నా తల్లిదండ్రులకు లేక నా యొక్క బిడ్డలకు విరోధముగా నేను పాపమ చేశాను, దయచేసి ప్రభువా, ఈ రోజు నన్ను క్షమించు,'' అని చెప్పండి. ఖచ్చితముగా ఆ ప్రభువు మనలను క్షమిస్తాడు. ఆయన కనికరము గలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని నమ్మదగిన వ్యక్తులనుగా చేస్తున్నాడు, కాబట్టి, ఈదినమున మనము ఏ తప్పిదమైనను, పొరపాటుయైనను, చేసినట్లయితే, అది ఆ ప్రభువు దగ్గర ఒప్పుకుందాము. ఎప్పుడైతే, మనము ఆలాగుననే ఒప్పుకుంటామో ఆయన మన యొక్క హృదయాన్ని నమ్మకమైన హృదయాన్నిగా మార్చును. అప్పుడు అబ్రాహాము వలె దేవుని యొక్క ఆశీర్వాదములను సంపాదించుకొనగలము.

ఈ ఉదయకాల సమయములో నా ప్రియులారా, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, మనము పొరపాటులన్నిటిని ఒప్పుకొని, నమ్మకమైన బిడ్డలుగా జీవించవలెను. ఈ ఆశీర్వాదాలను పొందుకొనుటకు ఇదొక్కటే మార్గముగా వున్నది. ఈరోజు మనము ఆలాగున మన పాపములను ఒప్పుకున్నట్లయితే, దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మనలందరిని కూడ నమ్మకమైన వ్యక్తులనుగా చేస్తున్నాడు. ఈ సందేశం ధ్యానం చేయుచున్న మీరు కూడా మీ పనులన్నింటిలో, మీ జీవితములోను నమ్మకస్థులై వుంటే ఏ ఒక్కరూ మీపై తప్పుడు ఆరోపణ చేయలేరు. మీరు నిత్యము దేవునికి నమ్మకస్థులుగా జీవించాలని దేవుని చిత్తమై యున్నది. ఎప్పుడైతే మీరు దేవుని యందు నమ్మకముగా వుంటారో అప్పుడు తప్పక కృపాక్షేమాలు మీకు కలుగుతాయి. మీరు చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయుచు ఆయన మీలో నివసించి మీ కార్యాలన్నిటిని సఫలపరచి మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR