- సేవకులకు సలహా -
సేవకులకు సలహా -
👉 *1. బ్రతుకు భారమై సేవకు రాకు, ఆత్మల భార మెక్కువై సేవకు రా*
👉 *2. నీ ఆకలి తీర్చుకొనుటకు సేవకు రాకు, అనేకుల ఆత్మీయ ఆకలి తీర్చుటకు సేవకు రా*
👉 *3.సంఘ రాబడి కోసం సేవకు రాకు, సంఘములో అనేకులను చేర్చడం కోసం సేవకు రా*
👉 *4. ఆధిక్యతల కోసం సేవకు రాకు, అణుకువ కలిగియుండుటకు సేవకు రా*
👉 *5. ప్రతి అవసరత కోసం ప్రజల వైపు చూచుటకు సేవకు రాకు, ప్రభువు వైపు చూచుటకు సేవకు రా*
👉 *6. ప్రజల మీద నమ్మకంతో సేవకు రాకు, ప్రభువు మీద నమ్మకముతో సేవకు రా*
👉 *7. నీ వృద్ధాప్యపు ప్రారంభములో సేవకు రాకు, యౌవన కాలం ప్రారంభములో సేవకు రా*
👉 *8. సంఘములో లేఖన సత్యాలను నేర్చుకోకుండా సేవకు రాకు, లేఖన సత్యాలను నేర్చుకొని సేవకు రా*
👉 *9. ప్రభువు పిలుపు లేకుండా సంఘ సాక్షము లేకుండా సేవకు రాకు, ప్రభువు పిలుపు సంఘ సాక్ష్యము కలిగి సేవకు రా*
👉 *10. నీ పేరు కోసం సేవకు రాకు, ప్రభువు పేరు మహిమ పరచడం కోసం రా*
✅ _అప్పుడు ప్రభువు నిన్ను సేవలో వాడుకుంటాడు.. తద్వార దేవునికి మహిమ కలుగుతుంది!_
👉 *అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము(తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన(కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.*
-యాకోబు 3: 2
Comments