పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు.
✝️ CHRIST TEMPLE-PRODDATUR -పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు. (గమనిక: బైబిల్ గ్రంధం ఆత్మీయ మర్మాల నిలయం. రోజూ చదువుతున్న.. ప్రతీరోజూ రోజుకో కోణంలో దేవుడు మాట్లాడుతారు. ఈ భాగం ద్వారా నాకు అర్ధమైంది మాత్రం నేను వ్రాస్తున్నాను. మరొకరికి దేవుడు మరో విధంగా మాట్లాడి ఉండొచ్చు!!) అందుకు యేసు: ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. లూకా 19:9. మనం ఇంతవరకు జక్కయ్య పాపపు పట్టణమైన యెరికోవాసి అని, సుంకపుగుత్తదారుడని, ధనవంతుడు గాని యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు గాని పొట్టివాడైనందున, జనులు గుంపుకూడి ఉన్నందున చూడలేక మేడిచెట్టు ఎక్కి కూర్చొంటే యేసుప్రభులవారు ఆ చెట్టు దగ్గరికే వచ్చి జక్కయ్యని పిలిచారు. అప్పుడు జక్కయ్య తనగృహములోనికి యేసయ్యని సంతోషముతో ఆహ్వానించినట్లు ధ్యానించాము. అయితే ఇక్కడ ఎప్పుడైతే తన ఆస్తిలో సగం బీదలకిచ్చాడో, తను అన్యాయం చేసినవారికి న్యాయం చేసాడో, యేసుప్రభులవారు తన నోటితో ప్రాముఖ్యమైన మాట అంటున్నారు: ఇతడును అబ్రహాము కుమారుడే! ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. అంటే ఎవరైతే మార్పునొంది రక్షింపబడతారో వారందరూ అబ్రహాము సంతానమన్న మ...