మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి..
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మాంత్రికుల శక్తి v/s దేవుని శక్తి.. మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా యెహోవా మోషే మాటచొప్పున చేసెను. (నిర్గమ 8:12,13) ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషే, అహరోనులు దేవుడు పంపించారు. అయితే, దేవుడు ముందుగానే తెలియజేసారు, ఫరో అంత తేలికగా నా ప్రజలను పంపించడని. దేవుని మాట చొప్పన ఫరో ఎదుట, మోషే, అహరోనులు అద్భుతాలు చెయ్యడం మొదలుపెట్టారు. కర్రను పాముగా మార్చారు. ఐగుప్తు మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. చివరకు అహరోను కర్ర. ఆ మాంత్రికులు కర్రలను మ్రింగివేసింది. రెండవసారి నీటిని రక్తంగా మార్చగా. ఆ మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. మూడవసారి నదిలోని కప్పలను ఐగుప్తీయుల ఇండ్లలోకి రప్పింపగా. ఐగుప్తీయుల మాంత్రికులు కూడా అట్లా చేయగలిగారు. దేశమంతా కప్పలతో నిండిపోయాయి. చివరకు పిండి పిసికే తొట్లలోకూడా కప్పలు. అడుగుతీసి అడుగువేస్తే కప్పలే. మోషే, అహరోనులవలే మాంత్రికులు నదీలోనున్న కప్పలను భూమిమీదకు రప్పించగలిగారుగాని వాటిని చంపడానికి గాని, తిర...