Posts

Showing posts with the label మీకు అప్పగించిన పని కచ్చితంగా నెరవేర్చండి..

మీకు అప్పగించిన పని కచ్చితంగా నెరవేర్చండి..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - మీకు అప్పగించిన పని కచ్చితంగా నెరవేర్చండి.. (సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు, సంఘస్తులకు ఒక హెచ్చరిక సందేశం)  మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి. - కొలొస్సయులకు 4:17 మనలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య కోసం పిలువబడినవారము, బహుశా సంఘ కార్యాలలో, లైవ్ ప్రేయర్ మీటింగ్, గాస్పల్ మీటింగ్స్, పిల్లల మధ్య లేదా పెద్దల మధ్య పరిచర్య, ప్రార్థన సహవాసం లేదా మన ముందు ఉంచబడిన ఏదైనా ప్రత్యేక పిలుపు అయి ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ఈ పరిచర్య మీకు మీ పాస్టర్ గారు అప్పగించింది కాదు.. ప్రభువు వలన మీకు అనుగ్రహించబడినది. పరిచర్య లేదా పిలుపు ప్రభువు ద్వారా నేరుగా ఇవ్వబడింది, బహుశా ప్రవచనంలో లేదా ఉన్నతమైన పిలుపు ద్వారా ఇవ్వబడింది. అయితే, విధేయత మరియు విశ్వాసంతో ఈ పరిచర్యలో మన పనులను మనం నమ్మకంగా నెరవేర్చాలి. కొన్ని సార్లు మనకు అప్పజెప్పిన పని చేయుటలో మనం వెనుకంజ వేస్తూ ఉంటాము? కారణం ఏమై యుండవచ్చు? మీరు పరిచర్య చేయడానికి అర్హులు కాదనే భయమా? లేక నిర్లక్షమా ? లేక సోమరితనమా ? లేదా ఈ రోజు మిమ్మల్ని ఆపేది ఏదైనా...