మీరు చాలా బిజీగా ఉన్నారా ?
✝️ CHRIST TEMPLE-PRODDATUR మీరు చాలా బిజీగా ఉన్నారా ? తినడం, పని చేయడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం, చదవడం, వినోదం, సంభాషణలు, సువార్త ప్రకటించడం, ప్రార్థించడం వంటి పనులకు, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అయితే, ఈ విషయాలకు మన దినచర్యలో ఎంత సమయం కేటాయించాలో మీ సమయ నిష్పత్తిని నిర్దేశించే నిర్దిష్ట నియమాలు బైబిల్‌లో లేవు. నా ఇంటి ముందు వాకిట ఒక చక్కని మొక్క ఉంది, అది తాజాగా కనిపిస్తుంది. ప్రతిరోజు నేను దానికి నీళ్ళు పోస్తూ సమయం గడుపుతున్నాను. ఆ మొక్క పచ్చగా ఉండడం గమించాను. నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్న సందర్భాల్లో, సమయం గడపలేకపోయాను. అనుకోకుండా వర్షాకాలం కావడంతో దానికి నీళ్ళు సమృద్దిగా దొరకడం ద్వారా నేను నీళ్ళు పోయకపోయినా ఆ మొక్క పచ్చగా కనిపించింది. సరేలే ఆ మొక్క బాగానే ఉందనుకొని కొన్ని వారాల తరువాత నా బిజీ షెడ్యూల్‌తో, నేను మొక్క గురించి పూర్తిగా మరచిపోయాను. అనుకోకుండా ఒకరోజు నా ఇంటి వాకిట వున్న మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మొక్కకు ఒక ఎండిన కొమ్మను గమనించాను. అయ్యో నీళ్ళు పోయలేకపోయానే.. అనుకొన్నాను, నాలో కొంత బాధ కలిగింది. ఒక పాస్టర్ గా మీ జీవితం కొ...