యేసు ప్రభువు సిలువ యాత్ర
🙏 *Christ Temple- Pdtr*🙏 Telugu Bible Sermons by Pastor.Nakkolla Balasubramanyam Daniel యేసు ప్రభువు సిలువ యాత్ర యెరూషలేము నుండి కల్వరి కొండకు సాగిన సిలువయాత్రలో అనేకమంది ఆయనను వెంబడించిరి. ఆ జన సమూహంలో అనేక గుంపుల ప్రజలు వుండవచ్చును కాని ప్రాముఖ్యంగా మూడు గుంపులను లూకా 23:26-28 నుండి ధ్యానిద్దాం. 1.అపహసించి, సిలువవేసిన గుంపు సిలువ యాత్రలో గెత్సెమనె తోట నుండి వేదన ప్రారంభమయినది మొదలు తుది శ్వాస విడిచే వరకు పలునిందలు, శ్రమలు చెప్పశక్యము కాని బాధను అనుభవించెను. ఈ యాత్రలో మొదటి గుంపు అపహసించి, బాధించిన గుంపు. ఆయనను అనేక రీతులుగా బాధించిరి. 1. ముఖము మీద ఉమ్మిరి, 2. ముఖముపై గుద్దిరి, 3. అరచేతులతో కొట్టిరి, 4. కొరడా దెబ్బలు 39 సార్లు కొట్టిరి, 5. ముళ్ళ కిరీటం, 6. రెల్లుతో తల మీద కొట్టిరి, 7. కాలు మీద కాలుపెట్టి కరుకైన మేకు, 8. చేతులలో మేకులు, 9. అనేక నేరములు మోపిరి, 10. దూషించిరి, 11. అపహసించిరి, 12. ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచి, 13. బరువైన శర...