Posts

Showing posts with the label నీకు ఒక రహస్యం చెప్తున్నా..విను..

నీకు ఒక రహస్యం చెప్తున్నా..విను..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - నీకు ఒక రహస్యం చెప్తున్నా..విను.. నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మా ఉపాధ్యాయుడు ఒక విషయం చెప్తూ ఉండేవాడు - జీవితం అంటే జిలేబి కాదు, ముళ్ళున్న గులాబి అని. వాస్తవమే కదా! అందమైన గులాబి పువ్వుకు ముళ్ళు ఎలా ఉంటాయో, అందమైన జీవితంలో శ్రమలు కూడా తప్పవు. చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు నాకే ఎందుకు కలిగింది అని బాధపడడం కంటే వాటిని పట్టుకున్నప్ప్పుడే కదా రాబోయే శ్రమలను తట్టుకునే శక్తిని, అనుభవాన్ని పొందగలం. శ్రమ, సంతోషం ఈ రెండూ మన జీవితంలో రెండు కళ్ళలాంటివి; ఏ ఒక్కటి లేకున్నా జీవితం మనకు అందంగా కనబడదు.  శ్రమల నడుమ ఉన్నప్పుడు, ఆ శ్రమ విచారము వలన కావచ్చు, అనారోగ్యం వలన కావచ్చు లేదా "మన" అనే వాళ్ళే మనల్ని మోసం చేసియుండ వచ్చు. ఈ రోజు నుండి నీకు నేను తోడు వున్నా అని చెప్పినవాళ్ళు రేపు నిన్ను అనరాని మాటలు అనవచ్చు..ఆర్థిక ఇబ్బందులూ వుండవచ్చు ఈ శ్రమ మనకు క్రుంగుదలతోపాటు కొంత భయాన్ని కూడా జతచేసి మనల్ని ఒంటరితనంలోనికి నెట్టేస్తుంది. ఇంకెంత కాలం నాకీ కష్టాలు అని అనుకునే వారు ఎవరు లేరు ? చెప్పండి. నేడు ఉన్న కష్టం రేపు కూడా ఉండవచ్చు కాని మనలో ఉండే ఓర్పు, సహన...