Posts

Showing posts with the label మీ ప్రార్థన పరిమళ ధూపముగా..

మీ ప్రార్థన పరిమళ ధూపముగా..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మీ ప్రార్థన పరిమళ ధూపముగా.. ...పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను... యెహెజ్కేలు 20:41 నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించుచున్నాడు. అందుకే నేడు బైబిల్ నుండి ఈ రోజు వాగ్దానంగా మనం  యెహెజ్కేలు 20:41వ వచనమును ధ్యానముగా తీసుకొనబడియున్నాము. ఆ వచనమేమనగా, " జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనుల యెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును ''  అని చెప్పబడిన వాగ్దాన వచనాన్ని ధ్యానించబోవుచున్నాము. అవును నా స్నేహితులారా, ఆలాగుననే మీరు దేవునికి అటువంటి పరిమళ ధూపంగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు ప్రభువునందు ఎల్లప్పుడు ఆనందించండి. అయితే దీని అర్థం ఏమిటి? బైబిల్‌లో, లూకా 18:9-14 వ వచనములలో చూచినట్లయితే, యేసు తన శిష్యులకు ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన...