Posts

Showing posts with the label - పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని

- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ?

Image
- పరిశుద్ధ గ్రంథ స్థానాన్ని, మొబైల్ తీసుకొంటుందా ? - నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. - కీర్తన 119:50 నీ యవ్వనంలో నీవు బైబిల్ మోస్తే? అది నీ వృద్ధాప్యమందు నిన్ను మోస్తుంది. కానీ, నేటిదినాలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బైబిల్ స్థానాన్ని చాలా వరకు మొబైల్ తీసుకుందనే చెప్పాలి. దేవుని మందిరాలకు సహితం, బైబిల్ లేకుండా మొబైల్ తోనే వెళ్లేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అదేంటి అంటే? మొబైల్ లో పరిశుద్ధ గ్రంధం యాప్ వుంది కదా? అంటూ వాదించేవారు కోకొల్లలు. అవును వున్న మాట వాస్తవమే. పరిశుద్ధ గ్రంధముతో పాటు, అపరిశుద్ధమైన అశ్లీల చిత్రాలు కూడా వున్నాయి. నీవు వద్దనుకున్నా యాడ్స్ రూపంలో అవి దర్శనమిస్తూనే ఉంటాయి. మొబైల్ ని ఒక స్టేటస్ గా చూడొద్దు. బైబిల్ ను మోయడానికి సిగ్గుపడొద్దు. మొబైల్ నీచేతిలో ఉన్నంత మాత్రాన అది గర్వించదగిన విషయం కాదుగాని, పరిశుద్ధ గ్రంధం నీ చేతిలో వుంటే మాత్రం అది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే. 🔅మొబైల్ లో బైబిల్ చదివితే ఏమవుతుంది?  🔹అది పరిశుద్ధ గ్రంధము అనే అనుభూతి గాని, భయము గాని కలుగదు. 🔹తద్వారా దేవుని సన్నిధిని,...