అవసరమా? కోరికా?
✝️ CHRIST TEMPLE-PRODDATUR - అవసరమా? కోరికా? విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఒక రాజు ఉండేవాడు. తన జీవితంలో ఆ రాజు సంతోషం, సంతృప్తి చెందలేకపోయాడు. ఒకరోజు తన సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయడం చూశాడు. ఆ రాజు తన సేవకుడు ఎలా సంతోషంగా జీవుస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు, "నేను సేవకుడిని తప్ప మరొకటి కాదు, నా కుటుంబానికి నా స్థోమత మించిన అవసరతలు లేవు ,ఉండడానికి ఇల్లు కడుపు నిండా భోజనం ఉంది" చాలు..దేవునికి రోజు కృతజ్ఞత చెల్లిస్తూ బ్రతుకుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని సెలవిచ్చాడు. ఆ సమాధానంతో రాజు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇతడు జీవితంలో ఏ కోరికా లేకుండా జీవిస్తున్నాడా ? లేక నటిస్తున్నాడా ? తెలుసుకోవాలి అనుకొని.. ఆ రాత్రి తన సేవకుడిని పరీక్షిస్తూ, రాజు రహస్యంగా 99 బంగారు నాణాల సంచిని తన సేవకుడి వాకిలి గుమ్మం వద్ద వదలమని తన పనివారిని ఆదేశించాడు. గుమ్మము వద్ద సంచిని చూసిన ఆ సేవకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సంచిని తెరిచి ఆశ్చర్యపోయిన అతడు, వాటిని లెక్కించడం ప్రారంభించాడు. 99 నాణేలే ఉన్నాయని నిర్ధారించుకొని, “ఆ ఒక్క బంగారు నాణెం ఏమైయ్యుం...