*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
దావీదు దేవుని హృదయానుసారుడు..కానీ..
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
కీర్తనలు 51:7
గొల్యాతుపై విజయం దావీదును ఉన్నత శిఖరం ఎక్కిస్తే? బెత్సేబతో పాపం దావీదును అధః పాతాళానికి త్రొక్కేసింది.
దేవుని హృదయాను సారుడు అపవిత్రుడై పోయాడు.
పశ్చాత్తాపముతో తిరిగి పవిత్రతలోనికి ప్రవేశించాలని, ఆయనతో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందుకోవాలనే తృష్ణ కలిగియున్నాడు. ఈ లోకంలో ఏ జంతువుల రక్తము అతనిని పవిత్రీకరించలేదు. పవిత్రీకరించ గలిగేవాడు దేవుడు ఒక్కడే. అందుకే ఆయన పాదాల చెంతచేరి ప్రాధేయపడుతున్నాడు.
"హిస్సోపు" అనేది ఒక చిన్న చెట్టు పేరు. పాతనిబంధన కాలంలో జంతుబలి రక్తాన్ని చిలుకరించేందుకు ఈ హిస్సోపు మొక్కను వాడేవారట.
యాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
లేవీకాండము 14:4
ఆ హిస్సోపుతో చిలుకరించబడే జంతు రక్తం, పాపమును శుద్ధిచేసే క్రీస్తు రక్తానికి సూచన.
"అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును."
1 యోహాను 1:7
దావీదు తన రక్తాపరాధామును, రక్తపు డాగులను శుద్ధి చెయ్యమని, అవి మంచుకంటే తెల్లగా వుండాలని, అట్లాంటి పరిశుద్దత లోనికి నడిపించమని ప్రార్దిస్తున్నాడు.
"యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును."
యెషయ 1:18
అవును!
ఆ కల్వరి గొల్గోతలో నీ ప్రియ రక్షకుడైన యేసయ్య చిందించిన రుధిరధారలే నీ పాపాన్ని హిమముకంటే తెల్లగా శుద్దీకరించ గలదు.
దావీదు చేరిన ఆ పశ్చాత్తాప అనుభవంలోనికి మనము చేరాలి. విరిగి నలిగిన దీనమనస్సుతో ఈ చిన్న ప్రార్ధన చేయగలగాలి.
"నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము."
ప్రార్ధిద్దాం!
పవిత్ర పరచబడదాం!
ఆయన సాక్షిగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
No comments:
Post a Comment