విశ్వాసము

✝️ CHRIST TEMPLE-PRODDATUR
విశ్వాసము
 
ఒకవేళ పాస్ పోర్ట్, వీసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్లిపోగలవేమో గాని, యేసు క్రీస్తు లేకుండా, నిత్యరాజ్యం చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు. 
 
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. 
           యోహాను 14:6
 
నిత్యజీవాన్ని నీవు చేరాలంటే? దాని 'మార్గమైన' యేసు ప్రభువును నీవు చేరాలి. 'విశ్వాసమే' నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు. 
 
 *1. 'విశ్వాసమే' రక్షణకు మార్గము.*
 
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.
               ఎఫెస్సి 2:8
 
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును (మార్కు ‪16:16‬)
 
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9)
 
*2. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఆయన పిల్లలు.*
 
తన్ను ఎందరంగీకరించితిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను ‪1:12‬)
 
*3. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.*
 
కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. (యోహాను ‪6:47‬)
 
*4. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు తీర్పులోనికి రారు.*
 
ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు.
               యోహాను ‪3:36‬
 
*5. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు.*
 
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను ‪3:16‬
 
దేవుని రాకడ సమీపం కానుంది. అబద్దబోధకులు యేసు క్రీస్తు దేవుడు కాదని అసత్య ప్రకటనలు ముమ్మరం  చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంధము 'సాతాను సమాజము' అని పిలుస్తుంది. 
 
అయితే ఒక్క విషయం ఆలోచించు!!! 
యేసు క్రీస్తును దేవునినిగా,  అంగీకరించనివారు, విశ్వసించనివారు 
🔸ఎట్లా రక్షించ బడతారు? 
🔸ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు? 
🔸ఎట్లా ఎత్తబడే సంఘములో వుంటారు?
🔸ఎట్లా తీర్పు నుండి తప్పించ బడతారు?
🔸ఎట్లా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు? 
 
🔹సాధ్యం కానేకాదు. 
🔹నిత్య మరణమే వారి గమ్యం. 
 
వద్దు! యేసే దేవుడని విశ్వసిద్దాం! ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments