మోహపు చూపుతో..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మోహపు చూపుతో..

ప్రభువైనయేసు కొండమీద ప్రసంగంలో ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన యెడల అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి అతడు రెండు కళ్ళతో నరకానికి వెళ్ళుటకంటే ఒక కంటిని పెరికివేయుట మంచిదని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి అలవాటుగా ఎల్లప్పుడు మోహపు చూపు చూస్తూనే ఉన్నట్లయితే అతడు నరకానికి కూడా వెళ్ళవచ్చునని ప్రభువు చెప్పారు.

ఆదాము కాలము నుండి ఈనాటివరకు ఒక మనిషి హృదయములో ఉన్న ఆ మోహమనే తలంపు ప్రతి మనిషి హృదయంలో ఉన్నది. పరిశుద్ధాత్మయొక్క అగ్ని మాత్రమే దీనిని నశింపజేయగలదు. నీ హృదయము పాపము చేయుటకు దురాశలో మండుచుండవచ్చు లేక ప్రభువైనయేసు కొరకు ప్రేమతో మండుచుండవచ్చు. *నీవు ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ఒకటి ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరచే అగ్ని లేక భవిష్యత్తులో నిన్ను కాల్చే అగ్ని. మరొకమార్గం లేదు.*

ప్రభువు మాట్లాడిన యూదా ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నత ప్రమాణాలు కలిగియున్నారు. వారు అంత ఖచ్చితముగా ధర్మశాస్త్రమును వెంబడించుటవలన వ్యభిచారులుగా జీవిస్తున్న వారిని చంపి శిక్షించేవారు. ఇప్పటిలాగా లైంగిక సంబంధ పుస్తకములు, పత్రికలు లేక టి.వి కార్యక్రమాలు ఉండెడివి కావు. ఇవి మనుష్యులను జారత్వములోనికి నడుపును.

👉 ప్రతి స్త్రీ కూడా మంచి వస్త్రధారణ కలిగియుండి మరియు పురుషులు స్త్రీలు ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు.
👉 అటువంటి నియమములు కలిగిన సమాజంలో కూడా పురుషులు స్త్రీలను మోహపు చూపు చూస్తారని ప్రభువుకు తెలియును కాబట్టి ఆయన శిష్యులను ఈ విషయంలో హెచ్చరించారు. 

అటువంటి సమాజంలో కూడా ఆ హెచ్చిరిక అవసరమైతే ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో ఆ హెచ్చరిక ఎంత అవసరమో కదా!

మనలో లైంగిక వాంఛలు కలుగజేయుటకు ఈనాటి సమాజం అనేక విధములుగా మన మనసులలోనికి చొచ్చుకొనుచున్నది. కాబట్టి ఈ దినములలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యామోహం అను తలంపు నీవు తీవ్రముగా తీసివేయాలనుకుంటే, వాటన్నిటిని మనం విసర్జించుటకు జాగ్రత్తగా ఉండాలి. కనికరము లేకుండా, తీవ్రముగా ఆ తలంపును నీవు నశింపజేయాలి.

నీకంటిని మరియు నీ చేయిని పెరికి పారవేయుట అనగా అర్ధమిదియే. మనం పాపము చేయుటకు కారణమైన దానిని నశింపజేయమని యేసు ఆజ్ఞాపించారు. పాపము యొక్క ప్రమాదం మరియు నరకాగ్ని గురించి ప్రభువైన యేసుకు తెలుసు కనుక పాపమునుండి మనం రక్షింపబడుటకు మనం ఈ విధంగా పెరికివేయాలని ప్రభువైన యేసు చెప్పారు.

ప్రభువుయొక్క ఆజ్ఞలను మనం ఈ విధముగా అన్వయించుకోవచ్చు. 

👉టి.వి లో ప్రోగ్రామ్స్ లేదా సినిమాలు, లేదా నీ మొబైల్ లో వచ్చే అసభ్య వీడియోలు, అసభ్య సైట్స్ ఒకవేళ నీ మనస్సులో పాపవిషయపు కోరికలను కలుగజేసినట్లయితే వెంటనే దానిని విడిచిపెట్టుము. టి.విలో నీవు చూసిన నటులను బట్టి నీవు నరకానికి వెళ్ళుటకంటే, టి.విలో ఆ కార్యక్రమాలు చూడకుండా పరలోకం వెళ్ళుట ఎంతో మంచిది. ఏదైనా సినిమాలో వచ్చే అసభ్య నృత్యం నిన్ను పాపము చేయుటకు ప్రేరేపించినయెడల, నీవు చూడడం మానివెయ్యి. నీవు పరలోకాన్ని పోగొట్టుకొని నరకానికి నడిపించేటంత విలువైనదేదియు ఈ భూమిమీద మనకు లేదు.

నీవు ఈ సందేశమును చదువుచుండగా..ఆహా ఈ దానియేలు పాస్టర్ ఏం చెప్పినాడు..అబ్బో.. ఆ చిన్న విషయమును చేస్తూ ఉండడం వలన నీవు నరకానికి వెళ్ళనని సాతాను నీతో చెపుతాడు. నీ మొబైల్ లో, సినిమాల్లో అశ్లీల డాన్స్ లు, అర్ధనగ్న వస్త్రాలతో నేటి తరం సినిమాలు చూచి నీవు మోహించుచు ఉండుటకాని లేక టి.విలో నీవు ఎవరినైనూ చూస్తూ ఉండటం వ్యభిచారం కాదని సాతాను చెపుతాడు. అతడు మొదటినుండి అబద్ధికుడని  ప్రభువైనయేసు చెప్పాడు కనుక అతని స్వరాన్ని వినవద్దు. జాగ్రత్త...

ఈ పాపము గురించి నీవు ఇలా చెప్పవద్దు, "భవిష్యత్తులో నేను కొంచెం మెరుగ్గా ఉంటాను లేక భవిష్యత్తులో దీనిని విడిచిపెట్టుటకు ప్రయత్నిస్తాను". కీడుగా కనబడేదానినుండి వెళ్ళిపొమ్మని బైబిలు చెప్పుచున్నది. ఈ పాపమును వెంటనే మరియు పూర్తిగా విడిచిపెట్టుటకు దేవుడు నీకు సహాయం చేస్తాడని పూర్తిగా విశ్వసించు. ఈ రోజునుండి ఈ పోరాటం ఆరంభించు. జీవముగల దేవుని సైన్యములో ఉన్న నీవు, నిన్ను అపవిత్రపరచే గొల్యాతు తల నరికివేయు వరకు పోరాడుతూనే ఉండుము.

ప్రభువు తన మందిరమును మరొకసారి పవిత్రపరచుచునే ఉన్నాడు. నీ దేహమే ఆయన ఆలయమైయున్నది. దేవుడు నీలో లోతుగా పని చేయునట్లు ఆయనను అనుమతించుము.

అమ్మాయిలతో శరీరసంబంధం కలిగియుండవద్దని 1 కొరింథీ 7:1లో హెచ్చిరించబడ్డాము. పరిశుద్ధాత్ముడు దేనినైనా చెడ్డది అని చెప్పినప్పుడు(ఇక్కడ చెప్పబడినట్లు), ప్రతి విశ్వాసి ( నీవు) దానిని తిరస్కరించాలి. ధర్మశాస్త్రానుసారులు అక్షరానుసారముగా జీవిస్తారు కాని శిష్యులు, విశ్వాసులు ఆత్మతో నింపబడి ఆత్మానుసారముగా జీవిస్తారు.

ఉదాహరణకు *ఒకని హృదయములో ఒక స్త్రీ యెడల లైంగిక వ్యామోహం ఉన్నయెడల అది వ్యభిచారమని ప్రభువు చెప్పారు.* ఎందుకనగా ఏడవ ఆజ్ఞను ప్రభువు గ్రహించారు గనుక అదేవిధముగా దేవునియొక్క ఆజ్ఞలన్నిటిలో ఉన్న ఆత్మను మనం చూడగలగాలి.

పౌలు, తిమోతి పత్రికలో ఇట్లు చెప్పాడు. యౌవ్వనస్థులకు కలిగే శోధనల నుండి పారిపొమ్ము 2తిమోతి 2:22. అటువంటి శోధనల నుండి నీవు పారిపోవాలి.

 అట్టి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Comments