✝️ CHRIST TEMPLE-PRODDATUR
నిందలు బరించడం కూడా గొప్ప భాగ్యమే..
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీ 11:24-26
*మోషే:*
▪️ఐగుప్తీయుల సకలవిద్యలను అభ్యసించినవాడు.
▪️మాటలయందును, కార్యములయందును ప్రవీణుడు. అపో 7:22
అంతటి ప్రావీణ్యం పొందిన మోషే అరణ్యంలో తన మామ మందలను మేపుతున్నాడు. నిర్గమ 3:1
కారణం? మోషే తేల్చుకోవలసిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి.
▪️దేవుడా?
▪️లోకమా?
▪️ఐగుప్తు ధనమా?
▪️క్రీస్తువిషయమైన నిందా?
▪️అల్పకాల పాపభోగమా?
▪️దేవుని ప్రజలతో శ్రమా?
▪️ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా?
▪️అధికారాన్ని త్రోసివేయడమా?
..ఆలోచించడం మొదలు పెట్టాడు.
♻️ ఐగుప్తు ధనమా?
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. (మత్తయి 6:21) ధనము దేవుని నుండి దూరం చేస్తుంది. అది వద్దు అనుకున్నాడు.
♻️ అల్పకాల పాపభోగమా?
పాప భోగము కొంత శారీరికమైన సంతోషాన్ని ఇవ్వొచ్చు. కాని అది అల్పకాలమే. దాని గమ్యం మాత్రం నిత్య మరణం. అదీ వద్దు అనుకున్నాడు.
♻️ ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా?
'హోదాను బట్టి' అతిశయించడం అతనికి ఇష్టం లేదు. కారణం? అతిశయం ఏదైనా వుందంటే?
భూమిమీద కృపచూపుచు నీతిన్యాయములు జరిగించుచున్న దేవుని బట్టియే. యిర్మియా 9:23,24
♻️ ఇప్పుడు మోషే ముందు మిగిలియున్న అంశాలు:
▪️క్రీస్తువిషయమైన నింద
▪️దేవుని ప్రజలతో శ్రమ
▪️అధికారాన్ని త్రోసివేయడం.
అవును! వీటిని సంతోషముతో స్వీకరించాడు. నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి సిద్ధ పడ్డాడు. అంతఃపురాన్ని విడచి అరణ్యానికి చేరాడు. యువరాజు మందల కాపరిగా మారాడు.
కారణం? విశ్వాసమునుబట్టి అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
దేవునిని ప్రక్కనబెట్టి ధనం కోసం ప్రాకులాడే మన జీవితాలకు, అల్పకాల సుఖ భోగాలతో దేవుని ఆలయమైన మన శరీరాలను పాడు చేసుకుంటూ, నిత్య మరణానికి దగ్గరవుతున్న మన జీవితాలకు, హోదా, అధికారం కోసం అడ్డ దారులు తొక్కుతూ, వాటితో మనలను మనమే ఘన పరచుకోవాలని ఆరాటపడుతున్న మన జీవితాలకు, మోషే జీవితం గొప్ప ఆధ్యాత్మిక పాఠం. మన జీవితాలు సరిచేసుకుందాం! నిత్యజీవాన్ని చేరుదాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments