✝️ CHRIST TEMPLE-PRODDATUR
-దేవుని కృప..
నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది... 2కొరింథీయులకు 12:9
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీకు తన పరిపూర్ణమైన కృపను ఇవ్వాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. నేడు మీరు బలహీనులుగా ఉన్నారని చింతించుచున్నారా? దిగులుపడకండి, దేవుడు మీ బలహీనతలను తొలగించి, మిమ్మును తన యొక్క కృపనిచ్చి బలపరచును. అందుకే నేటి వాగ్దానముగా, బైబిల్ నుండి
2కొరింథీయులకు 12:9 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది...'' అని ప్రభువు నేడు ఈ సందేశమును చదువుచున్న మీకు సెలవిచ్చుచున్నాడు. దేవుని కృప మనకు చాలునా? అంటే, ఇది అన్నిటికంటే అత్యధికమైనది. అందుకే యాకోబు 4:6వ వచనమును మనము చూచినట్లయితే, " ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును '' అని లేఖనము చెప్పుచున్నది. అవును, దేవుని కృపను మనకు విస్తారముగా కుమ్మరించబడుతుంది. దేవుడు మన లోపాలను జయించుటకు మనలను అంత ఎక్కువ కృపతో నింపుచున్నాడు. కాబట్టి, దేవుని కృపను అంత తేలికగా తలంచకండి. దేవుని కృప అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనది.
నా ప్రియులారా, మనం కోరినదానిని చేయగలమని మరియు ఆయన కృప మనల్ని స్థిరపరుస్తుందని మనం చెప్పవచ్చును. కానీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీ లోపాలను దాచడానికి ఎప్పుడు కూడ ప్రయత్నించకండి. ఎందుకంటే, అవి మీకు ఏ విధంగాను సహాయపడదు. నేడు, మీరు మీ శత్రువులచేత మోసపోకండి. ప్రతిరోజు, మన పాపాలను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చిన్నది కావచ్చును లేదా పెద్దది కావచ్చును. కానీ, మనము వర్ధిల్లాలంటే, మన పాపాలను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టడం ఎంతో ప్రాముఖ్యం. బైబిల్‌లో సామెతలు 28:13వ వచనమును చూచినట్లయితే, " అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును '' అన్న వచనము ప్రకారము మీ పాపములను ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, మీరు అపజయమును పొందుకుంటారు. కానీ, మీరు మీ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే, దేవుని కనికరమును పొందుకొనుటకు, ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు. ఈ రోజు కూడా, ఈ సందేశమును చదువుచున్న మీ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నిశ్చయముగా, మీరు వర్థిల్లుతారు.
మేము ఒకసారి పశ్చిమ గోదావరికి వెళ్లినప్పుడు, ఒక యువకుడు ఇలా తన సాక్ష్యమును పంచుకున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సిగరెట్ త్రాగేవాడు. కానీ, దినములు గడిచిన కొలది, మాదకద్రవ్యములను అంటే త్రాగుడుకు ఆలవాటు పడుటకు ప్రారంభించాడు. తద్వారా, అతడు తన జీవితంలో అపజయాలను ఎదుర్కొన్నాడు. కానీ, ఒకరోజు అతడు, వారి ఇంటికి సమీపంలోని చర్చిలో వస్తున్న దేవుని వాక్యము విని అతను తన చెడు అలవాట్లన్నింటిని తలంచుకుని తాను ఒక పాపిగాను మరియు దోషిగా ఎంచుకున్నాడు. ఆలా భావించినప్పుడు ప్రభువు అతన్ని తాకాడు మరియు అతను నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. అతను నిజంగా తన పాపాలను మరియు అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టినందున అతడు దేవుని సమృద్ధిని పొందుకున్నాడు. అతను తన పరీక్షలలో 80% మార్కులతో ఉత్తీర్ణతను సాధించాడు. ప్రభువు ఈ రోజు అతనికి ఒక చక్కటి ఉద్యోగమును అనుగ్రహించాడు. ఈరోజు తన ఉద్యోగంతో పాటు ప్రభువు కోసం పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు అతడు ఎంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో మీకు తెలుసా? అతను తనను తాను తగ్గించుకున్నాడు మరియు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. ప్రభువు యొక్క బలమైన హస్తం అతనిని ఉన్నత స్థానమునకు హెచ్చించినది. కాబట్టి, నా ప్రియులారా, నేడు అదే హస్తం మీ మీదికి దిగివస్తుంది. ఆయన తన కృపను మీ మీద విస్తారంగా కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన సంపూర్ణమైన కృపను పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే, దేవునికి మిమ్మును మీరు సమర్పించుకోండి, మీ బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమగునట్లు చేసి, మీ బలహీనతలను తొలగించి, మిమ్మల్ని తన దైవీకమైన కృపతో నింపి మిమ్మును దీవించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments