✝️ CHRIST TEMPLE-PRODDATUR
- నా గొర్రెలు నా మాట వినును..
ప్రియమైన క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులారా..మీ సేవకున్ని అయిన నా స్వరము మీకు వినబడుతోందా ? పరీక్ష చేసుకోండి..
👉 నీ కాపరి స్వరాన్ని వినగలుగుతున్నావా ?
👉 ఆ స్వరానికి లోబడగలుగుతున్నావా ?
👉 నీ కాపరిని వెంబడించగలుగుతున్నావా ?
_నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. - యోహాను 10:27_
*నీవు గొర్రెవు అయితే ?*
▫️నీముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య వుండాలి.
▫️నీ కాపరి (పాస్టర్) అడుగుజాడల్లో నడవాలి.
▫️ఆయన స్వరం వినాలి.
▫️గొర్రెలకు గాయపరచే అవయవాలు( కొమ్ములు) లేవు. అట్లాంటి సాదు స్వభావం నీకుండాలి. ( సేవకుని మీద కూడా తిరగబడి మాట్లాడుతూ , సంఘం కు రాకుండా నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావంటే నీకు కొమ్ములు వున్నాయని అర్థం)
▫️ నీ మాటలు గాని, నీ క్రియలుగాని ఎవ్వరిని గాయపరచే విధంగా ఉండకూడదు.
▫️వాటి సంఖ్యా బలం వాటిని రక్షించ లేదు. ఒక్క గొర్రెవున్నా, లక్ష గొర్రెలు కలసి వున్నా తోడేలు సులభంగా వాటిని ఎత్తుకొని పోగలదు. నీవెనుకనున్నవారు, నీ ఆస్తులు, నీ ధనము నీ బలం కాకూడదు. యేసయ్య నీ బలం అయ్యుండాలి.
▫️గొర్రె స్వచ్చమైన నీరు త్రాగుతుంది. మరి మనం ?
▫️స్వచ్చమైన ఆకుపచ్చని మొక్కలను తింటుంది. ఎండినవి, క్రుల్లినవాటి జోలికిపోదు. మరి మనం ?
▫️గొర్రెను బలవంతంగా త్రోసినా బురదలో పడడానికి ఇష్టపడదు..మరి మనం ?
▫️గొర్రె ఒకవేళ అది బురదలో పడినా ఒక్క నిమిషం దానిలో ఉండలేదు. ఆలస్యం అయితే చనిపోతుంది కూడా..మరి మనం? ( మందిరానికి రాక ఎన్ని వారాల నుండి బురదలో వున్నావు ?
▫️సంవత్సరాల తరబడి బురద కలిగిన జీవితం..జీవిస్తున్నారు కదా ? కాపరి గద్ధింపు నీకు అసహ్యమా ? దేవుని మందిరం అంటే నీకు భయం లేదా ? వాక్యం అంటే నీకు భయం లేదా ? నీ జీవితం ఒకసారి పరీక్ష చేసుకో ?
▫️మాంసం అమ్మే వాడు ఒక గొర్రెను మెడ నరికినా, దానిని చూచి మిగిలిన గొర్రెలు వాడిమీద తిరుగబడవు. ( మరి నీ సంగతేంటి ? నీకు నచ్చినట్లు వాక్యం చెబితే మంచి పాస్టర్ అంటావు. తప్పు చేస్తున్నావు అని వాక్యం చేత గద్ధిస్తే ఈ రోజు నాగురించే వాక్యం చెప్పినాడు అని పది మందికి చెప్పి పాస్టర్ మీద తిరగబడి మాట్లాడుతూ..నీవు చెడిపోయింది కాక అందరినీ చేడుపుతూ సంఘాన్ని పాడుచేస్తున్నావా ?
▫️నిజమైన విశ్వాసులు సంఘం కోసం, దేవుని కోసం ప్రాణం పోగొట్టుకోవలసిన పరిస్టితులు వచ్చినా వాటికోసం సిద్దపడాలి..ఆలాంటి తెగింపు నీలో వుందా ?
*- గొర్రె వంటి అనుభవాలు నీకు లేకపోతే ?*
▫️ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య స్వరాన్ని వినలేవు.
▫️ ఆ స్వరానికి లోబడలేవు.
▫️ నీ ప్రియ రక్షకుని వెంబడించలేవు.
👉 దీని ఫలితం అత్యంత ఘోరం!
నీవు క్రూరమృగమనే సాతాను మృత్యుకోరల్లో చిక్కుతావు. ఇక నిత్య మరణమే శరణ్యం!
వద్దు! వద్దు! ఈ రోజే అహంకారం, గర్వం వదిలేసి సంఘ సేవకునితో సమాధానం పొందుకో ! సంఘంలో చెర్చబడదాము. ఆయన మెల్లనైన స్వరాన్ని విందాం!
👉 *దైవ సేవకుడు నీ కోసం కన్నీళ్లు కారిస్తే నీకు ఆశీర్వాదం..కానీ నిన్ను బట్టి నీ ప్రవర్తన బట్టి కన్నీళ్లు కారిస్తే అది నీకు శాపము తెలుసా ?*
మీ సంఘంలో మీ పాస్టర్ ను గౌరవిస్తున్నారా ? ఆయన మాట వింటున్నారా ? ఆయన పిలుపు నీకు వినబడుతుందా ?
_ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. (ప్రకటన 3:20)_
▫️కాపరి స్వరానికి లోబడదాం!
▫️ప్రియ రక్షకకుడును, మంచి కాపరి, ప్రధాన కాపరియైన యేసయ్యను వెంబడిద్దాం!
▫️నిత్యరాజ్యానికి చేరుదాం!
అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments