✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- మందలో చేరిన గొర్రెలు రెండు రకములు..
ఒకటి : మెదడు ఉన్న గొర్రెలు.
రెండు : మెదడు లేని గొర్రెలు.
ప్రియమైన సంఘమా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈ రోజు మనం ధ్యానం చేయుచున్న అంశం సంఘంలో చేర్చబడుతున్న రెండు రకాలుగా వున్న గొఱ్ఱెపిల్లలు ( విశ్వాసులు) గురించి ధ్యానం చేద్దాం.
*1.మెదడు ఉన్న గొఱ్ఱెలతో పెద్ద సమస్య ఏమీ ఉండదు.* అవి
👉 తమ కాపరి స్వరాన్ని వింటాయి.
👉 తమ కాపరి ఎవరో గుర్తిస్తాయి.
👉 తమ కాపరిని మాత్రమే వెంబడిస్తాయి.
👉 ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకునే వివేచన ఈ గొఱ్ఱెలకు ఉంది.
👉 కాపరి మాటకు కట్టుబడి వుంటాయి.
కారణం ఇవి “మెదడు ఉన్న గొర్రెలు" ఈ గొఱ్ఱెలకు మెదడు(వివేచన శక్తి) ఉంది.
అపొస్తలుడైన పౌలు బెరయలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు బెరయలోని మనుష్యులు పౌలు ప్రకటిస్తున్న వాక్యం లేఖనాల ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించి, ఆ తరువాత అతని వాక్యప్రకటన లేఖనాల ప్రకారంగానే ఉందని గ్రహించి అప్పుడు పౌలు చెబుతున్నమాటల మీద విశ్వాసం ఉంచారు.
అపో.కార్యములు 17: 11
వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
ఈ బెరయలోనివారు మెదడు ఉన్న గొర్రెలు. అందుకే పౌలు వాక్య ప్రసంగాన్ని పరిశీలించాకే అంగీకరించారు.
*2. మెదడు లేని గొర్రెలు కొన్ని ఉన్నాయి.*
👉 వీరికి మెదడు( వివేచనా శక్తి) లేదు గనుక ఏది సత్యమో, ఏది అసత్యమో వివేచించలేరు.
👉 వాక్యం వింటున్నప్పుడు అది వాక్య ప్రకారంగా ఉందా లేదా అనేది వీరికి అనవసరం.
👉 లోపల పాపం పెట్టుకొని బయటికి బైబిల్ బోధించే ప్రతీ ఒక్కరి బోధనూ గుడ్డిగా అంగీకరించేస్తారు.
👉 వారు ప్రకటిస్తున్నదాంట్లో సత్యం ఉందా ? ఈ బోధ నన్ను నిత్యజీవానికి నడిపిస్తుందా అనేవి వీరికి అనవసరం.
👉 అక్కడ AC హాలు, DJ ను తలపించే సంగీతం, అబ్బో ఎంతమంది జనాలు..! ఇవి చాలు, అక్కడికి పరిగెడతారు.
👉 అబ్బో ఆ పాస్టర్ పెద్ద కారులో వచ్చి గట్టిగా కేకలు వేసి ఒక జోకు చెప్పి నవ్వించాడు కదా ? ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నానో..ఈయన నిజంగా ఇంత నవ్విస్తున్నాడు అంటే ఆత్మపూర్ణుడే..అనుకుంటారు.
👉 “మాకు సత్యం తో పనిలేదు… వాక్యంతో పనిలేదు… మంచి DJ మాదిరి మ్యూజిక్ వుంది, పెద్ద పెద్ద కార్లలో జనాలు వస్తున్నారు..అనుకుంటారు.
👉 ఛీ..ఈ సంఘంలో ఏముంది అటు చూడూ.. ఆ సంఘంలో పిలిచి మరీ చందా కట్టించుకొని మెంబర్షిప్ కూడా ఇచ్చారు అక్కడికి వెళ్ళడం మాకు హుందాగా వుంది కాబట్టి దేవుని వాక్యం దొరికే ఈ సంఘం కంటే దుర్బోధ చెప్పే అక్కడికే ఉరుకుతాం..ఇది వీరి మనస్తత్వం.
(గమనిక : దురాత్మ కూడా ఇలాంటి జిమ్మిక్కులు అద్భుతాలు చేయగలదు)
సత్యాన్ని పరిశీలించక ఇలా గుడ్డిగా అంగీకరిస్తూ ముందుకు కదలడం వలన చివరికి వీరు చేరుకునేది నిత్యనరకం.
✅ మెదడు వున్న గొర్రెలు సంఘం కాపరిని మాత్రమే అనుసరిస్తూ వుంటాయి. కాపరి స్వరం వినగానే పరిగెడుతూ రావడం..కాపరి బాటలో నడవడం వీరి మంచి లక్షణం.
అగ్ని గుండమైనా!
అది గాఢాంధకారమైనా!
కొండలైనా!
లోయలైనా!
గుట్టలైనా!
మెట్టలైనా!
అరణ్యమైనా!
జల సంద్రమైనా!
పెద్ద మందిరం లేకపోయినా ..
చిన్న ప్రార్థనా గది అయినా..
పరిస్థితి ఏదైనా సరే! కాపరివైపే మా పయనం! ఆ గొర్రెలకు భద్రత వుంది! క్షేమం వుంది! గొర్రెలు చివరికి చేరవలసిన దేవుని ఇల్లు అనే గమ్య స్థానాలకు వాటిని తప్పక చేర్చుతాడు ఆ కాపరి!
*- ఎవరి కాపరత్వంలో నీవున్నావ్?*
- లోపల పాపం పెట్టుకొని బయటికి గ్రాండ్ గా కనబడే కాపరత్వంలో ఉన్నావా ?
- నిద్ర మేలుకొని, ఉపవాసం ఉంటూ విశ్వాసులు క్షేమం కోసం తెల్లవారు జామున మోకరించి కన్నీళ్లు కార్చే కాపరత్వంలో ఉన్నావా ?
మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రాణం పెట్టిన కాపరియైన యేసయ్య మందలో, ఆయన కాపరత్వంలో
నీవుండగలిగితే? ఆయనను వెంబడించగలిగితే? అది అగ్ని గుండమైనా ఆహ్లాదకరమే!
యేసయ్యవైపు చూస్తూ….
ఆయననే వెంబడిస్తూ….
మీ పాస్టర్ గారిని వెంబడిస్తూ...
ఆయన ఉపదేశం అంగీకరిస్తూ...
నిత్యమైన జీవం గమ్యం వైపు సాగిపో!
దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఆమెన్.
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
Comments