EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Tuesday, 31 January 2023

మీరు దేవుని అద్భుతాలను చూచెదరు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీరు దేవుని అద్భుతాలను చూచెదరు..

...నేను జనులకు అద్భుతములను కనుపరతును. మీకా 7:15

నా అమూల్యమైన సంఘమా.. ప్రియమైన స్నేహితులారా, ఈ ఫిబ్రవరి అనే నూతన మాసములో అడుగిడిన మీ జీవితములో దేవుడు మీ పట్ల అద్భుతములను జరిగిస్తాడు. ఆలాగుననే, నేడు ఈ నూతన మాసములో ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మీతో ఉంటాడు. ఈ రోజు మిమ్మల్ని చూడడం వలన ప్రభువు మీ పట్ల ఆనందించుచున్నాడు మరియు మీ కోసం ఉత్తమమైన వాటిని భద్రపరిచియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా, బైబిల్ నుండి మనం మీకా 7:15వ వచనమును చూచినట్లయితే,

 "..నేను జనులకు అద్భుతములను కనుపరతును.''

 అవును, దేవుడు పరలోకం నుండి దిగివచ్చి, మిమ్మల్ని ఆనందపరిచే ఆశ్చర్యకరమైన అద్భుతాలను మీ పట్ల కనుపరుస్తాడు.

బైబిల్‌లో, ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలలో కొన్నిటిని ఉదాహరణలనుగా మనము చూద్దాం. దేవుని అద్భుతాలు ఎంతో మంది జీవితాలలో ఎలా కనుపరచబడి యున్నవో మనం చూడగలము. 

👉 ఫరో నుండి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి విడిపించి సముద్రాన్ని రెండు పాయలుగా చేసి, ఆ మార్గము ద్వారా వారిని నడిపించిన మోషే పట్ల చేసిన అద్భుతము. మరియు 

👉 మార్కు 5 వ అధ్యాయములో, చనిపోయిన యాయీరు కుమార్తెను తిరిగి లేపిన గొప్ప అద్భుతం; మరియు 

👉 యేసు ద్వారా స్వస్థత పొందుకున్న అనేకమంది రోగులు. అదేలాగున,..

👉 మరియ, మార్తల తమ్ముడైన చనిపోయిన లాజరు, యేసు పలికిన ఒక్క మాట ద్వారా సమాధి నుండి బయటకు వచ్చాడు. 

దేవుడు చేసిన ఈ అద్భుతాలన్ని మానవునికి బలమైనవిగా ఉన్నవి. దేవుని శక్తి ఈ లోకంలో ఉన్న శక్తి కంటే ఎంతో గొప్పది మరియు లెక్కలేనన్ని అద్భుతాలు చేయడానికి మరియు భూమిని సకల ప్రాణులతో నింపడానికి, సృష్టించడానికి మన దేవుని శక్తి బలమైనది. అందుకే మనము యెషయా 9:6వ వచనములో చూచినట్లయితే, " ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. '' యేసు ప్రభువు మీ పట్ల ఆశ్చర్యకరుడు మరియు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మరియు ఈ నూతన మాసములో మీ జీవితంలో ఆయన అద్భుతాలను కనుపరచడానికి సిద్ధంగా ఉండుట మనం చూడగలము.
కాబట్టి, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ హృదయాన్ని అద్భుతాలను కనుపరచే దేవుని వైపు తెరవండి, మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్న అద్భుతాలను పొందుకొనడానికి మరియు మీ పరిస్థితిని మార్చడానికి మరియు మీకు అనుకూలంగా ఉండటానికి దేవుడు సమస్తమును చేయగలడని నమ్మండి..విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ఎంతో శక్తివంతమైన దేవుడు మీ పట్ల ఉన్నాడు... కాబట్టి, మనలను దేవుని కోసం ప్రకాశింపజేయడానికి మరియు ఇప్పుడు అద్భుతాలను చూడటానికి మీరు లేచి ప్రకాశించండి. దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు మరియు ఆయన శక్తివంతమైన కార్యాల కొరకు ఆయనను స్తుతించండి. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Monday, 30 January 2023

మీ ప్రయత్నాలన్నిటిలో మీరు విజయాన్ని సాధిస్తారు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 మీ ప్రయత్నాలన్నిటిలో మీరు విజయాన్ని సాధిస్తారు..

మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును;...మీ సరిహద్దు వ్యాపించును. ద్వితీయోపదేశకాండము 11:24

నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు సొంతమగునట్లుగా దేవుడు మిమ్మును ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, ప్రభువైన యేసు యందు మీరు నిరీక్షణతో ఉండండి మరియు ఈరోజు ఆయన మీకు వాగ్దానం చేయుచున్నాడు.

 ద్వితీయోపదేశకాండము 11:24వ వచనము. " మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును '' అని చెప్పబడిన ఈ వచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమేమనగా, ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులకు ప్రభువు ద్వారా ఇవ్వబడినది, అక్కడ ఆయన ఇలాగున సెలవిచ్చియున్నాడు,

 ' అప్పుడు యెహోవా మీ యెదుట నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.' 

కానీ, ఈ వచనము దేశముల కోసం లేదా గొప్ప వ్యక్తుల కోసం పోరాడటానికి మాత్రమే వర్తించదు. ఈ వాగ్దానం మీ అనుదిన జీవితంలో కూడా మీకు వర్తిస్తుంది. మీరు ఏదైన ఒక నూతన కార్యమును చేయడానికి, నూతన ఉద్యోగం, నూతన వ్యాపారం ప్రారంభించాలి అని సిద్ధంగా వున్నారా ? లేక చదువులు, వివాహము ఈలాగున ఒక కొత్తదానికి అడుగుపెడుతున్నారనుకోండి మరియు ఈ రోజు ప్రభువు మీతో ఇలా చెబుతున్నాడు, *" మీరు ధైర్యంగా ముందుకు సాగివెళ్లండి!* మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను '' అని మీకు వాగ్దానము చేయుచున్నాడు. ఎంత శక్తివంతమైన వాగ్దానం..దేవునికి స్తోత్రం..

యౌవన వయస్సులో ఉన్న ఒక యౌవనస్థురాలు నూతనంగా స్కూల్‌లో ఒక టీచర్ గా చేరింది. ఆమె వయస్సులో చాలా చిన్నది. కానీ, అక్కడున్న సీనియర్ టీచర్ల నుంచి ఆమెకు తగిన ఆహ్వానం లభించలేదు. కాబట్టి, ఆమె ఆ పాఠశాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నించుచుండెను. అయితే, ఆమె అనుదినము బైబిల్‌ను చదివి, ప్రభువు సన్నిధిలో ప్రార్థించిన తర్వాతనే పాఠశాలకు వెళ్లేది. ఆ బలంతో, ఆమె తన విద్యార్థులకు బోధిస్తుండేది మరియు తన విద్యార్థులందరూ ఆమెను ఎంతగానో ప్రేమించేవారు. ఆ పాఠశాలలో విద్యార్థులు ఏ ఉపాధ్యాయులు వారికి బోధించాలనుకుంటున్నారో ఎంపిక చేసుకునే అలవాటు ఉండేది. కాబట్టి, విద్యార్థులు ఎల్లప్పుడూ ఆమెనే ఎన్నుకునేవారు. వారందరూ ఆమెను గౌరవంగా ప్రేమించేవారు మరియు ఆమె తమకు పాఠకులు నేర్పించాలని కోరుకునేవారు. కాబట్టి, వారు ఆమె తరగతులన్నింటికి ఇష్టపూర్వకంగా హాజరయ్యేవారు. దీనితో సీనియర్ టీచర్లు ఆమెపై మరింత అసూయ చెందేలా చేసి, ఆమె మీద అసత్యాలు ప్రచారం చేయడం ప్రారంభించారు.

 తద్వారా ఆమె హృదయం ఎంతో కృంగిపోయినది మరియు అనేకసార్లు ఆమె తన ఉద్యోగంను మానివేయాలని అనుకునేది. కానీ, ఆమె ప్రభువులో బలపడి, ఆమె దేవునికి సేవచేసినట్లుగానే తలంచి మరియు విద్యార్థులకు ఎంతో ప్రేమతో బాధ్యత పూర్వకంగా బోధించేది. చివరగా.. సంవత్సరాంతములో, ప్రిన్సిపాల్ ఆమెకు ఆ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును ఇచ్చి ఆమెను సత్కరించారు. ప్రధానోపాధ్యాయుని అనుగ్రహం పొందడానికి ఇతర సీనియర్ ఉపాధ్యాయులందరికి ఆమెతో స్నేహం చేయడం తప్ప మరో మార్గం లేకపోయినది. చూడండి..

 ఇది ఎంతటి గొప్ప ధన్యత కదా!
అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయనను హత్తుకుని, మీ జీవితంలో ఆయన కృపను పొందినప్పుడు నేడు మీకు కూడా మీ పనుల్లో ఘనత ఇవ్వడానికి ప్రభువు ఎదురుచూస్తున్న విజయం ఇదే. అందుకే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో ప్రభువు నుండి ఈ గొప్ప ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో స్పష్టమైన అవగాహన పొందడానికి వాగ్దాన వచనానికి ముందు మరియు తరువాత వచనాలను అనగా, ద్వితీయోపదేశకాండము 11:22-25 వచనములను చదవమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఎలా విజయపథంలోకి నడిపిస్తాడో తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రయత్నాలన్నిటిలోను ఈ వాగ్దానం ప్రకారం మీరు ఆశీర్వదించబడండి! అయితే, మీరు చేయవలసిందల్లా భూమిపై మీరు అడుగు పెట్టండి, ఈ వాగ్దానం ద్వారా మీ ఆశీర్వాదం మరియు అభివృద్దిపొందుట నిశ్చయమే. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Sunday, 29 January 2023

మీరు ఉన్నతస్థలములో నడిచెదరు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
మీరు ఉన్నతస్థలములో నడిచెదరు..

ఉన్నతస్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను. కీర్తనల గ్రంథము 18:16

నా ప్రియులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థలములో నడిపిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:16 వ వచనము తీసుకొనబడినది. " ఉన్నతస్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను"అన్న వాగ్దానము ప్రకారము ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. 

ఈ రోజు మీరు *లోతైన నీటిలో మునిగి ఉండవచ్చును*  లేదా *ప్రమాదంలో ఉండవచ్చును* మరియు దానిని ఎవరితో పంచుకోవాలో ఆలోచిస్తూ ఉండవచ్చును. దానిని నుండి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి, *అలసిపోయి ఉండవచ్చును.*
 
నా ప్రియులారా, నేడు మీరు అనేక చిక్కుల్లో కూరుకుపోయి, ఇంకేముంది నా జీవితం నాశనం అయ్యింది ఇక చావే నాకు గతి అనే దీన స్థితికి దిగజారి ఉండవచ్చును. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చూసి, ఈ వేకువజామున దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన తన ఉన్నతమైన అధికార స్థానం నుండి దిగివచ్చాడు. ఆయన ఈ వాగ్దానము ద్వారా మీకు జ్ఞానమును దయచేయాలనుకుంటున్నాడు. బైబిల్‌లోని ఒక సంఘటనలో పేతురు గలిలయ సముద్రం మీద నడవాలనుకుంటున్నాడని మనం చదవగలము. యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు మరియు పేతురును తన దగ్గరకు రమ్మని చెప్పాడు. పేతురు కూడా నడవడానికి దోనెలో నుండి సముద్రము మీద దిగాడు. అతను ఒంటరిగా సముద్రం మీద నడవడానికి ప్రయత్నించాడు. కానీ, సముద్రంలో వీస్తున్న గాలిని చూసి క్రిందపడిపోయాడు. గాలి వీచినప్పుడు అతను సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించాడు మరియు తనకు సహాయం చేయమని ప్రభువునకు మొరపెట్టాడు. ప్రభువు నీటి మీద నుండి నడుస్తూ క్రిందకి వంగి అతనిని పైకి లేపాడు. పేతురు గొప్ప ప్రమాదం నుండి బయటకి వచ్చి యేసుతో కలిసి నడిచాడు.
నా ప్రియులారా, ఈ విధంగా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీరు కూడా దేవునితో నడవాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు సరియైన మార్గములో నడుచుటకు ఆయన మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. మీ ఆలోచన ప్రకారం వెళ్ళోద్దు. దేవునికి లోబడి జీవించండి. మీరు దేవుని శక్తి ద్వారా భూమి యొక్క ఉన్నత స్థలమునకు వెళ్ళవచ్చునని యేసయ్య సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, ఆయన మీకు సరాళమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఈరోజు మీ కొరకు మహిమాన్వితమైన కార్యము చేయుచున్నాడు.ఆమెన్. ఆయన లోతైన నీటి నుండియు మరియు ప్రమాదం నుండియు  మిమ్మల్ని పైకి లేపుతాడు మరియు మీకు తన బలాన్ని మరియు ఆలోచనలను అనుగ్రహిస్తాడు మరియు మిమ్మల్ని సముద్రం మీద నడిచేలా చేస్తాడు. ఈ లోకములో ఒక అద్భుతమైన మరియు గొప్ప కార్యాలను మీ పట్ల జరిగిస్తాడు. దేవుడు మీ జీవితంలోని ఈ ప్రమాదాన్ని గొప్ప అద్భుతంగా మారుస్తాడు. నేడు దేవుడు ఈ దీవెనలతో మిమ్మును దీవించును గాక! ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 25 January 2023

పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు

...అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. - రోమీయులకు 8:26

నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ నూతన మాసమైన జనవరి నెలలో వున్నారు ఒక నెల గడచి త్వరలో ఫిబ్రవరి నెలలో ప్రవేశిస్తాము. మీ బలహీనతలలో దేవుడు మీకు సహాయపడాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే, బైబిల్‌లో ‘‘...అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ’’ అని రోమీయులకు 8:26 ప్రకారం ప్రభువు మీకు వాగ్దానం చేయుచున్నాడు. 

నేడు మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మీరు దీనిని అనుభవించి ఉండవచ్చని నేను నిశ్చయంగా తలంచుచున్నాను.

 మనం ఏదో ఒక పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు, మనం ఏమి చేయాలో మరియు దానిని ఎలా అధిగమించాలో చెప్పుచున్న స్వరం మనలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉంటాము. 

ఈ రోజు ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీకు ఇంతటి గొప్ప నిరీక్షణను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేనిని గురించి చింతించకండి. మీ కన్నీళ్లు దేవుడు చూసాడు.

అవును, నా ప్రియులారా, ప్రభువు ఎల్లప్పుడు మీతో ఉంటానని సెలవిచ్చుచున్నాడు; ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ బలహీనతలో మీకు సహాయం చేస్తాడు. ఈరోజు, మీరు పరీక్షకు లేదా ఇంటర్వ్యూకు హాజరవుతున్నట్లయితే, లేదా ఎక్కడైనా అప్పు కట్టాల్సిన పరిస్థితి వుంటే, తినడానికి కుటుంబ పోషణ కష్టంగా వున్నట్లయితే.. ప్రభువు తన పరిశుద్ధాత్మను మీకు బోధించి నడిపిస్తాడని వాగ్దానం చేయుచున్నాడు. 

మనం బయటకు రాలేమని, తల ఎత్తుకొని తిరగలేని గుండె బాధలో వున్న స్థితి భావించే ప్రతి క్లిష్టమైన పరిస్థితుల నుండి బయటికి రావడానికి కూడా ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేయును గాక. 

మీరు చిక్కుకొనిపోయి ఉన్నామని తలంచే కొన్ని పాపాలలో, కొన్ని అప్పుల్లో, కుటుంబ సమస్యలలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ చిక్కుల నుండి బయటకు రావడానికి ఆయన మీకు శక్తిని దయచేస్తాడు. యేసయ్య ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, శిష్యులు ఎలా భావించారో ఊహించండి. ఆయన లేకుండా వారు సమస్తమును కోల్పోయినట్లు భావించియుండవచ్చును. కానీ, ఆ దినములలో ప్రతిక్షణము యేసు తమతో కూడ ఉన్నాడని గుర్తించినను వారు, ఇప్పుడు ఆయన వారితో కూడ లేనందున, వారిని విడిచిపెట్టి వెళ్లినందున వారు చింతించి ఉండి ఉండవచ్చును. కానీ, ఆయన వారి యొద్ద నుండి వారిని విడిచి, వెళ్లిపోయినప్పటి నుండి తరువాత ఏమి చేయాలో వారికి తెలియక వారు దుఃఖించి ఉండవచ్చును. అప్పుడే యేసు ప్రభువు తన పరిశుద్ధాత్మ అను ఆదరణ కర్తను వారి యొద్దకు పంపుతానని వారికి తెలియజేసెను. కాబట్టి, ధైర్యము తెచ్చుకొనుడి. ఇప్పుడే మీ కన్నీళ్లు తుడుచుకోండి. మీ అందరి కోసము వేకువ జాము మొదటి ఘడియలో కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఈ సందేశం మీకు అందిస్తున్నాను.
అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు శిష్యుల వలె, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయన బలాన్ని పొందేందుకు తన పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ప్రతి అడుగు ఎంతో సుళువుగా మారుతుంది. ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎవరితో మాట్లాడాలో మరియు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయన మీకు నేర్పిస్తాడు. అవును, పరిశుద్ధాత్మ మీకు సమస్తమును నేర్పించి, నడిపిస్తాడు. బైబిల్‌లో చూచినట్లయితే, 

కీర్తనలు 46:1లో మనం చదువుగలము, ‘‘ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు’’  

అన్న వచనము ప్రకారం, నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ప్రభువు మీకు సహాయం చేయబోవుచున్నాడు.  అంతమాత్రమే కాదు, మీ బలహీనతలో ఆయన ఆత్మ మీకు బలంగా మారుతుంది. నేడు ఎన్నో సమస్యల ద్వారా మీరు ప్రార్థించలేని స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే, చింతించకండి, ఆయన మీ బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు.

 ఏలయనగా మీరు యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మీకు తెలియనప్పుడు, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో మీ కొరకు తానే విజ్ఞాపనము చేసి, మీ బలహీనతలో మీకు బలమును దయచేసి, మిమ్మును బలపరుస్తాడు. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Tuesday, 24 January 2023

మీ ప్రార్థన పరిమళ ధూపముగా..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ ప్రార్థన పరిమళ ధూపముగా..

...పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను... యెహెజ్కేలు 20:41

నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించుచున్నాడు. అందుకే నేడు బైబిల్ నుండి ఈ రోజు వాగ్దానంగా మనం

 యెహెజ్కేలు 20:41వ వచనమును ధ్యానముగా తీసుకొనబడియున్నాము. ఆ వచనమేమనగా, " జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనుల యెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును ''

 అని చెప్పబడిన వాగ్దాన వచనాన్ని ధ్యానించబోవుచున్నాము. అవును నా స్నేహితులారా, ఆలాగుననే మీరు దేవునికి అటువంటి పరిమళ ధూపంగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు ప్రభువునందు ఎల్లప్పుడు ఆనందించండి.

అయితే దీని అర్థం ఏమిటి? బైబిల్‌లో, లూకా 18:9-14 వ వచనములలో చూచినట్లయితే, యేసు తన శిష్యులకు ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 
అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. దేవుడు ఎవరి ప్రార్థన విని యుంటాడని మీరు అనుకుంటున్నారు? నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు సుంకరిని కరుణించాడు మరియు ఆయన అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని నీతిమంతునిగా తీర్చిదిద్దాడు.
అవును నా ప్రియులారా, మన జీవితాలలో కూడా పరిసయ్యుడు ప్రార్థించినట్లుగా, " ప్రభువా, నేను పరిశుద్ధుడను ! నేను నీతిమంతుడను ! నేను సమస్తమును చక్కగా నిర్వర్తించాను. నేను ఎంతో మందికి సహాయం చేస్తున్నాను మరియు సేవ చేస్తున్నాను '' అని చెప్పవచ్చును. అలాంటి ప్రార్థనలతో దేవుడు ఆనందించడు. ప్రజలు తమ స్వశక్తితో తమను తాము పవిత్రులమని చెప్పుకోవడం మరియు పిలుచుకోవడం ప్రభువుకు ప్రీతికరంగా ఉండదు. కాబట్టి, నా ప్రియ మిత్రులారా, మనం దేవుని యెదుట మనలను మనం తగ్గించుకున్నప్పుడు, మన పాపాలను గుర్తించి, ప్రభువు యొక్క క్షమాపణను మన పూర్ణ హృదయంతో అంగీకరించాలి. ఆలాగుననే ప్రార్థించాలి, ' ప్రభువా, దయచేసి నా పాపాలను క్షమించుము. మమ్మును పవిత్రంగాను, నీతిమంతులనుగాను మార్చగలిగేది నీవు మాత్రమే. ఇంకను ఎక్కువ మందికి సేవ చేయడానికి మరియు వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము '' అని ప్రార్థించినప్పుడు, ఈ వినయపూర్వకమైన ప్రార్థన దేవునికి ప్రీతిగాను, పరిమళ ధూపంగాను పైకి వెళ్లి చేరుతుంది. అప్పుడు ప్రభువు మన ప్రార్థనను, మన ఆరాధనను మరియు మన జీవితమంతా అంగీకరించడానికి ఆనందిస్తాడు. కాబట్టి ఈరోజు నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రార్థించే విధానాన్ని, మరియు మీ ప్రార్థనను దేవునికి ప్రీతికరంగా ఉండునట్లుగా మార్చుకోండి. తద్వారా మీరు దేవుని దృష్టిలో పరిమళమైన సువాసనగా ఉంటారు. మరియు ఆయన మిమ్మును ఆశీర్వదించి పైకి లేపుతాడు. అనగా ప్రతి పనిలోనూ నీకే పై స్థానము ఇస్తాడు. నీవు తలగా వుంటావు కానీ తోకగా వుండవు." తనను తాను తగ్గించుకొనేవాడు హెచ్చించబడతాడు '' మరియు ఆయన మీ కోసం ఆ గొప్పకార్యాన్ని జరిగిస్తానని కూడా ప్రభువైన యేసు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, ఉత్సాహంగా ఉండండి! ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితము సువాసన లేనిదిగా ఉన్నట్లయితే, సుంకరి వలె నేడు మిమ్మును మీరు తగ్గించుకుని, ప్రభువు పాదాల దగ్గర హృదయపూర్వకంగా సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు అనేకులకు ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను మీరు కనుపరచునట్లుగా, ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించి పరవశింపజేస్తాడు. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Monday, 23 January 2023

ఐశ్వర్యం కలిగించే 10% సీక్రెట్..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
ఐశ్వర్యం కలిగించే 10% సీక్రెట్..

*సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.*

అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దేవుని నుండి మనం నేర్చుకునే ఆర్థిక రహస్యం. మనకు ఎంత ఇచ్చే గుణం ఉంటుందో అంతగా మనం అభివృద్ధి పొందుతాము. ఎంత దాచుకుందాం అని చూస్తే అంత నష్టపోతాము. ఇది దేవుని నుండి సంపద-నిర్మాణ రహస్యం. శ్రేష్ఠమైన లేదా ధర్మబద్ధమైన కారణాల కోసం డబ్బును గనుక వెచ్చిస్తే అది ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది, అయితే దేవునికి ఇచ్చేదానిలో మాత్రం ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఇక్కడ సలహా ఏమింటంటే, డబ్బును పెట్టుబడి పెట్టవద్దు, ఇవ్వడం నేర్చుకోవాలి.

పది నుండి ఒకటి తీసేస్తే తొమ్మిదని మనందరికీ  తెలుసు, అయితే అదే పది నుండి ఒకటి తీస్తే దేవుని లెక్క ప్రకారం నూరంతల ఆశీర్వాదం పొందగలం.

👉 అబ్రహాము, ఒక గొప్ప విజయం తర్వాత యాజకునికి ప్రతిదానిలో *పదోవంతు* ఇచ్చాడు. అతను చాలా ధనవంతుడు, ఇంటి నుండి ఆరు వందల మైళ్ళ దూరం, వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా, ఎవరికీ ఏమీ తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పటికీ, దశమభాగాన్ని గౌరవించినందుకు దేవుని ఆశీర్వాదంతో అతను అభివృద్ధి పొందగలిగాడు.

👉 ఇస్సాకు , దైవిక సంప్రదాయం ప్రకారం *పదయవ వంతును* ఇచ్చిన కుటుంబం నుండి నేర్చుకున్నాడు కాబట్టి, ఆ ప్రక్రియలో తన రాబడిలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు.

👉 యాకోబు చేతిలో కేవలం కర్రతో మాత్రమే ఒక కొత్త దేశానికి వెళ్లాడు, అయితే, 20 సంవత్సరాలలో అతను చాలా ధనవంతుడయ్యాడు, లేయా రాహేలు వీరిద్దరిని సంపాదించుకున్నాడు. మరియు అతని యజమాని లేదా మామయైన లాబాను అతని పట్ల వివక్ష చూపినప్పటికీ తన ఆశీర్వాదానికి అడ్డం కాలేకపోయాయి. ఆర్థిక విజయానికి అతని రహస్యం ఏమిటి? మొత్తం ఆదాయంలో *పదియవ వంతు* ఉవ్వడమే. దేవునికే మహిమ!

ఇవ్వడంపై దేవుని గొప్ప ఆశీర్వాదాలకు రెండు షరతులు ఉన్నాయి: 

1.మొదటిది ఉదారంగా ఇవ్వాలి. 2.రెండవది సంతోషంగా ఇవ్వాలి.

 మీరు పిసినారిగా ఉంటే, దేవుడు మీ పట్ల కృంగిపోతాడు. మీరు ఉదారంగా ఉంటే, ఆయన మీతో వ్యవహరించేటప్పుడు అలాగే ఉంటాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. కాబటి, మీరు ఇవ్వడానికి ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా లేకుంటే వృధా అయిపోతుంది. ఇవ్వడం దేవునిని ఆరాధించడం, దీనిని మనం ఆనందంతో చేయాలి.
ఇచ్చేగుణం మీ హృదయంలో దేవుని దయను ప్రతిబింబిస్తుంది మరియు మిమ్మల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. ఇచ్చుటలో యేసు క్రీస్తే గొప్ప ఉదాహరణ. 

నిన్ను శాశ్వతమైన పేదరికం నుండి విముక్తి చేయడానికి, శాశ్వతమైన సంపదలను ప్రసాదించడానికి అత్యున్నత త్యాగం చేయడానికి ఆయన తన పరలోక సంపదను విడిచిపెట్టాడు. హల్లేలుయ. కావున నీ ఆర్థిక పరిస్థితులు మారడానికి ఈ రోజే ఒక మంచి తీర్మానం చేసుకో. అట్టి ఐశ్వరం దేవుడు నీకు అనుగ్రహించును గాక ఆమెన్.  

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Sunday, 22 January 2023

ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పోతే..!

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పోతే..!

- మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. ఫిలిప్పీయులకు 1:4

మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును. ఈ మాటను మీరు నమ్ముతున్నారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం. దేవుడు నాకేమి చేయలేదు, దేవుని వల్ల నాకేమి లాభం లేదు, అసలు దేవుడే ఉంటె నాకు ఎందుకు ఇలా జరిగేది అని ఆలోచించే వారిలో మనం కూడా ఉన్నాం. ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అయితే బాగుండు అనే ఆలోచన ఎవరికీ ఉండదు చెప్పండి ? అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి; ఎప్పుడైతే ఆయనకు మనం విధేయత చూపిస్తామో అప్పుడే అవన్నీ సాధ్యం.

తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు వేసుకోవడం కంటే, ఆ సమస్య నుండి దేవుడు ఎలా తప్పిస్తాడో ఓపికతో వేచి చూస్తె ఆ అనుభవం లో ఉన్న సంతృప్తి మరోలా ఉంటుంది. అలాంటప్పుడే మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు బలపడుతాయి; ప్రత్యేకంగా దేవునిపై మన విశ్వాసం రెట్టింపవుతుంది, మన వ్యక్తిత్వం రూపాంతరం చెందుతుందని నేనంటాను.

ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుడానికి అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకూ శ్రమిస్తాడు, ఆ విషయములో ఎటువంటి సందేహము లేదు.

ఆరంభించినవాడు, ఆనందంలో నడిపిస్తూ, అంతము వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించుటయే మన యొక్క విధి.

మనం చేయవలసిన అతి సుళువైన పని ఏమిటంటే, విధేయతతో క్రీస్తును అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగియుండుటయే.

అందుకే, కీర్తనాకారుడంటాడు..*"నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" కీర్తనలు 119:71*

దేవుని కృప మీతో మనందరితో ఉండును గాక. ఆమేన్

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Saturday, 21 January 2023

సమ్సోను జీవితం..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- సమ్సోను జీవితం..

 *న్యాయాధిపతుల గ్రంధంలో,13 వ అధ్యాయం నుండి 16 వ అధ్యాయం వరకు "సమ్సోను" చరిత్ర మనకు వివరించబడింది. ఆనాడు మోషే యెహోషువాల నాయకత్వం తర్వాత సుమారు 350 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల సారద్యంలో నడిపించబడ్డారు,ఆ కాలంలోనే సమ్సోను కూడ ఏడవ న్యాయాదిపతిగా సుమారు 20 సంవత్సరాల పాటు పిలిష్తీయుల అణచివేత నుండి యూదా జనాంగాన్ని కాపాడి ముందుకు నడిపించాడు.*

✨️ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులు కాగా దేవుడు వారిని 40 సంవత్సరాలపాటు పిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. *ఆ సమయంలోనే దాను వంశంలో సమ్సోను జన్మిస్తాడు.*

👉 *సమ్సోను అనే పదం హిబ్రు బాషకు చెందినది ఆ మాటకు అర్ధం {సూర్యుని వంటి వాడు} అని. ఇంకా ""రక్షకుడు"" ""కాపాడువాడు"" అని అర్దాలు కూడ వస్తాయి.!*

👉 సమ్సోను తండ్రి పేరు "మనోహ" సమ్సోను తల్లి పేరు బైబిల్ లో ప్రస్తావించకపోయినా ఆమె పేరు "జెలెల్పోనిస్" లేదా [జెల్పోనిస్] అని ప్రాచీన హిబ్రు గ్రంధాలు చెప్తున్నాయి.!

✨️ యెరూషలేమునకు పశ్చిమాన 23 కిలోమీటర్ల దూరంలో ఉండే "జోర్యా" అనే పట్టణంలో వీరు నివసించేవారు. *దేవుని దూత సెలవిచ్చిన ప్రకారం సమ్సోను పుట్టగానే అతను నాజీరు చేయబడినవాడై దేవుని సేవకు అంకితం చేస్తారు అతని తల్లిదండ్రులు..*

✨️ అతి బలవంతుడు బహుపరాక్రమవంతుడైన సమ్సోను పిలిష్తీయులను ఎదిరించి తన జనులకు రక్షణగా నిలబడతాడు. సమ్సోనుకు దేవుని దయ తోడుగా ఉండటం వలన వట్టి చేతులతో సింహాన్ని చంపివేస్తాడు.

✨️ మరో మారు *గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మంది పిలిష్తీయులను అవలీలగ చంపేస్తాడు.* మొదట సమ్సోను పిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత సమ్సోను "శోరేకు" లోయలో నివసించే {దెలీలా} అనే పిలిష్తీయురాలిని కూడ వివాహం చేసుకుంటాడు, అక్కడి నుండే సమ్సోను జీవితం పతనం కావడం ప్రారంభమయ్యింది అని మనం అనుకోవచ్చు.

✨️ *సమ్సోనును ఎలాగైనా చంపాలి అని భావించిన పిలిష్తీయులలో కొంతమంది పెద్దలు ఒకరోజు దెలీలాను సంప్రదిస్తారు. సమ్సోను అంత గొప్ప బలవంతునిగా జీవించడానికి,అతనిలో దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తికి గల కారణం ఏంటో తెలుసుకొని తమకు తెలియ జేస్తే గొప్ప బహుమనాన్ని వెండి నాణేల రూపంలో ఇస్తామని ఆమెకు ఆశ పెడతారు. అందుకు ఆమె కూడ సరే అని వారితో ఒప్పందం చేసుకుంటుంది.*

✨️ ఆ తర్వాత ఆమె ఎన్నో సార్లు సమ్సోనులో దాగి ఉన్న అంత గొప్ప బలానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నిస్తుంది ఆమె గోళ తట్టుకోలేక ఏడు నిరవంజి చువ్వలతో బందిస్తే తన బలం మొత్తం హరించుకపోయి సామాన్యుడిలా మారిపోతానని ఒకసారి.. అప్పుడే కొనిన క్రొత్త తాళ్లతో తనను బందించిన యెడల తన బలం మొత్తం సన్నగిల్లిపోతుందని మరొక సారి.. నీవు నా జడలను అల్లిక అల్లిన యెడల దాంతో నా పని ఐపోతుందని ఇంకోసారి ఇలా ప్రతి సారి ఏదో ఒకటి చెప్పడం, ఆమె ఆ విధంగా ప్రయత్నించడం అది ఫలించకపోవడం జరుగుతుండేవి.

✨️ దాంతో దెలీలా సమ్సోనుతో నీవు ప్రతి సారి నన్ను ఎగతాళి చేస్తూ నీలో దాగి ఉన్న ఆ గొప్ప బలము దేనిలో ఉన్నదో చెప్పకుండ నన్ను అవమానిస్తున్నావు నన్ను నమ్మకనే కదా ఇలా చేస్తున్నావు అని అతడ్ని తన సూటిపోటి మాటలతో ఎంతగానో వేదిస్తుంది. ప్రతి రోజు ఆమె ఇలా తన మాటలతో వేదిస్తున్నందు వలన ఇక చివరికి ఆమె వేధింపుల కంటే చావడమే మేలని భావించి అతనిలో దాగియున్న ఆ శక్తికి గల కారణం ఏమిటో ఆ రహస్యాన్ని దెలీలాకు చెప్పేస్తాడు. *నేను నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడనవాడినైయున్నాను నా తల మీదకి మంగళి కత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోవును అప్పుడు నేను అందరిలాగే ఏ ప్రత్యేకత లేకుండ మామూలు మనిషిలా మారిపోతాను అని ఆమెతో చెప్తాడు.*

✨️ ఆ తర్వాత దెలీలా సమ్సోనును తన తొడ మీద నిద్ర పుచ్చి ఒక మనుషుని పిలిపించి సమ్సోను తల మీద ఉన్న ఏడు జడల్ని క్షౌరము చేయిస్తుంది. ఎప్పుడైతే అతని తల మీద ఉన్న ఆ ఏడు జడల్ని క్షౌరము చేసారో ఆ వెంటనే అతనిలో దాగి ఉన్న ఆ బలము అతని నుండి తొలగిపోతుంది *అప్పుడు పిలిష్తీయులు నిరాయుదుడైన సమ్సోను మీద పడి అతడ్ని బందిస్తారు.* అతని రెండు కళ్ళను పెకలించి గ్రుడ్డి వానిగా చేసి గాజాకు తరలించుకపోయి చెరసాలలో బంధించి ఉంచుతారు..

✨️ చెరసాలలో బందీగా ఉన్న సమ్సోనుని అతడ్ని తమ దేవతయైన దాగోనుకు మహా బలిగా అర్పించాలని భావిస్తారు. ఆ తర్వాత పిలిష్తీయులందరు దాగోను గుడిలో సామావేషమయ్యి తమ వారినందరిని అవలీలగ చంపిన సమ్సోనుని అవమానించాలని భావించి, బందించిన సమ్సోనును దాగోను గుడికి తీసుకువస్తారు. ఇత్తడి సంకెళ్ళతో శక్తిహీనుడిగా,గ్రుడ్డివానిగా ఉన్న సమ్సోనును చూసి అక్కడ చేరిన వేలాది మంది స్త్రీ పురుషులు పరిహాసం చేస్తారు...ఎగతాళి చేస్తున్న ఆ పిలిష్తీయుల కేకలను వింటూ నిస్సాహయునిగా నిలిచిన సమ్సోను తన చేతిని పట్టుకొని అక్కడకు తీసుకవచ్చిన బంటుతో ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను నన్ను తడమనిచ్చి విడువుము నేను ఆ స్తంభాలను ఆసరాగ చేసుకొని వాటి మీద ఆనుకుంటాను అని అతనితో అనగా ఆ సైనికుడు సమ్సోనును గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరకు తీసుక వెళ్ళి అతడ్ని నిలబెడతాడు.

✨️ *అప్పుడు సమ్సోను యెహోవా..ప్రభువా..! దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము పిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకి మొర పెట్టి ప్రార్థిస్తాడు.* సమ్సోను చేసిన ప్రార్ధనను ఆలకించిన దేవుడు అతడ్ని తిరిగి శక్తిమంతునిగా చేయగా ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంబాలను పెకలించి వేస్తాడు. దాంతో గుడి నిట్ట నిలువున కూలిపోతుంది,గుడిలో చేరిన సుమారు మూడువేల మందికి పైగా స్త్రీ పురుషులందరు ఆ గుడిలో పడి చనిపోతారు.

✨️ అలా సమ్సోను తమ చిరకాల ప్రత్యర్దులైన పిలిష్తీయులను వేల సంఖ్యలో చంపి వారితో పాటు తాను ఆ శిదిలాలలోనే చనిపోతాడు. అలా ఇశ్రాయేలు ప్రజలకు తమ శత్రువుల పీడను తొలగించి,ప్రశాంతంగా జీవించేలా చేసాడు.

✨️ తన జీవితంలోని చివరి క్షణాలు సమ్సోను చేసిన ఆ యొక్క గొప్ప పరాక్రమం యొక్క ప్రభావం మరో ఇరవై ఏళ్ళ పాటు పిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల వైపు చూడటానికే భయపడినట్లుగా చరిత్ర చెప్తుంది

👉 *సమ్సోను గాధ మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది.* ఎంతో శక్తిమంతునిగా జన్మించిన సమ్సోను కేవలం "మోహం" అనే పాపం కారణంగా తనను తాను కోల్పోవలసి వచ్చింది.

👉 మనల్ని ఆకర్షించి పాతాళానికి త్రోసి వేసే పాపపు ఆలోచనలు మనల్ని అంధులుగా మారుస్తాయి. మనల్ని మన కుటుంబానికి,దేవునికి,దూరం చేసి చివరికి మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయి.

👉 దేవుడు ఆఖరి క్షణంలో కూడ మనల్ని కాపాడతాడు అనే సత్యానికి రుజువు సమ్సోను జీవితమే. *ఆఖరి క్షణంలో అతను దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపంతో చేసిన ప్రార్ధనను దేవుడు ఆలకించాడు.*

👉 *మనము ఎంతటి పాపంలో ప్రయాణిస్తున్న తప్పులు ఎరిగి ఆయన వైపు తిరిగి చూడగలిగితే తప్పకుండ మన పాపాలను క్షమిస్తాడు.* అక్కున చేర్చుకుంటాడు. తిరిగి మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు.!

👉 అలాంటి పాపపు జీవితం జీవిస్తున్నావా ? ఇప్పుడే మొకరించు.. దేవుని వైపు చూద్దాం..! ప్రార్ధించుదాం..! తిరిగి దేవునిలో జీవించడం,ప్రారభించుదాం...! అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక..ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Friday, 20 January 2023

మీరు చాలా బిజీగా ఉన్నారా ?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
మీరు చాలా బిజీగా ఉన్నారా ?

తినడం, పని చేయడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం, చదవడం, వినోదం, సంభాషణలు, సువార్త ప్రకటించడం, ప్రార్థించడం వంటి పనులకు, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అయితే, ఈ విషయాలకు మన దినచర్యలో ఎంత సమయం కేటాయించాలో మీ సమయ నిష్పత్తిని నిర్దేశించే నిర్దిష్ట నియమాలు బైబిల్‌లో లేవు.

నా ఇంటి ముందు వాకిట ఒక చక్కని మొక్క ఉంది, అది తాజాగా కనిపిస్తుంది. ప్రతిరోజు నేను దానికి నీళ్ళు పోస్తూ సమయం గడుపుతున్నాను. ఆ మొక్క పచ్చగా ఉండడం గమించాను. నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్న సందర్భాల్లో, సమయం గడపలేకపోయాను.
అనుకోకుండా వర్షాకాలం కావడంతో దానికి నీళ్ళు సమృద్దిగా దొరకడం ద్వారా నేను నీళ్ళు పోయకపోయినా ఆ మొక్క పచ్చగా కనిపించింది. సరేలే ఆ మొక్క బాగానే ఉందనుకొని కొన్ని వారాల తరువాత నా బిజీ షెడ్యూల్‌తో, నేను మొక్క గురించి పూర్తిగా మరచిపోయాను.
అనుకోకుండా ఒకరోజు నా ఇంటి వాకిట వున్న మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మొక్కకు ఒక ఎండిన కొమ్మను గమనించాను. అయ్యో నీళ్ళు పోయలేకపోయానే.. అనుకొన్నాను, నాలో కొంత బాధ కలిగింది. ఒక పాస్టర్ గా మీ జీవితం కొరకైన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఈ ఉపమానాన్ని మన సంఘానికి వివరిస్తున్నాను.

ఫిలిప్పీయులకు 2: 21
అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.

ప్రియమైన మిత్రులారా, ప్రభువు కొరకు సమయాన్ని వెచ్చించడంలో మన జీవితాలకు ప్రాధాన్యతనివ్వాలి. మనలో మనం చాలా బిజీగా ఉండకూడదు, అలాగని ప్రాముఖ్యమైన విషయాలను అనగా ప్రార్థన, స్తుతి, ఆత్మీయమైన పనులు, సేవ, సువార్త, సంఘ కార్యక్రమాలు,  నిర్లక్ష్యం చేయకూడదు. నేటి నుండైనా  ప్రార్థన మరియు వాక్యము ద్వారా క్రీస్తులో ఎదుగుతూ మన దినచర్యలో వీటిని సంసిద్ధం చేసి తగినంత సమయాన్ని వెచ్చించే నిర్ణయం తీసుకుందాం. దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ పచ్చని చెట్టువలే ఫలిస్తూ అనేకులను కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందే వారిగా ఆహ్వానిద్దాం. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 19 January 2023

దేవునితో బంధం పెంచుకో..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 దేవునితో బంధం పెంచుకో..

_1 యోహాను 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు._

1యోహాను 2: 2
ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు కోపం లేదా బాధ కలిగించేలా ఏదైనా చేయగలడు. అంతమాత్రాన వాడు తమ బిడ్డ కాదని ఏ తలిదండ్రులు అనుకోరు కదా. అయితే ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో తన సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి తన జీవితాన్ని మెరుగుపరుచుకోడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుంది. మీ పట్ల దేవుని ప్రేమ మారలేదు. పొరపాటున పాపం చేయడం ద్వారా దేవునితో మీ సంబంధాన్ని కోల్పోలేదు. దేవునికి దగ్గరగా ఉండటానికి, ఆయనతో సత్ సంబంధాన్ని పునరుద్ధరించుకోడానికి, మీరు మీ పాపాన్ని కప్పుకోక ఒప్పుకోవాలి. మరలా ఆ పాపం జోలికి పోకుండా జాగ్రత్త పడాలి.

మానవుడు దేవుడు వీరు మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఏకైక మార్గం మనలోని పాపాన్ని పూర్తిగా తొలగించుకోవడమే. డబ్బుతో లేదా త్యాగంతో మరి దేనితోనైనా దేవుని నుండి క్షమాపణను కొనుగోలు చేయలేము. సమస్త సృష్టి దేవునికి చెందినదే; ఆయనకు మన నుండి ఏమీ అవసరం లేదు.

నేనంటాను, దేవునితో సరిదిద్దుకోలేని మన అసమర్థత ప్రభువునకు ముందే తెలుసు. అయితే దేవుడు ఎన్నడు కూడా మనం నశించిపోవాలని కోరుకోడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు కాబట్టి తానే స్వయంగా ఒక పరిష్కారాన్నికూడా మనకు అందించాడు. అపరాధ పాపముల భారాన్ని తనపై వేసుకోవడానికి, మన స్థానంలో తాను మరణించడం ద్వారా విమోచన క్రయధనం చెల్లించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. మన అపరాధములకు యేసు క్రీస్తు ప్రభువు కలువరి సిలువలో ఆ మూల్యం చెల్లించాడు. 

ఈరోజు మనం చేయవలసింది ఒక్కటే, మన పాపాన్ని ఒప్పుకోవడం. పరిశుద్ధంగా బ్రతకడం మరియు దేవునితో మన బంధం, సంబంధం పెంచుకోవడం, నీ అతిక్రమాల వలన ప్రార్థన లేని జీవితాన్ని జీవిస్తూ అవిస్వాసంతో దేవునితో సంబంధం కోల్పోయావా ? దిక్కుతోచని స్థితిలో ఉన్నావా ? అయితే ఇప్పుడే మొకరించి యేసయ్య తో మాట్లాడు ఆయనతో నీ సంబంధం మెరుగు పరుచుకో..అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 18 January 2023

అవసరమా? కోరికా?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- అవసరమా? కోరికా?

విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఒక రాజు ఉండేవాడు. తన జీవితంలో ఆ రాజు సంతోషం, సంతృప్తి చెందలేకపోయాడు. ఒకరోజు తన సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయడం చూశాడు. ఆ రాజు తన సేవకుడు ఎలా సంతోషంగా జీవుస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు, "నేను సేవకుడిని తప్ప మరొకటి కాదు, నా కుటుంబానికి నా స్థోమత మించిన అవసరతలు లేవు ,ఉండడానికి ఇల్లు కడుపు నిండా భోజనం ఉంది" చాలు..దేవునికి రోజు కృతజ్ఞత చెల్లిస్తూ బ్రతుకుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని సెలవిచ్చాడు.

  ఆ సమాధానంతో రాజు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇతడు జీవితంలో ఏ కోరికా లేకుండా జీవిస్తున్నాడా ? లేక నటిస్తున్నాడా ? తెలుసుకోవాలి అనుకొని.. ఆ రాత్రి తన సేవకుడిని పరీక్షిస్తూ, రాజు రహస్యంగా 99 బంగారు నాణాల సంచిని తన సేవకుడి వాకిలి గుమ్మం వద్ద వదలమని తన పనివారిని ఆదేశించాడు. గుమ్మము వద్ద సంచిని చూసిన ఆ సేవకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సంచిని తెరిచి ఆశ్చర్యపోయిన అతడు, వాటిని లెక్కించడం ప్రారంభించాడు. 99 నాణేలే ఉన్నాయని నిర్ధారించుకొని, “ఆ ఒక్క బంగారు నాణెం ఏమైయ్యుంటుంది? ఖచ్చితంగా, ఎవరూ 99 నాణాలను వదిలిపెట్టరే! ” అనుకొని, కలిగినదానితో తృప్తి చెందకుండా..టెన్షన్ టెన్షన్ జీవితం ప్రారంభించాడు.. తనకు వీలైన ప్రతిచోటా వెతికాడు, చివరికి ఆ ఒక్క నాణెం దొరకలేకపోయింది. చివరగా, నిరాశతో అలసిపోయిన అతడు ఆ ఒక్క బంగారు నాణెం సంపాదించడానికి తన సేకరణను సంపూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి, 100వ బంగారు నాణెం సంపాదించాలనే తపనలో, తనకు సహకరించే కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా దూషించడం మొదలుపెట్టాడు, పని చేస్తున్నప్పుడు పాటలు పాడటం కూడా మానేశాడు, దేవుణ్ణి స్తుతించడం మానేసి ఆ 100వ నాణెం కోసం దేవుని మీద సనగడం ప్రారంభించాడు, ప్రశాంతమైన జీవితం కోల్పోయాడు. 

సేవకుడు ఇలా మారిపోవడం , మనశ్శాంతి లేకుండా బ్రతకడం గమనించిన రాజు సేవకుని పిలిచి ఓ సేవకుడా నీవు ఇంతక ముందు వున్న మనశ్శాంతి కొలోయావు జీవితంలో ఆ 100వ నాణెం సాధించాలి అనే వేటలో కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను అందరినీ దూరం చేసుకున్నావు, ఆరోగ్యం పాడు చేసుకున్నావు నీ స్థితి కొంచము వున్నప్పుడే ఆనందంగా ఆడుతూ..పాడుతూ పని చేసుకుంటూ కుటుంబంతో గడుపుతూ వుంటివి ఇప్పుడు అన్ని కోలోయావు..నిన్ను చూసి రాజు అయిన నేను పాఠము నేర్చుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చినదానిలో తృప్తిగా బ్రతకడం కంటే మించిన కోరిక నాకు వద్దు. నీవు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఎదో సాధించాలి..ఇంకా ఎదో సంపాదించాలి అనే అనవసరమైన కోరికలు లేకుండా ఉన్నదానితో తృప్తిగా జీవించడం కొనసాగించు అని చెప్పెను.

 _సామెతలు 11:23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది._

చిన్న చిన్న విషయాలలో కూడా మనం సంతోషంగా ఉండగలం. కానీ మన జీవితంలో ఏదైనా పెద్దది లేదా మెరుగైనది పొందుకున్న సమయంలో, దానికంటే ఇంకా ఎక్కువ పొందుకోవాలనే తపన మొదలవుతుంది!. దాని ద్వారా, మనం మన నిద్రను, మన ఆనందాన్ని కోల్పోతాము, మన చుట్టూ ఉన్న వ్యక్తులను బాధిస్తాము, ఇవన్నీ మనలో పెరుగుతున్న అవసరాలు, మించిన కోరికలే. మనకున్నదానిలో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మన అవసరాలను కోరికలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకోవాలి.  ఈ రోజు నుండి మనం ఒక మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం! దేవుని కృప మనందరితో ఉండునుగాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Tuesday, 17 January 2023

మీరు నన్ను విశ్వసిస్తున్నారా?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 మీరు నన్ను విశ్వసిస్తున్నారా?

రెండు పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటూ ఇటూ పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అతను తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. ఉత్కంఠతతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తునారు. అతడు నెమ్మదిగా అవతలి స్తంభం వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ, ఈలలు వేసి అభినందించారు. వారు కరచాలనం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. అప్పుడతడు ప్రేక్షకులను అడిగాడు "నేను ఇప్పుడు ఈ వైపు నుండి ఆ వైపుకు తిరిగి ఇదే తాడు మీద నడవగలనని మీరు అనుకుంటున్నారా?" ఏక కంఠంతో "అవును, అవును, నీవు చేయగలవు..." అన్నారు అందరు.

మీరు నన్ను విశ్వసిస్తున్నారా? అని అతడు అడిగాడు. వారంతా అవును, అవును, మేము నీపై పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. సరే, మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజం మీద కూర్చోబెట్టగలరా; నేను మీ పిల్లవాడిని సురక్షితంగా మరొక వైపుకు తీసుకువెళతాను.

 అక్కడ ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం అలుముకుంది.. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండిపోయారు.

నమ్మకం వేరు. విశ్వాసం వేరు. విశ్వాసం కోసం మనం పూర్తిగా లొంగిపోవాల్సి ఉంటుంది. నేటి ప్రపంచంలో మనకు దేవుని పట్ల లేనిది ఇదే. మనం సర్వశక్తిమంతుడిని నమ్ముతాము. అయితే మనం ఆయనను సంపూర్ణంగా, సందేహం లేకుండా విశ్వసిస్తున్నామా!. ఈ ప్రశ్న నాకును మీకును ఆలోచింపజేస్తుంది.

హెబ్రీ 11:6 విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

ప్రియమైన మిత్రులారా విశ్వాసంలో బలముగా వుండుము. కార్యము జరగలేదని కృంగిపోవడం ద్వారా నువ్వు దేవునికి ఇంకా.. దూరం అవుతున్నావు అనే విషయం గ్రహించి..దేవుని యందు విశ్వాసం ఉంచి అద్భుతాలు నీ కళ్ళారా చూడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు అందరికీ సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటించు. దేవుణ్ణి మహిమపరచు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Sunday, 15 January 2023

పాస్టర్ కుటుంబ సభ్యుడవు..ఇలా చేయడానికి సిగ్గుగా లేదా ?

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 పాస్టర్ కుటుంబ సభ్యుడవు..ఇలా చేయడానికి సిగ్గుగా లేదా ?

ఏంట్రా సిగరెట్టు తాగి ఇంటికి వచ్చావా ? అని కొడుకును ప్రశ్నించాడు పాస్టర్ గా వున్న తండ్రి. అవును అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు పెద్ద వయసొచ్చిన తన ఏకైక కుమారుడు. పాస్టర్ కొడుకువైయుండి ఏంట్రా ఆ పాడు అలవాట్లు.. అంటూ గద్దించడం ప్రారంభించాడు; తండ్రి మాటలను కొట్టి పారేస్తూ అసలు "పొగ త్రాగరాదు" అని బైబిల్ లో ఎక్కడ ఉందొ చెప్పు, నాకు చూపిస్తే ఇప్పుడే మానేస్తా అన్నాడు హేళనతో కుమారుడు. తండ్రి కుమారుల మధ్య వాగ్వివాదం పెరిగి పెరిగి పెద్దదైంది. పాస్టర్ ఇంట్లో కేకలు వినబడుతున్నాయి, ప్రార్థన శబ్ధం తప్ప మరి ఏ శబ్దాలు వినబడని ఇంట్లో ఈ రోజు అరుపులు, కేకలు వినబడుతున్నాయి, కృంగిపోయి కన్నీళ్ళతో ఆ సేవకుడు: ఎంతో మందికి చెప్పే నేను, నా కొడుకుకు మాత్రం చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తున్న తండ్రికి ఒక ఆలోచన వచ్చింది.

 నా కుమారుడా బైబిలును స్పష్టంగా పాటిస్తున్నావు! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.. బైబిలును క్షుణ్ణంగా తెలుసుకున్న నిన్ను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే "పొగ త్రాగరాదు" అని బైబిలులో వ్రాయలేదు, వాస్తవమే అయినా పొగ త్రాగమని మాత్రం వ్రాయబడలేదు కదా, లేని విషయం కోసం ఆరాటపడుతూ నీవెందుకు నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటావు అంటూ కుమారుణ్ణి చిక్కు ప్రశ్నలతో ముడివేసాడు ఆ పాస్టర్ గారైన తండ్రి.

బిడ్డలు లేదా పాస్టర్ కుటుంబ సభ్యులు ఎవ్వరైనా సరే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటే, ప్రార్థన సరిగా చేసుకోకుండా , మందిరానికి క్రమంగా రాకుండా దేవునితో సహవాసం లేకుండా ఇష్టానుసారం ఉన్నారంటే పొరపాటు వారి పెంపకంలోనే కదా. మొక్కై వంగనిది మ్రానై వంగునా చెప్పండి. ఏది మంచి ఏది చెడు అనే ప్రతీది బైబులులో వ్రాయబడలేదు. సమాజంలో పనికిరాని ప్రతి విషయాన్ని బైబులుతో జత చేసి అనవసరమైన చర్చలు చేసి దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించి, సంభాషించి, కాలాన్ని సమయాన్ని వృధా చేసుకునే వారిలో మనం కూడా ఉన్నామంటే ఆశ్చర్యంలేదు. 

ఇది చేస్తే మంచి ఇది చేస్తే చెడు అనే వ్యత్యాసాన్ని చిన్న నాటి నుండే ఓపికతో, ప్రేమతో, గద్దింపుతో తల్లిదంద్రులమైన మనం నేర్పిస్తేనే కదా వారు ఎదిగే కొద్దీ భయం బాధ్యత అలవరచుకుంటారు. పాస్టర్ కుటుంబ సభ్యులు అయ్యి వుండి ప్రార్థనకు, మందిరానికి సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉంటూ, ఈ లోక ప్రేమ, త్రాగుడు, సంఘంలో ఏ బాధ్యత లేకుండా ఉండడం, మాట వినని తనం, ఎదురు సమాధానం చెప్పడం, పాస్టర్ మనస్సును గాయం చేయడం ఇవన్ని అవిధేయతకు ఉదాహరణాలు..

పాస్టర్ కుటుంబ సభ్యుడవు అయ్యి వుండి ఇలా ఇష్టానుసారం జీవించడం నీకు సిగ్గుగా లేదా ? ఆలోచించు..! జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసి చివరకు దైనందిక మరియు కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అది విచ్చిన్నం చేస్తుందంటే అందులో ఆశ్చర్యమేమి లేదు. దేవుడు కూడా అసహ్యించుకునే ఈ అవిధేయత శాపానికి మరణానికి కూడా దారి తీస్తుందంటే అందులో సందేహమే లేదు. "బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" సామెతలు 22:6.

జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చిన్న నాటి నుండి నేర్పిస్తేనే ఆ బిడ్డలు ఎదిగేకొద్ది ఒదిగి జీవించడం నేర్చుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్ధించే తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు విధేయతనిచ్చే బిడ్డలను బట్టే, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధిపరుస్తాడు. ఏది మంచి ఏది చెడు వంటివి ఈ ఆధునికమైన వ్యవస్థలో అన్నీ మనం నేర్పించలేకపోయినా, బిడ్డలకు మనం నేర్చించే దేవుని యెడల భయభక్తులు వారిని ఉన్నత మార్గం వైపు నడిపిస్తుంది. ప్రతి సమయంలో వారిని సరైన దిశ వైపు నడిపించడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఈ లోకములో మరియు లోకముతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు లోకమును జయించే బిడ్డలుగా ఉంటూ... అంతరంగంలో వారికి కలిగే ప్రతి ఆలోచనలకు, జీవితంలో వారు తీసుకునే ప్రతి నిర్ణయాలను పరిశుద్ధాత్మ దేవుడే వారికి బోధించి వారిని ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Saturday, 14 January 2023

నీకు ఒక రహస్యం చెప్తున్నా..విను..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- నీకు ఒక రహస్యం చెప్తున్నా..విను..

నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మా ఉపాధ్యాయుడు ఒక విషయం చెప్తూ ఉండేవాడు - జీవితం అంటే జిలేబి కాదు, ముళ్ళున్న గులాబి అని. వాస్తవమే కదా! అందమైన గులాబి పువ్వుకు ముళ్ళు ఎలా ఉంటాయో, అందమైన జీవితంలో శ్రమలు కూడా తప్పవు. చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు నాకే ఎందుకు కలిగింది అని బాధపడడం కంటే వాటిని పట్టుకున్నప్ప్పుడే కదా రాబోయే శ్రమలను తట్టుకునే శక్తిని, అనుభవాన్ని పొందగలం. శ్రమ, సంతోషం ఈ రెండూ మన జీవితంలో రెండు కళ్ళలాంటివి; ఏ ఒక్కటి లేకున్నా జీవితం మనకు అందంగా కనబడదు. 

శ్రమల నడుమ ఉన్నప్పుడు, ఆ శ్రమ విచారము వలన కావచ్చు, అనారోగ్యం వలన కావచ్చు లేదా "మన" అనే వాళ్ళే మనల్ని మోసం చేసియుండ వచ్చు. ఈ రోజు నుండి నీకు నేను తోడు వున్నా అని చెప్పినవాళ్ళు రేపు నిన్ను అనరాని మాటలు అనవచ్చు..ఆర్థిక ఇబ్బందులూ వుండవచ్చు ఈ శ్రమ మనకు క్రుంగుదలతోపాటు కొంత భయాన్ని కూడా జతచేసి మనల్ని ఒంటరితనంలోనికి నెట్టేస్తుంది. ఇంకెంత కాలం నాకీ కష్టాలు అని అనుకునే వారు ఎవరు లేరు ? చెప్పండి. నేడు ఉన్న కష్టం రేపు కూడా ఉండవచ్చు కాని మనలో ఉండే ఓర్పు, సహనమే తప్పక ఒకరోజు ఆనందం వైపు నడిపిస్తుంది. ఆమెన్.. మనలో ఉండే పట్టుదలతో పాటు దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా నిజమైన శాంతిని పొందగలం. ఇదే క్రైస్తవ విశ్వాస రహస్యం.

ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి శ్రమలను అనుభవిస్తున్నామో ఆయనకు అన్నీ తెలుసు. క్షణమాత్రముండు మన చులకని శ్రమనుండి శాంతిమార్గములోనికి నడిపిస్తుంది దేవుని అపారమైన కృప. ఆయనపై విశ్వాసం ఎంత లోతుగా ఉంటే అంతటి పూర్ణ శాంతిని మనం పొందగలం. అందుచేత మన ప్రతీ శ్రమలో ఆయనయందు విశ్వాసముంచి మొఱ్ఱపెట్టడం నేర్చుకోవాలి. దేవునిపై ఆనుకొని సంపూర్ణంగా ఆధారపడిన జీవితాల్లో ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే భక్తుడంటాడు, 

యెషయా 26:3 లో  “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.” నీయందు నమ్మికతో బ్రతుకుతూ వున్నాడు, శ్రమలు, కష్టాలు వున్నాయి అని అవిశ్వాసం వలన దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో..ఆలోచించు దేవుడు నీకు అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు..కాబట్టి ఈ రోజు నుండి దేవునితో లోతైన అనుబంధం కలిగి జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించి కాచి కాపాడును గాక..ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Friday, 13 January 2023

రహస్య ప్రార్థన

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 రహస్య ప్రార్థన

నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు 'చూచు' నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:6

రహస్య ప్రార్థన లో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. 'చూస్తాడట'.
ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ప్రతీ పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నామో లేక కప్పుకున్నామో? అని..కప్పుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒప్పుకుంటే తప్పేముంది? మన జీవితం అంతా ఆయనకు తెలుసు.

దావీదు అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపుపుట్టకముందే నీవు నామనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్దనుండి నేనెక్కడకు పొవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును.? కీర్తన 139:2,7.

వ్యక్తిగత జీవితంలో ప్రతీరోజు బిజీగా గజిబిజీగా ఉన్నప్పుడు మనలోని పాపములను అపవాది జ్ఞాపకము చేసి కృంగదీస్తూ ప్రార్ధనకు దూరం చేస్తాడు.  రహస్య ప్రార్ధన వలన దేవుని సహవాసంలో అనుభవం రెట్టింపై, విశ్వాసములో మరింత బలము పొందగలము.

అనుదినం దేవునితో వ్యక్తిగతంగా గడపగలిగే రహస్య ప్రార్థన మన జీవితంలో వుండాలి. ఎందుకంటే, మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్ధన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్ధన. ప్రార్థించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారు లేరు.

ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు! ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

ఆలస్యములో కూడా ఒక మేలు దాగివుంది..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 ఆలస్యములో కూడా ఒక మేలు దాగివుంది..

"దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?" లూకా 18:7

DL మూడి అనే దైవజనుని కొంత మంది ప్రశ్నించారట మీ విజయ రహస్యమేమిటని? 
దానికి ఆయన 7 కారణాలున్నాయి అని చెప్తూ... 
1. ప్రార్ధన 
2. ప్రార్ధన 
3. ప్రార్ధన 
4. ప్రార్ధన 
5. ప్రార్ధన 
6. ప్రార్ధన 
7. ప్రార్ధన 
అని చెప్పారట. 
దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రార్ధన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో? విసుగక పట్టుదలతో ప్రార్ధించిన ఆ ప్రార్ధనా వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు.

లూకా సువార్త 18:1-7 వచనాలు చూస్తే యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది.

ఒక న్యాయాధిపతి వున్నాడు.  అతనికి దేవుడంటే భయం లేదు, మనుష్యులంటే లెక్కలేదు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక, పట్టువిడువక,  మాటి మాటికి వస్తున్న సందర్భములో, అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట. అన్యాయస్తుడైనవాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, న్యాయవంతుడైన దేవుడు, నీ నా కోసం తన చివరి రక్తపుబొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్ధన ఆలకింపడా?

ప్రార్ధించే మనము దేని నిమిత్తం ప్రార్దిస్తున్నామో? దానిని పొందుకొనేవరకు ప్రార్ధించాలి. మనము కొద్ది రోజులు ప్రార్ధించి విసిగిపొతాము. అయితే, ఒక విషయం అర్ధం కావాలి. విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తం అయితే ప్రార్దిస్తున్నామో? దేవుడు దానిని మనకోసం సిద్ధపరచే సమయంలో, విసిగిపోయి ఇక మన ప్రార్ధనకు సమాధానం రాదు అనుకొని, ప్రార్ధించడం మానేస్తాము. అందుకే, అనేక ప్రార్ధనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము. విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో గాని, అలక్ష్యము చెయ్యడు. ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగివుంది అనే విషయం మరచిపోవద్దు. ఎప్పుడు మనకు ఏమి కావాలో? నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయం గుర్తుంచుకో.

సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది. 

అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. 

కాలేబుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి 45 సంవత్సరాలు పట్టింది. 

తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే, పొందుకొనేవరకు విసుగక పట్టుదలతో ప్రార్ధించాలి.  ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు! అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక..! ఆమెన్!

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Wednesday, 11 January 2023

పగిలిన పాత్ర గొప్పదనం

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 పగిలిన పాత్ర గొప్పదనం

నీళ్ళు మోసే ఒక వ్యక్తి వద్ద రెండు పెద్ద కుండలు ఉన్నాయి. కావిడి చెరివైపుల ఒక్కొక్కటి వేసుకొని మెడపై మోస్తున్నాడు. కుండలలో ఒక దానిలో పగుళ్లు ఉండగా, మరొకటి మంచిగా ఉండి ఎప్పుడూ నీటితో నిండుగా ఉండేది. నది నుండి కుండలను మోసుకుంటూ అతను ఇంటికి వచ్చే సరికి పగిలిన కుండ సగం మాత్రమే నీటితో నిండి ఉండేది.  ఇలా ప్రతిరోజూ ఆ వ్యక్తి ఒకటిన్నర కుండలతో ఇంటికి నీటిని చేరవేయడం రెండేళ్లపాటు సాగింది. ఎప్పుడూ నీళ్ళతో నిండుగా ఉండే  కుండ అది తయారు చేయబడినదానికి కలిగిన సాఫల్యతకి గర్వపడింది. కాని పేలవమైన పనితీరుతో పగుళ్లు కలిగిన కుండ దాని అసంపూర్ణతకు సిగ్గుపడింది.

పగుళ్ళతో ఉండి చేదు అనుభవాన్ని, ఘోరమైన వైఫల్యాన్ని గ్రహించిన రెండు సంవత్సరాల తరువాత ఓటి కుండ ఒక రోజు నదివద్ద నీరు మోసేవానితో "నేను  సిగ్గుపడుతున్నాను,  మీకు క్షమాపణ చెబుతున్నాను, నా పనిని సగం మాత్రమే చేయగలిగాను, ఎందుకంటే నాలో ఉన్న ఈ పగుళ్లు దారంతా కారుతూ ఇంటికి వచ్చేలోగా నీరు బయటకు పోయేలా చేస్తున్నాయి. నా లోపాల కారణంగా, మీ పని సగం మాత్రమే జరుగుతుంది. మీ ప్రయత్నానికి పూర్తి విలువ లభించట్లేదు" అని అంది. అప్పుడతడు కుండతో “మనం నడిచే దారిలో నీ వైపు మాత్రమే పువ్వులు ఉన్నాయని  గమనించావా? ఇంకొక కుండ వైపు లేవు. నీ లోపం నాకు తెలుసు దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నేను నీ దారిలో పూల విత్తనాలను నాటాను. ప్రతి రోజు నది నుండి వచ్చేటప్పుడు నీవు వాటికి నీరుపోసావు. అందమైన పువ్వులు పూసాయి. రెండు సంవత్సరాలుగా నేను నా యజమాని బల్ల అలంకరించడానికి ఈ అందమైన పువ్వులను ఉపయోగించాను. నీవు నీలా ఉండకపోతే, నా యజమాని ఇంటికి ఇంత శోభ చేకూరి ఉండేది కాదు. "

మనలో ప్రతి ఒక్కరికి వివిధ రకాల లోపాలు ఉన్నాయి. మనమంతా  బీటలువారిన  కుండలమే. ఈ ప్రపంచంలో వ్యర్ధమైనదేదీ లేదు. ఏదీ వృధా కాదు. మీ జీవితంలోని కొన్ని రంగాలలో మీరు అసమర్ధులు లేదా పనికిరానివారు అని మీరు అనుకోవచ్చు.  కాని ఏదో ఒకవిధంగా ఈ లోపాలు ఆశీర్వాదాలుగా మారతాయి.

II కొరింథీ 12:9-10 నా కృప నీకు చాలును, బలహీనతయందు నా  శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Tuesday, 10 January 2023

ప్రతిఫలమిచ్చు దేవుడు

✝️ CHRIST TEMPLE-PRODDATUR
ప్రతిఫలమిచ్చు దేవుడు

కొంచం సమయం కూడా ఖాళీ లేని ఈ ప్రపంచంలో, మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అంతా తేలిసేలా సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా మన చేతిలోనే వుంది. మనం ఏమి చేస్తున్నాం అన్నది చాలా మందికి చూపించాలనేది మన జీవితంలో భాగమైపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనుష్యులకు కనిపించకుండా, సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే మనం కొన్ని పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. 

_మత్తయి 6:18 అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును._ దేవుడు తనతో వ్యక్తిగత సన్నిహిత సహవాసం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటాడు మరియు సంతోషిస్తాడు. మనం ఆయన చెప్పినది చేసినప్పుడు మనకు ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు .

దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు, "నేను మీకు లోబడియున్నాను" అని చెప్పడానికి ఇది మరొక మార్గం. దేవుడు చెప్పినదానిని పాటించడంలో ఆశీర్వాదాలు దాగి యుంటాయి.. అవి మనల్ని విశ్వాసక్రమములో మరో మెట్టు ఎదిగేల జేస్తుంది. అలా క్రమ క్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అధికమైన ప్రతిఫలాన్ని పొందగలుగుతాము.

సామాజిక మాధ్యమాలలో అనవసరమైన మన వ్యక్తిగత బహిరంగ ప్రదర్శనకు వీడ్కోలు పలుకుదాం. మన స్వంత  నడవడి కాకుండా విధేయతగలిగిన జీవితాన్ని దేవుని సహాయంతో మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. శాశ్వతమైన ప్రతిఫలానికి పాత్రులయ్యేలా ప్రభువు మనలను స్థిరపరచును గాక. ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Monday, 9 January 2023

మీ హృదయమును కలవరపడనియ్యకుడి

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మీ హృదయమును కలవరపడనియ్యకుడి

కష్ట సమయాలు ఎల్లప్పుడూ జీవితంలో ఒక పెద్ద నష్టం లేదా విపత్తు పరిణామాలుగా ఎంచవలసిన అవసరం లేదు. 

ఇవి చాలా చిన్నవి కూడా కావచ్చు, నిర్ణయం తీసుకోవడంలో కష్టం కావచ్చు, జీవితంలో మార్పులకు అనుగుణంగా మారడం కష్టం కావచ్చు లేదా నీ సొంత ఉద్దేశ్యంతో నడిచే జీవితం కోసం దేవుని సూచనలను ప్రణాళికలను అనుసరించడానికి కష్టతరమవ్వచ్చు. అయితే..

అన్ని పరిస్థితులలో మనకు నెమ్మది లేదా శాంతి అవసరం, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు, జీవితం, కార్యాచరణ వుంటుంది. దేవుని వాక్యము ప్రకారం అనుసరించడం ద్వారా మన జీవితం ఆశీర్వాదకరంగా వుంటుంది. మన విధేయత ద్వారా ఆశీర్వాదం పొందుకోవచ్చు. అయితే, మనకు అవసరమైనది దేవుని సహాయంతో చేసినప్పుడు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శాంతిని సమాధానాన్ని కలిగి ఉండటానికి సహాయం చేస్తాడు.

_యోహాను 14: 27 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి._

దేవుడు మనకు ఒక హెచ్చరికతో కూడిన పరిష్కార మర్గ్నాన్ని తెలియజేస్తూ, అదే సమయంలో మనకు భరోసా కూడా ఇస్తున్నాడు, ఆయన నుండి వచ్చే శాంతి మాత్రమే మనకు విశ్రాంతిని ఇస్తుందని, ఇది మన ఆందోళనలన్నింటినుండి విడుదల కలుగజేసి నెమ్మదిని దయజేస్తుందని గ్రహించగలం.

ఏదైనా సులభంగా దొరికే ఈ ప్రపంచంలో, మనం లోకసంబంధమైన మార్గాన్ని ఎంచుకోవడం కంటే శాంతిని కలిగి ఉండే దేవుని మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఈ లోక మార్గం ఎల్లప్పుడూ నేత్రాష, జీవపుడంబము, పాపము, దురాశ, ఇష్టానుసారం జీవించడం మనల్ని అశాంతి అసంతృప్తి స్థితిలో వదిలివేస్తుంది, మరోవైపు, దేవుని మార్గం మనల్ని ఆయన విశ్రాంతిలోకి , సమాధానం లోకి, ఆశీర్వాదంతో ప్రవేశించడానికి మరియు అతని శాంతిలో నివసించడానికి అనుమతిస్తుంది. కాబట్టి ఇప్పుడే దేవుని మార్గంలో నడుస్తూ శాంతి సమాధానం కలిగిన మార్గం కావాలని ప్రార్థించి నిర్ణయం తీసుకో.  అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్. 

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Sunday, 8 January 2023

మనపై మన గెలుపు..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- మనపై మన గెలుపు..

ఎఫెసీ 6:12 "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము."

అపవాది తంత్రములు ఎప్పుడైనా మనలో మనల్ని బలహీనపరచడానికే ఉంటాయి. అంతేకాదు, మన బలహీనతలను గూర్చి, మనం ఎక్కడ పడిపోయామో, ఓడిపోయామో వాటిని పదే పదే గుర్తు చేసి నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. అయితే, మన బలం మన బలహీనతలన్నీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకు అంతా తెలుసు. 

జీవితంలో మనకు ఎన్నో పోరాటాలు, వీటన్నిటిలో బలమైన పోరాటం మనలో మనమే. కొన్ని సార్లు ఆలోచిస్తాము; మనలో ఈ పోరాటాల వల్ల జీవితంలో ఎంతో నష్టపోయాం ఇంకా ఎన్నో సాధించలేకపోయాను; ఎన్నో సార్లు అపజయాలు ఎదురయ్యాయి. ఇటువంటి ఆలోచనలవలన ఎటువంటి ప్రయోజనం లేదు. బలహీనమైన మన ఆలోచనలు మనల్ని మార్పు దిశగా నడిపించవు, కేవలం దేవునిపై మన విశ్వాస భారం తప్ప. ప్రార్ధన ద్వారా మన పోరాటాలను ఆయన చేతుల్లో పెడితే, మన పోరాటాలను ఆయన అందుకొని విజయాన్ని దయజేసే సహాయకుడుగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా, ఆయనపై ఆదారపడి, ఆయనకు సహకరించి, పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగుతూ వెళ్ళడమే.

మన వ్యక్తిగత పొరపాట్లను ఒప్పుకోవడం కొంచెం కష్టమే, ఎప్పుడైతే క్రీస్తు నా కొరకు కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని జ్ఞాపకము చేసుకుంటామో, ఇక మనలో మనం మన తప్పిదములను పొరపాట్లను ఒప్పుకోక మానము. క్రీస్తులో నమ్మకత్వం కలిగిన మనసును పెంపొందించుకునే అలవాటు మనపై మనం గెలిచేలా చేస్తుంది. ఈ స్వభావం క్రీస్తులో నిత్య శాంతిని సమాధానంలో ఆధ్యాత్మిక శక్తిని దయజేస్తూ మనల్ని విజయపధం వైపు నడిపిస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR

Saturday, 7 January 2023

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

✝️ CHRIST TEMPLE-PRODDATUR
- రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

మనం కృంగిపోయినప్పుడు లేదా ఊహించనిది జరిగినప్పుడు, ప్రస్తుత పరిస్థితి నుండి ఎలా దాటిపోవాలో కష్టంగా అనిపిస్తుంది. జరగబోయే కార్యాలు ఏ విధంగా ఉంటాయో సంశయంగా ఉంటాయి. 

కానీ దేవుడే స్వయంగా మన సమస్యల్లో ప్రమేయం చేసుకొని, ఆశీర్వాదకరమైన నిరీక్షణ గురించి మనకు హామీ ఇచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట ద్వారా మనకు మంచి జరుగుతుందని ప్రోత్సహించబడతాము మరియు బలాన్ని పొందుతాము.

ఇశ్రాయేలీయులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు వారి భవిష్యత్తు కోసం నిరీక్షణను ప్రకటించాడు.

_యిర్మియా 31:17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు._

మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా లేదా ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న అప్పులు, అనారోగ్యం,  ఇబ్బందులు, కరువు మరియు పేదరికం, ఒంటరితనం..  ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడం అసంభవం అనుకున్నా, దేవుడు ఈ రోజు తన వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు మరియు విశ్వాసకర్తయైన దేవుడు నిరీక్షణతో కూడిన భవిష్యత్తు గురించి *హామీ* కూడా ఇస్తున్నాడు. 

దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నట్లే, మీ పక్షాన ఉన్నందున సంతోషకరంగా జీవించండి.

మీ భవిష్యత్తును మీకే కాకుండా రాబోయే తరానికి కూడా ఆశీర్వాదకరంగా ప్రకటిస్తున్నాడు...ఆమెన్.

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Thursday, 5 January 2023

కీర్తనలు పాడుడి..విజయం నీదే..

✝️ CHRIST TEMPLE-PRODDATUR
 కీర్తనలు పాడుడి..విజయం నీదే..

కీర్తనలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును ప్రశాంతంగా మార్చుతుంది. మనం కీర్తనలు పాడినప్పుడు అది చింత, ఒత్తిడి నుండి ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండె చప్పుళ్ళు ఒకరినోకరికి ఏకీభవిస్తాయని కొందరి పరిశోధకుల అభిప్రాయం.

అపోస్థలుడు పౌలు అంటాడు “ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించమని ప్రోత్సాహిస్తున్నాడు (ఎఫెసీ 5:19). పరిశుద్ద గ్రంథంలోని అనేక సందర్భాల్లో కూడా దేవుని స్తుతించమనే చెబుతుంది. “దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.” కీర్తన 47:6.

శత్రువులు యూదా జనాంగంవైపు వస్తున్నప్పుడు, భయపడిపోయిన రాజైన యెహోషాపాతు అందరినీ యెహోవా సన్నిధిని సమకూర్చాడు. సమాజాన్నంతటిని తీవ్రమైన ప్రార్ధనలో నడిపించాడు. వారు తినక త్రాగాక కేవలం ప్రార్ధన మాత్రమే చేశారు. “ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మా దిక్కు” అని ప్రార్ధన చేశారు. మరుసటి దినము యుద్ధరంగంలోనికి నడిచి శత్రువుల మీదికి వెళ్ళారు. అక్కడ వారిని నడిపించింది గాయక బృందమేగాని శూరులు వీరులు కాదు. “ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు” అన్న దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించారు. వారు యుధభూమి వైపు పాడుతూ, నడుచుకుంటూ వెళ్ళగా వారి శత్రువులు తమలో ఒకరినొకరు చంపుకోనుటకు మొదలుపెట్టారు. దేవుని ప్రజలు ఆ యుద్ధభూమికి చేరే సరికి యుద్ధం ముగిసిపోయింది. వారు పాడుకుంటూ తెలియని దిశగా విశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళగా దేవుడు తన ప్రజలను రక్షించాడు. (2 దిన 20వ అధ్యా)

యుక్తమైన కారణాలను బట్టి ఆయనను స్తుతించమని దేవుడు ప్రోత్సాహిస్తున్నాడు. యుద్ధభూమిలోనికి మనం వెళ్ళినా, వెళ్లకపోయినా, మన ఆలోచనలను, హృదయాలను, జీవితాలను మార్చివేసి;  ఎటువంటి సమస్యనైనా అధిగమించగల శక్తి దేవునిని స్తుతించడంలో ఉంటుంది. దేవునితో అనుసంధానమైన హృదయాలు ఆయన స్తుతులను ఆలపిస్తాయి. ఇక మన నోరు తెరచి దేవుని స్తుతించడానికి ఆలస్యం ఎందుకు? ఈ రోజే ఆనందంగా దేవుని కీర్తనలు పాడుతూ..జీవితాన్ని సాగిద్దామా ? హల్లెలూయ!! దేవుడు మిమ్ములను దీవించును గాక..ఆమెన్

✝️ CHRIST TEMPLE-PRODDATUR

Sunday, 1 January 2023

నూతన సంవత్సరం అనే తలుపు నీయెదుట తీయబడినది..

✝️ 𝗖𝗛𝗥𝗜𝗦𝗧 𝗧𝗘𝗠𝗣𝗟𝗘 - 𝗣𝗥𝗢𝗗𝗗𝗔𝗧𝗨𝗥
- 2023 అనే తలుపు నీయెదుట తీయబడినది..

_("ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను. దానిని ఎవడును వేయనేరడు ప్రకటన 3:8)_

2022లో సాతానుడు మన జీవితంలో అనేక విషయాలకు తలుపులు మూసి బంధించాడు. సాతాను చేత మూయబడిన అనేక ఇత్తడి తలుపులను ఇనుప గడియలను ప్రభువు ఈ సంవత్సరం పగులగొట్టి నూతన ద్వారములను నీకు తీయనున్నాడు. (యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగుల గొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను)  

కారణం..ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నవి కనుక తలుపులు తీయుటకును వేయుటకును ఆయన సర్వాధికారి. ప్రభువు 2023లో నీ కొరకు తెరవనున్న కొన్ని తలుపులను మనం ఇప్పుడు గమనిద్దాం.

*1. విశ్వాస తలుపు:*

 ఈ సంవత్సరమైనా మనం విశ్వాసపు ద్వారంలో ప్రవేశించాలి. (అపో.కా 14:27 వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు *విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు*, వివరించిరి.) 

పౌలు మొదటి సువార్త దండయాత్రలో ప్రభువు అనేక పట్టణాల్లో ప్రభువు అనేకులను విశ్వాస తలుపులు తీసాడు. అంతి యోకయ, ఈకొనియా దెర్బే, మొదలగు ప్రాతాలలో తలుపులు తెరువబడినవి. అపో. 14:19-24. పిసిదియా దేశమంతటా వారికి దేవుడు తలుపులు తీశాడు. మరి మన కొరకు కూడా ప్రభువు విశ్వాస తలుపులు తీయనున్నాడు.  

*2. ప్రార్ధనా తలుపు:*

 పేతురు కొరకు సంఘస్తులు చేసిన ప్రార్ధనకు దేవుడు అద్భుతమైన సమాధానం వారు తలుపు తీసిన తరువాత చూడగలిగారు. (అపో.కా 12:16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.) వారు హృదయ పూర్వకంగా ప్రార్థన చేశారు గాని వచనాలను బట్టి చూస్తే ఎక్కువ విశ్వాసంతో ప్రార్థన చేయలేదని అర్థమౌతుంది. అయినా అల్ప విశ్వాసంతో చేసిన వీరి ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చాడు. 

నిజ దేవునికి ప్రార్థన చేసేవారందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉండాలి. దానియేలు అయితే ముమ్మారు కిటికీ తలుపులు తీసే ప్రార్ధన చేశాడు గనుక మరణం నుండి తప్పించబడ్డాడు. (దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.) 

2022 సంవత్సరంలో చాలమంది జీవితాల్లో ప్రార్ధనా తలుపులు మూయ బడ్డాయి. కనీసం 2023లో ప్రార్ధనా తలుపు మరోసారి తెరవబడుచుండగా ప్రవేశిద్దాం.

*3. సహవాస తలుపు:*

 నులివెచ్చని స్థితిలో ఉన్న లవొదికయ సంఘం, ప్రభువుతో సహవాసం చేయకుండా ప్రభువును బయటే ఉంచింది. (ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని *తలుపుతీసిన* యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.) 

ఆయన తలుపు తట్టవలసి వచ్చింది. ఇది సూచించేదేమంటే, అనేకులు ప్రభువు యొక్క సహవాసం చేయలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఈ సంవత్సరమైన ప్రభువును నమ్మి, ఆయనను రక్షకునిగా  స్వీకరించి వాస్తవంగా ఆయన కుటుంబంలో ప్రవేశించి దేవుని పిల్లలం అవుదాం. 

*4. రక్షణ తలుపు:*

 రక్షణ ద్వారం క్రీస్తే. క్రీస్తు ద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ లభిస్తుంది. అతడు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ మేత కనుక్కొంటాడు.  (యోహాను 10:9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును) 

2023సంవత్సరంలోనైనా రక్షణ ద్వారంలోనికి ప్రవేశించాలని తీర్మానం చేసుకుందామా? రక్షణ తలుపులు నీకొరకే తీయబడి ఉన్నవి. లోపలకు వస్తే, ఆయన నీ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు కూడా అద్భుతమైన రక్షణ ఇవ్వగలడు. గనుక శక్తివంతమైన సువార్త ద్వారా రక్షణలో ద్వారంలోనికి ప్రవేశిద్దాం. 

అతడు లోపలకు పోవుచు అనగా క్రీస్తులో బలపడుట, బయటకు వచ్చుచు అనగా సువార్త ప్రకటనకు అని అర్ధం. ప్రభువు నీకొరకు సువార్త తలుపు కూడా 2023 సంవత్సరంలో తీయనున్నాడు.  

*5. పరిచర్య తలుపు:* 

క్రీస్తు కొరకు పరిచర్య చేసే తలుపు ప్రభువు తెరచాడు.  (యోబు 31:32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.) మార్త ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించి పరిచర్య చేసింది. జక్కయ్య ప్రభువు కొరకు తన తలుపులు తెరచి పరిచర్య చేశాడు. అబ్రహాము తన ఇంటి గుడారపు ద్వారా యొద్ద కూర్చొని ప్రభువును ఆహ్వానించి విందు పరిచర్య చేసి ఆశీర్వదించబడ్డాడు. 

(ఆది కా 18:1 మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.) 

మరి 2023 సంవత్సరంలోనైనా మనం పరిచర్య ద్వారంలో ప్రవేశించుటకు తీర్మానం చేద్దామా?

*6. దీవెన తలుపులు:*

 2023లో ప్రభువు నీ కొరకు దీవెనల తలుపు తెరచాడు. మరి మనం ప్రభువుకివ్వడానికి కానుకల తలుపు తెరిస్తే, ప్రభువు మనకొరకు దీవెనల తలుపు తెరుస్తాడు.

(మలాకి 3:10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను *ఆకాశపువాకిండ్లను* విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు).

మనం ప్రభువుకు ఇచ్చేదానిమీదే నూతన సంవత్సరంలో ప్రభువు మనకిచ్చే దీవెన ఆధారపడి ఉంటుంది. (లూకా 6:38  ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల  కొలువబడునని చెప్పెను.)

*7. రాకడ తలుపులు:* 

ప్రభువు వచ్చే ఆ రోజు గానీ గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి.  (లూకా 12:36 తమ ప్రభువు పెండ్లి విందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి.) 

ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి.  నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినది లేకుండా, అంటే క్రీస్తు ఆత్మ లేకుండా, క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం బుద్ధి తక్కువ పని. అందుకే బుద్ధిలేని కన్యకలు విడువ బడ్డారు. వారికొరకు నరకం కాచుకొని ఉన్నది. 

(మత్తయి 25:11-13 అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు *తలుపు తీయుమని* అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమై      నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.)

రాకడ తలుపులో ప్రవేశించుటకు ఆలస్యం చేస్తే ప్రభువు మనకు దొరకడు. (పరమ 5:6 నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను.)  

ఒకానొక దినాన ప్రభువు సువార్త తలుపు మూసి పరలోకపు తలుపు తెరచును. ప్రకటన 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను (యెషయా 22:22 నేను దావీదు ఇంటితాళపు అధికార భారమును అతని  భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు.) 

 ప్రియ దేవుని బిడ్డలారా! సమయం దాటకముందే *ద్వారంలో* ప్రవేశించాలి లేదా తీయబడిన తలుపు వేయబడుతుంది. అప్పుడు ఎవరును ద్వారములోనికి ప్రవేశించలేరు.  నోవాహు ఓడ తలుపు మూసివేసినది దేవుడే. 

(ఆది.కా 7:16 ప్రవేశించిన వన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని *మూసివేసెను.* ఆది.కా 7:21 అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.

ఆ శిక్ష మనకు రాక ముందే ప్రభువు మన కొరకు తెరచిన *ద్వారంలో ప్రవేశిద్దాం.* ఆయనే ద్వారమై యున్నాడు. (యోహాను 10:9 నేనే ద్వారమును;) 

ఈ నూతన సంవత్సరం 2023లో మన కొరకు తీయబడిన ఏడు తలుపులలో అనగా ద్వారం అనబడిన యేసులో ప్రవేశించి ప్రభువును గొప్పగా మహిమ పరచే భాగ్యం మనకు ఆత్మ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక! ఆమెన్!!

✝️ CHRIST TEMPLE-PRODDATUR