✝️ CHRIST TEMPLE-PRODDATUR
ఐశ్వర్యం కలిగించే 10% సీక్రెట్..
*సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.*
అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దేవుని నుండి మనం నేర్చుకునే ఆర్థిక రహస్యం. మనకు ఎంత ఇచ్చే గుణం ఉంటుందో అంతగా మనం అభివృద్ధి పొందుతాము. ఎంత దాచుకుందాం అని చూస్తే అంత నష్టపోతాము. ఇది దేవుని నుండి సంపద-నిర్మాణ రహస్యం. శ్రేష్ఠమైన లేదా ధర్మబద్ధమైన కారణాల కోసం డబ్బును గనుక వెచ్చిస్తే అది ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది, అయితే దేవునికి ఇచ్చేదానిలో మాత్రం ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఇక్కడ సలహా ఏమింటంటే, డబ్బును పెట్టుబడి పెట్టవద్దు, ఇవ్వడం నేర్చుకోవాలి.
పది నుండి ఒకటి తీసేస్తే తొమ్మిదని మనందరికీ తెలుసు, అయితే అదే పది నుండి ఒకటి తీస్తే దేవుని లెక్క ప్రకారం నూరంతల ఆశీర్వాదం పొందగలం.
👉 అబ్రహాము, ఒక గొప్ప విజయం తర్వాత యాజకునికి ప్రతిదానిలో *పదోవంతు* ఇచ్చాడు. అతను చాలా ధనవంతుడు, ఇంటి నుండి ఆరు వందల మైళ్ళ దూరం, వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా, ఎవరికీ ఏమీ తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పటికీ, దశమభాగాన్ని గౌరవించినందుకు దేవుని ఆశీర్వాదంతో అతను అభివృద్ధి పొందగలిగాడు.
👉 ఇస్సాకు , దైవిక సంప్రదాయం ప్రకారం *పదయవ వంతును* ఇచ్చిన కుటుంబం నుండి నేర్చుకున్నాడు కాబట్టి, ఆ ప్రక్రియలో తన రాబడిలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు.
👉 యాకోబు చేతిలో కేవలం కర్రతో మాత్రమే ఒక కొత్త దేశానికి వెళ్లాడు, అయితే, 20 సంవత్సరాలలో అతను చాలా ధనవంతుడయ్యాడు, లేయా రాహేలు వీరిద్దరిని సంపాదించుకున్నాడు. మరియు అతని యజమాని లేదా మామయైన లాబాను అతని పట్ల వివక్ష చూపినప్పటికీ తన ఆశీర్వాదానికి అడ్డం కాలేకపోయాయి. ఆర్థిక విజయానికి అతని రహస్యం ఏమిటి? మొత్తం ఆదాయంలో *పదియవ వంతు* ఉవ్వడమే. దేవునికే మహిమ!
ఇవ్వడంపై దేవుని గొప్ప ఆశీర్వాదాలకు రెండు షరతులు ఉన్నాయి:
1.మొదటిది ఉదారంగా ఇవ్వాలి. 2.రెండవది సంతోషంగా ఇవ్వాలి.
మీరు పిసినారిగా ఉంటే, దేవుడు మీ పట్ల కృంగిపోతాడు. మీరు ఉదారంగా ఉంటే, ఆయన మీతో వ్యవహరించేటప్పుడు అలాగే ఉంటాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. కాబటి, మీరు ఇవ్వడానికి ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా లేకుంటే వృధా అయిపోతుంది. ఇవ్వడం దేవునిని ఆరాధించడం, దీనిని మనం ఆనందంతో చేయాలి.
ఇచ్చేగుణం మీ హృదయంలో దేవుని దయను ప్రతిబింబిస్తుంది మరియు మిమ్మల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. ఇచ్చుటలో యేసు క్రీస్తే గొప్ప ఉదాహరణ.
నిన్ను శాశ్వతమైన పేదరికం నుండి విముక్తి చేయడానికి, శాశ్వతమైన సంపదలను ప్రసాదించడానికి అత్యున్నత త్యాగం చేయడానికి ఆయన తన పరలోక సంపదను విడిచిపెట్టాడు. హల్లేలుయ. కావున నీ ఆర్థిక పరిస్థితులు మారడానికి ఈ రోజే ఒక మంచి తీర్మానం చేసుకో. అట్టి ఐశ్వరం దేవుడు నీకు అనుగ్రహించును గాక ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
No comments:
Post a Comment