✝️ CHRIST TEMPLE-PRODDATUR
మీరు ఉన్నతస్థలములో నడిచెదరు..
ఉన్నతస్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను. కీర్తనల గ్రంథము 18:16
నా ప్రియులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థలములో నడిపిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:16 వ వచనము తీసుకొనబడినది. " ఉన్నతస్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను"అన్న వాగ్దానము ప్రకారము ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.
ఈ రోజు మీరు *లోతైన నీటిలో మునిగి ఉండవచ్చును* లేదా *ప్రమాదంలో ఉండవచ్చును* మరియు దానిని ఎవరితో పంచుకోవాలో ఆలోచిస్తూ ఉండవచ్చును. దానిని నుండి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి, *అలసిపోయి ఉండవచ్చును.*
నా ప్రియులారా, నేడు మీరు అనేక చిక్కుల్లో కూరుకుపోయి, ఇంకేముంది నా జీవితం నాశనం అయ్యింది ఇక చావే నాకు గతి అనే దీన స్థితికి దిగజారి ఉండవచ్చును. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చూసి, ఈ వేకువజామున దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన తన ఉన్నతమైన అధికార స్థానం నుండి దిగివచ్చాడు. ఆయన ఈ వాగ్దానము ద్వారా మీకు జ్ఞానమును దయచేయాలనుకుంటున్నాడు. బైబిల్‌లోని ఒక సంఘటనలో పేతురు గలిలయ సముద్రం మీద నడవాలనుకుంటున్నాడని మనం చదవగలము. యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు మరియు పేతురును తన దగ్గరకు రమ్మని చెప్పాడు. పేతురు కూడా నడవడానికి దోనెలో నుండి సముద్రము మీద దిగాడు. అతను ఒంటరిగా సముద్రం మీద నడవడానికి ప్రయత్నించాడు. కానీ, సముద్రంలో వీస్తున్న గాలిని చూసి క్రిందపడిపోయాడు. గాలి వీచినప్పుడు అతను సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించాడు మరియు తనకు సహాయం చేయమని ప్రభువునకు మొరపెట్టాడు. ప్రభువు నీటి మీద నుండి నడుస్తూ క్రిందకి వంగి అతనిని పైకి లేపాడు. పేతురు గొప్ప ప్రమాదం నుండి బయటకి వచ్చి యేసుతో కలిసి నడిచాడు.
నా ప్రియులారా, ఈ విధంగా, నేడు ఈ సందేశమును చదువుచున్న మీరు కూడా దేవునితో నడవాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు సరియైన మార్గములో నడుచుటకు ఆయన మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. మీ ఆలోచన ప్రకారం వెళ్ళోద్దు. దేవునికి లోబడి జీవించండి. మీరు దేవుని శక్తి ద్వారా భూమి యొక్క ఉన్నత స్థలమునకు వెళ్ళవచ్చునని యేసయ్య సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, ఆయన మీకు సరాళమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఈరోజు మీ కొరకు మహిమాన్వితమైన కార్యము చేయుచున్నాడు.ఆమెన్. ఆయన లోతైన నీటి నుండియు మరియు ప్రమాదం నుండియు మిమ్మల్ని పైకి లేపుతాడు మరియు మీకు తన బలాన్ని మరియు ఆలోచనలను అనుగ్రహిస్తాడు మరియు మిమ్మల్ని సముద్రం మీద నడిచేలా చేస్తాడు. ఈ లోకములో ఒక అద్భుతమైన మరియు గొప్ప కార్యాలను మీ పట్ల జరిగిస్తాడు. దేవుడు మీ జీవితంలోని ఈ ప్రమాదాన్ని గొప్ప అద్భుతంగా మారుస్తాడు. నేడు దేవుడు ఈ దీవెనలతో మిమ్మును దీవించును గాక! ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments