Posts

ఎండమావులు నీటి మడుగులుగా..

Image
════════════════════════════ ✨ CHRIST TEMPLE ✨ 📅 06 March 2026 ════════════════════════════ అంశము : ఎండమావులు నీటి మడుగులుగా.. 📖 ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా 35:7 “ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును; నక్కలు పండుకొనిన వాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.” మన జీవితంలో కొన్ని కాలాలు పూర్తిగా ఎండిన భూమిలా అనిపిస్తాయి. ఆశలు కరిగిపోయినట్లు, పరిస్థితులు మారవని భావన వస్తుంది. మనం చేసిన ప్రార్థనలు ఫలించలేదని కూడా అనిపించవచ్చు. కాని దేవుని వాగ్దానం ఏమిటంటే — ఎండమావులను కూడా మడుగులుగా మార్చేది దేవుడే. మనకు శూన్యంగా కనిపించే చోట ఆయన జీవజలాన్ని ప్రవహింపజేస్తాడు. నక్కలు తిరిగే వెలితి ప్రదేశంలో కూడా దేవుడు పచ్చికను పెంచుతాడు అని ఈ వాక్యం చెబుతోంది. అంటే మన జీవితంలో నిరాశ ఉన్న చోట దేవుడు ఆశను, బాధ ఉన్న చోట ఆనందాన్ని, కొరత ఉన్న చోట సమృద్ధిని కలిగించగలడు. కాబట్టి ఈ రోజు మీరు ఎడారి పరిస్థితుల్లో ఉన్నా నిరుత్సాహపడకండి. దేవుడు మీ ఎడారిని ఆశీర్వాదాల తోటగా మార్చగలడు. ════════════════════════════ 🙏 ప్రార్థన కొరకు సంప్రదించండి 📞 Dr. N. Balu: +91 8142229661 ...

కీర్తనలు పాడుడి..విజయం నీదే..

Image
  కీర్తనలు పాడుడి..విజయం నీదే.. కీర్తనలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును ప్రశాంతంగా మార్చుతుంది. మనం కీర్తనలు పాడినప్పుడు అది చింత, ఒత్తిడి నుండి ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండె చప్పుళ్ళు ఒకరినోకరికి ఏకీభవిస్తాయని కొందరి పరిశోధకుల అభిప్రాయం. అపోస్థలుడు పౌలు అంటాడు “ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించమని ప్రోత్సాహిస్తున్నాడు (ఎఫెసీ 5:19). పరిశుద్ద గ్రంథంలోని అనేక సందర్భాల్లో కూడా దేవుని స్తుతించమనే చెబుతుంది. “దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.” కీర్తన 47:6. శత్రువులు యూదా జనాంగంవైపు వస్తున్నప్పుడు, భయపడిపోయిన రాజైన యెహోషాపాతు అందరినీ యెహోవా సన్నిధిని సమకూర్చాడు. సమాజాన్నంతటిని తీవ్రమైన ప్రార్ధనలో నడిపించాడు. వారు తినక త్రాగాక కేవలం ప్రార్ధన మాత్రమే చేశారు. “ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మా దిక్కు” అని ప్రార్ధన చేశారు. మరుసటి దినము యుద్ధరంగంలోనికి నడిచి శత్రువుల మీదికి వెళ్ళారు. అక్కడ వారిని నడిపించింది గాయక బృందమేగాని...

నూతన హృదయము నీకిచ్చెదను..

Image
 - నూతన హృదయము నీకిచ్చెదను.. గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి? కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు . వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.2 తిమోతికి 4:2 కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు. అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం ...

24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది..

Image
 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది.. సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి. ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయ...

అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు..

Image
- అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు.. అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.                    ఆది 15:2-4 అబ్రాహాముకు దర్శనమందు దేవుని వాక్యము ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంది. అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం చేస్తాను. *వాక్యం మాట్లాడుతుందా?* అవును! వాక్యమే దేవుడై యుండెను.              యోహాను 1:1 దానికి అబ్రాహాము అంటున్నాడు. ప్రభువా నీవు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ప్రయోజనం ఏంటి? నాకు సంతానం లేదుకదా? నా దాసుడే నాఇంటికి వారసుడు కదా? అని దేవునికి మనవి చేసినప్పుడు, ఆ దినాన్ని అతనికి దేవుడు గొప్ప వాగ్ధానమిచ్చాడు. నీ దాసుడు నీ ఇంటికి వారసుడు కాదు. నీ గర్భమున పుట్టబోవువాడే నీకు ...

100% ఫలించండి..

Image
- ఈ సంవత్సరం 100% ఫలించండి.. 1. ఫలించుట అనగా నేమి? 🍓🍓🍓🍓🍓🍓🍓🍓 పరిశుద్ధ గ్రంథము ఫలించుటను 'అభివృద్ధి పొందుట', 'వర్థిల్లుట' మరియు 'ఆశీర్వదించబడుట' అని కూడా తెలియజేస్తున్నది. *దేవుడు ఆదాము, హవ్వలను ఆశీర్వదించి - మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోబరచుకొనుడని చెప్పెను. (ఆది 1:28)* ఇస్సాకు దేవుని ఆశీర్వాదాలను పొంది నూరంతల ఫలమును, మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధిని పొందెను. (ఆది 26:12,13) *అబ్రాహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను.(ఆది 24:1)* 2. ఫలించుట ఎట్లు? 🍊🍊🍊🍊🍊🍊🍊🍊 *నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు; ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని ప్రభువు చెప్పెను. (యోహాను 15:1-5)* మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి, క్రీస్తును హృదయంలో చేర్చుకొని, ప్రార్థనలో ఆయనతో సహవాసము కలిగి, ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు బహుగా ఫలిస్తాము! *దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలె ఫలించును. అతడు చేయున ద...

హ్యాపీ న్యూ ఇయర్

Image
- 2025 అనే తలుపు నీయెదుట తీయబడినది.. "ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను. దానిని ఎవడును వేయనేరడు. - ప్రకటన 3:8 2024లో సాతానుడు మన జీవితంలో అనేక విషయాలకు తలుపులు మూసి బంధించాడు. సాతాను చేత మూయబడిన అనేక ఇత్తడి తలుపులను ఇనుప గడియలను ప్రభువు ఈ సంవత్సరం పగులగొట్టి నూతన ద్వారములను నీకు తీయనున్నాడు. (యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగుల గొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను)   కారణం..ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నవి కనుక తలుపులు తీయుటకును వేయుటకును ఆయన సర్వాధికారి. ప్రభువు 2025లో నీ కొరకు తెరవనున్న కొన్ని తలుపులను మనం ఇప్పుడు గమనిద్దాం. *1. విశ్వాస తలుపు:*  ఈ సంవత్సరమైనా మనం విశ్వాసపు ద్వారంలో ప్రవేశించాలి. (అపో.కా 14:27 వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు *విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు*, వివరించిరి.)  పౌలు మొదటి సువార్త దండయాత్రలో ప్రభువు అనేక పట్టణాల్లో ప్రభువు అనేకులను విశ్వాస తలుపులు తీసాడు. అంతి యోకయ, ఈకొనియా దెర్బే, మొదలగు ప...

నీకు అంతా మంచే జరుగుతుంది..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*  నీకు అంతా మంచే జరుగుతుంది.. నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏ సందర్భాలోనైనా స్తుతిస్తాను అని ఒక స్నేహితునికి చెప్తూ ఉండేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు వేరే ఊరికి వెళుతున్నానని వీడ్కోలు చెప్పి బస్టాండ్ కు వెళ్ళాను. నేను ఆలస్యంగా వెళ్లేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది. ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ఇంటికి తిరిగివచ్చిన నన్ను చూసి నా స్నేహితుడు నాకు సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఈ సందర్భాల్లో కూడా మీరు దేవుణ్ణి స్తుతిస్తారా అని నన్ను అడిగితే, నేను అవుననే చెప్పాను.  ఎలాగైతేనేం అన్ని పరిస్థితుల్లో అనగా నష్టంలో, కష్టంలో, అప్పుల్లో, బాధల్లో, అనారోగ్యం కూడా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాలన్న నా నమ్మకానికి ఒక క్రొత్త అర్ధం చేకూరింది. ఆరోజు బస్సు మిస్సయింది అనుకున్నాను కాని మరుసటి రోజు వార్తల్లో యాక్సిడెంటుకు గురైందని వార్తా పత్రికలో చదివినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. ఈ సందర్భం మాలో గొప్ప అనుభూతిని కలుగజేసింది. మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో  “ప్రభువా నీకు వందనాలు” అని చెప్పడం కష్టమనిపిస్తుంది. దేవుని ఉద్దేశాలు మనం చూడగలిగినా, లేకపోయినా ప్రతి పరిస్థితిలో ద...

ఆనందాల నది..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* ఆనందాల నది..  నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. - కీర్తనల గ్రంథము 36:8  ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ అనేక విషయాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అన్యాయం మరియు ప్రమాదాలవంటి  వార్తలు వింటూ ఉంటాము. అంతేకాదు, మనలో అనేకమంది అనేక సవాళ్ళతో అంటే సమస్యలతో పోరాడుతున్నారు. అయితే, కొన్నిసార్లు ఆనందాన్ని కనుగొనడంలో శ్రమలు మనకు సహాయపడతాయి. ఎలా అంటే మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి దగ్గరగా బ్రతికినప్పుడు మనం ఆయనలో నిలిచియున్నప్పుడు దేవుడు తన విశిష్ట మార్గంలో మనల్ని ఆనందాలతో ఎలా నింపుతాడో, ఆ ఆత్మీయ సంతోషం, అనుభూతి, ఆనందబాష్పాలు అవన్నీ ఖచ్చితంగా దేవునితో సహవాసం మరింత పెరిగేలా సహాయపడుతుంది. నా ప్రియమైన స్నేహితులారా, మనం ఎప్పుడు ఏడుస్తూ వుండాలని దేవుని కోరిక కాదు.. మనం సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషభరితమైన ఫలాలతో మనలను పోషించాలని అనుదినం కోరుకుంటున్నాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి వంటి పరిస్థితులగుండా ప్రయాణిస్తున్నప్పుడు, అదే చీకటి ప్రపంచంలోని...

నీటి ఊటలు

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*  నీటి ఊటలు.. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా.. - యోహాను 4:15  నీటి ఊటలను వీక్షించడం ఒక అందమైన ప్రశాంతమైన అనుభవం. నీటి ఊటలు భూమి నుండి ఉద్భవించే మంచినీటి వనరులు మరియు తరచుగా దట్టమైన వృక్షసంపద వన్యప్రాణులచే చుట్టుముట్టబడతాయి. నీటి ఊటలు ఎల్లప్పుడూ కదులుతూ ఉల్లాసంగా ఉంటాయి. ఆధ్యాత్మిక నీటి ఊటలు మన రక్షణకు సాదృశ్యమైన జీవజలాన్ని సూచిస్తాయి. ప్రయాసలో ఉన్నవారికి, వారి భారాన్ని తొలగించుకొని, శాంతిని కోరుకునే వారికి, ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి ఈ నీటి ఊటల దగ్గర సేదదీరమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు.   ఈ సజీవమైన నీటి ఊటలైన యేసు క్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు, ఎడారి మోడైన మన స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది, మన జీవితాలను పవిత్రపరుస్తుంది. ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి యేసు క్రీస్తు ఒక్కడే ఏకైక మార్గం, అది మనల్ని రక్షణ కోసం, శాంతి మరియు ప్రశాంతత యొక్క స్థానానికి నడిపిస్తుంది. ఈరోజు మనం చేయవలసిందల్లా ఆయన యెదుట సాగిలపడి, మన హృదయాన్ని జీవితాన్ని ఆయనకు...

కష్ట సమయాల్లో

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*  కష్ట సమయాల్లో..  ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. - కీర్తనల గ్రంథము 20:1 కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం. ఈ వాక్యంలో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృదయపూర్వక ప్రార్థనను వ్యక్తం చేశాడు. తనకు అవసరమైన సంపూర్ణ సహాయాన్ని దేవుడు మాత్రమే అందించగలడని విశ్వాసముతో ప్రార్ధన చేస్తున్నాడు. విశ్వాసులుగా, మనకు కలిగే ప్రతికూల పరిస్థితులలో ఏ బంధువు, ఏ స్నేహితుడు సహాయం చేయరు. సహాయం చేయగలిగిన శక్తి వారికి ఉన్నాకూడా చేయరు. ఎందుకంటే నీవు అలా దీన స్థితిలో వుండడం వారికి సంతోషం కలిగిస్తూ వుంటుంది. నీవు కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో నీ గురించి హీనంగా వారు మాట్లాడతారు. ఎవ్వరూ నిన్ను ఆధరించకపోయినా , సహాయం చేయకపోయినా యేసయ్య మనకు సహాయం చేస్తాడు. ఆయనే జవాబిస్తాడని విశ్వసిస్తూ ప్రార్ధన చేయాలి. మనం సవాళ్లు మరియు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు, మనం ప్రార్థనలో దేవుని వైపు తిరగవచ్చని మరియు ఆయన సహాయం మరియు రక్షణ కోసం అడగవచ్చని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందవచ్చు. నేడు, ఈ వాక్య...

సేవకునికి తోడుగా..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - సేవకునికి తోడుగా.. బైబిలులోని కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలీయులను మోషే నడిపించే సమయంలో, అమాలేకీయులు వారిపై యుద్ధానికి వచినప్పుడు; మోషే తన చేతి కఱ్ఱను చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిలబడి, తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారని, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేకీయులు గెలిచారని (నిర్గమ 17:8-15) మనందరికీ తెలుసు. అయితే, మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆహారోను, హూరులు మోషే చేతులను ఇరువైపులా పట్టుకొని అతని చేతులను ఆదుకొనగా…అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండినందున ఇశ్రాయెలీయులు గెలిచేలా సహాయపడ్డారు. ఆహారోను గూర్చి మనందరికీ తెలిసినప్పటికీ, హూరు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ వ్రాయబడలేదు. క్షుణ్ణంగా గమనిస్తే ఇశ్రాయేలీయుల చరిత్రలో అమాలేకీయులపై యుద్ధం చేసినప్పుడు వారు పొందిన విజయం వెనుక అతనొక కీలకమైన పాత్రను పోషించాడు. బయటకు తెలియకపోయినా వెనకనుండి నడిపించి... సహాయం చేసి గుర్తింపు లేని పాత్రను పోషించే వారు కొందరుంటారు.  గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన సేవకులు, నాయకులను చూ...

ఛా.. నా టైమ్ బాలేదు !

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*  ఛా.. నా టైమ్ బాలేదు ! సిరియా రాజు... ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండు పేటను సిద్ధపరచుకొని, చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలం బలగం ఇశ్రాయేలీయులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుఱ్ఱములు రథములు; గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు.  మరోవైపు...పెందలకడనే లేచిన ఎలీషా పనివాడు, తమను చుట్టుముట్టారని తెలుసుకొని ఎలీషాకు కబురుపెట్టాడు. భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని (2 రాజులు 6:16) ఎలీషా చెప్పినప్పుడు ఆకాశమువైపు కన్నులెత్తి చూశాడు... పరలోక సైన్యం ఎలీషా చుట్టు పర్వతము వంటి అగ్ని గుఱ్ఱములచేత రథములచేత నిండియుండుట ఆశ్చర్యానికి గురిచేసింది. సిరియనుల ఆలోచనలు తారుమారయ్యాయి. కత్తి యెత్తలేదు విల్లు విరువలేదు ఇశ్రాయేలీయులు తప్పించబడ్డారు. పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. ఎల్లప్పుడు విశ్వాసంతో జీవించే మనకు, ఒక వేళ నలు దిశలనుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు లేదా మనలను ముంచివేద్దాం అనేవారు మనలను సమాపించేలోపే దేవుడు మన చుట్టూ అగ్ని కంచె వేయగల సమర్ధుడు. మన టైం బాలేదు అని మనం అనుకుంటాం; అయిత...

మీది తెగిపోని..విడిపోని కుటుంబ బంధం..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - మీది తెగిపోని..విడిపోని కుటుంబ బంధం.. మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య లేదా మన బంధువుల మధ్య లేదా మన కుటుంబ సభ్యులు మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది.  ఏ బంధం లేని సంబంధం, బంధుత్వం లేదా అన్నదమ్ముల అనుబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. తీపి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.  ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతోషాలుగా అనుకునే కుటుంబ బంధంలో భావాల మధ్య విభేదాలు మొదలవుతే... అది మనల్ని కృంగదీస్తుంది..కన్నీరు తెప్పిస్తుంది. సరే మనసు మార్చుకొని, గుండెను రాయిచేసి, వారితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ పొతే మనతో ఎవరు ఉండరు, ఆ తరువాత మనం ఒంటరైపోతాము. ఏకాకిలా మిగిలిపోవాలి.  ఎదుటి వ్యక్తి మనల్ని అర్ధం చేసుకోలేదు, మన మనోభావాలను గౌరవించలేదు వారితో మాట్లాడి ఇంక ప్రయోజనం ఉండదు అని అనుకుంటే పొరపాటే. మరి ముఖ్యంగా మనం రోజు మన కుటుంబ సభ్యుల మధ్య ఎవరితోనైతే అనుదినం మనం కలిసి జీవిస్తామో వారితో ఉన్న సంబంధం మధ్య సమాధానం పొందుకోవడం అతి ప్రాముఖ్యం. ప్రియ స్నేహితులారా నేనంటాన...

దేవుడే ఫస్ట్..మిగతావి అన్ని నెక్స్ట్..

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - దేవుడే ఫస్ట్..మిగతావి అన్ని నెక్స్ట్..  కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. - మత్తయి 6:33 మొదట ఆయన రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెదకడం మన ప్రాధాన్యతగా చేయగలిగితే, మిగిలిన వాటిని దేవుడు చూసుకుంటాడని మనం నేర్చుకోవచ్చు. జీవితంలో ప్రాపంచిక విషయాల ముసుగులో చిక్కుకోవడం సులభం. కొన్నిసార్లు, మన లక్ష్యాలు మరియు ఆశయాలపై మనం ఎంతగా దృష్టి కేంద్రీకరిస్తామంటే దేవునినే వెతకడం మర్చిపోతాము. అయితే మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే మిగిలిన వాటిని ఆయన చూసుకుంటాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది.  నేనంటాను, దేవుడు మన అవసరాలను తీర్చగల సమర్ధుడు, మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు మనకు కావాలో ఆయనకు ముందే తెలుసు. కాబట్టి మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆయన మనకు అవసరమయ్యే ప్రతీది దయజేస్తాడనుటలో ఎట్టి సందేహం లేదు. భవిష్యత్తు గురించి చింతించకుండా మనం దేవునిపై మరియు ఆయన నీతిపై దృష్టి సారిస్తే, ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు.  మనకు అందించడానికి మనకు మార్గనిర్దేశం చేసేందుకే మన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ...

రథం వెంట పరుగులు...

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - రథం వెంట పరుగులు... గెహాజీ నమ్మకముగా నుండినట్లయితే, ఎలీషా ఏ విధముగా ఏలియా తరువాత ప్రవక్తగా అయ్యాడో అదే విధముగా గెహాజీ ఎలీషా తరువాత ప్రవక్తగా అయ్యుండే వాడు. కాని గెహాజీ మొదట పరీక్షింపబడవలసియుండెను.  సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన నయమాను తన కుష్టురోగము బాగుపడిన తరువాత తిరిగి ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఈ పరీక్ష జరిగెను. అతడు స్వస్థపర్చబడినాననే కృతజ్ఞతతో లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారము వెండిని మరియు అందమైన పది సిరియా దేశపు వస్త్రములను ఇవ్వబోయెను. ఎలీషా కంటే తక్కువైన మానవునికి అది ఎంతటి శోధన! కాని ఎలీషా ఒక్క క్షణమైనా సంకోచించకుండా వాటన్నిటిని వద్దని చెప్పెను. నయమాను ఒక అవిశ్వాసి మరియు రాజీ పడేవాడు అందువలన ఎలీషా అతడి యొద్ద నుండి ఏమీ తీసుకొనలేదు.  నయమాను స్వస్థపడిన తరువాత ఎలీషాతో చెప్పిన విషయములో అతడు రాజీపడువాడని తేటగా తెలుస్తుంది. అతడి యొక్క అధికార స్థానమును బట్టి అతడు విగ్రహారాధన తప్పనిసరిగా చేయవలెనని చెప్పెను. విగ్రహారాధన తప్పని నయమానుకు తెలియును. కాని ఈనాడు అనేకులవలె అతడు కూడా సత్యము కొరకు తన ఉద్యోగమును త్యాగము చేయుటకు యిష్టపడలేదు....

యేసయ్య ప్రేమ

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*  యేసయ్య ప్రేమ ‘ఆ తర్వాత’ యేసుప్రభువు తిబెరియ సముద్రతీరంలో శిష్యులకు ‘మళ్లీ’ తనను ప్రత్యక్షపర్చుకున్నాడంటుంది బైబిలులోని యోహాను సువార్త (21:1). ఈ వాక్యంలోని ‘ఆ తర్వాత’, ‘మళ్లీ’ అనే మాటలు చరిత్ర గతినే మార్చిన ఒక మహోన్నత ఘటనకు సాదృశ్యాలు. రోమా ప్రభుత్వం, యూదులు కలిసి యేసును సిలువ వేయగా ఆయన చనిపోయిన ‘తర్వాత’, ప్రాణభయంతో శిష్యులంతా ఆయన్ను వదిలి పారిపోయి తమ భవిష్యత్తుంతా అంధకారమైందన్న నిరాశావాదంలో కూరుకుపోయిన ‘తర్వాత’, యేసు పునరుత్థానుడయ్యాడని తెలిసినా, ఆయనకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి పారిపోయిన తమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇక దగ్గరకి రానివ్వరని శిష్యులు నిర్ధారణకు వచ్చిన ‘తర్వాత’, యేసు వారిని వెంబడిస్తూ యెరూషలేము నుండి తెబిరియ సముద్ర తీరానికి రావడం, వారికి ‘మళ్లీ’ ప్రత్యక్షమై వారితో సహవసించడం తిరుగులేని, ఎన్నటికీ తరగని దేవుని అద్భుత ప్రేమకు తార్కాణం! మూడేళ్ల క్రితం ఇదే సముద్రతీరంలో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానన్న ప్రభువు వాగ్దానంతో (లూకా 5:10) వారి విశ్వాస యాత్ర ఆరంభమైంది. ఇపుడు భవిష్యత్తంతా అంధకారమయంగా కనిపించగా, యేస...

తప్పిపోయి దొరికిన కుమారుడా..! మళ్ళీ తప్పిపోతున్నావే..!

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - తప్పిపోయి దొరికిన కుమారుడా..! మళ్ళీ తప్పిపోతున్నావే..! Luke(లూకా సువార్త) 15:21 21.అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ఈ ఉపమానానికి తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టారు గాని, తండ్రియోద్దకు తిరిగి చేరాడు కాబట్టి తప్పిపోయి దొరికిన కుమారుడు అనడమే సమంజసం అని నా అభిప్రాయం. యేసుప్రభుల వారు తన ప్రసంగాలలో అనేక ఉపమానాలు చెప్పారు.  మార్కు 4:33,34 లో ఉపమానం. ఆయన ప్రసంగాలన్నీ ఉపమానాలతో నిండి ఉండేవి. వాటిలో బోలెడు నిఘూడ సత్యాలు, పరమరాజ్య రహస్యాలు దాగి ఉండేవి. నేటిదినాల్లో వాడుచున్న ఉపమానాలు ప్రజల్ని నవ్వించడం తప్ప దేవునిరాజ్య ఆత్మీయ మర్మాలు తక్కువ. లూకా గారు వ్రాసిన సువార్త యొక్క ప్రాముఖ్యత గత భాగాలలో వివరించాను. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో గల ఉపమానాలు మిగతా సువార్తలలో లేవు. ఈ 15వ అధ్యాయం బైబిల్ గ్రంధములోనే చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇందులోగల పాత్రలు నేటికీ మనలో ప్రతీ ఒక్కరికి సరిపోతాయి. (Th...

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* -  రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును మనం కృంగిపోయినప్పుడు లేదా ఊహించనిది జరిగినప్పుడు, ప్రస్తుత పరిస్థితి నుండి ఎలా దాటిపోవాలో కష్టంగా అనిపిస్తుంది. జరగబోయే కార్యాలు ఏ విధంగా ఉంటాయో సంశయంగా ఉంటాయి.  కానీ దేవుడే స్వయంగా మన సమస్యల్లో ప్రమేయం చేసుకొని, ఆశీర్వాదకరమైన నిరీక్షణ గురించి మనకు హామీ ఇచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట ద్వారా మనకు మంచి జరుగుతుందని ప్రోత్సహించబడతాము మరియు బలాన్ని పొందుతాము. ఇశ్రాయేలీయులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు వారి భవిష్యత్తు కోసం నిరీక్షణను ప్రకటించాడు. _యిర్మియా 31:17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు._ మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా లేదా ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న అప్పులు, అనారోగ్యం,  ఇబ్బందులు, కరువు మరియు పేదరికం, ఒంటరితనం..  ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడం అసంభవం అనుకున్నా, దేవుడు ఈ రోజు తన వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు మరియు విశ్వాసకర్తయైన దేవుడు నిరీక్షణతో కూడిన భవిష్యత్తు గురించి *హామీ* కూడా ఇస్తున్...

ఏదో ఒక రోజు..దేవుడు నన్ను దీవించడా ?

Image
✝️ *CHRIST TEMPLE-PRODDATUR* - ఏదో ఒక రోజు..దేవుడు నన్ను దీవించడా ?  అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా.. - యోహాను 13:7 జీవితంలో జరిగే ప్రతీ విషయం అనగా ఈ నిందలు, అవమానాలు, ఈ కష్టాలు నష్టాలు వలన దేవుడు చేయుచున్న అద్భుతాలు ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మనయెడల ఒక ప్రణాళిక ఉందని మరియు ఆయన మన మంచి కోసం ప్రతిదీ చేస్తున్నాడని మనం విశ్వసించవచ్చు. మనం పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఆయనపై విశ్వాసముంచమని యేసు క్రీస్తు ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసునని మరియు మన కోసం ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈరోజు మనం సంపూర్ణంగా విశ్వసించవచ్చు..అందులో ఏ సందేహం లేదు. మనల్ని త్రునీకరించే వారు త్రునీకరించనీలే, నీ దగ్గర డబ్బు లేదని, ఏమీ చేతగాదు అని హీనంగా చూస్తే చూడనీలే..నీకంటూ ఒక టైమ్ వస్తుంది ఎదురుచూడడం నేర్చుకో.. ఈ సందేశం ధ్యానిస్తున్న ప్రియ స్నేహితులారా.. ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడనీ, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనీ మరచిపోవద్దు. దేవుడు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన న...