- ఈ సంవత్సరం 100% ఫలించండి..
1. ఫలించుట అనగా నేమి?
🍓🍓🍓🍓🍓🍓🍓🍓
పరిశుద్ధ గ్రంథము ఫలించుటను 'అభివృద్ధి పొందుట', 'వర్థిల్లుట' మరియు 'ఆశీర్వదించబడుట' అని కూడా తెలియజేస్తున్నది.
*దేవుడు ఆదాము, హవ్వలను ఆశీర్వదించి - మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోబరచుకొనుడని చెప్పెను. (ఆది 1:28)* ఇస్సాకు దేవుని ఆశీర్వాదాలను పొంది నూరంతల ఫలమును, మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధిని పొందెను. (ఆది 26:12,13)
*అబ్రాహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను.(ఆది 24:1)*
2. ఫలించుట ఎట్లు?
🍊🍊🍊🍊🍊🍊🍊🍊
*నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు; ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని ప్రభువు చెప్పెను. (యోహాను 15:1-5)*
మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి, క్రీస్తును హృదయంలో చేర్చుకొని, ప్రార్థనలో ఆయనతో సహవాసము కలిగి, ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు బహుగా ఫలిస్తాము!
*దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలె ఫలించును. అతడు చేయున దంతయు సఫలమగును. (కీర్తన 1:1-3)*
దేవుని వాక్యమును మనము దివారాత్రములు ధ్యానించుచు, వాక్యానుసారముగా జీవించుచున్నప్పుడు తప్పక ఫలిస్తాము!
*దేవుని వాక్యమును విని, గ్రహించి, అవలంబించువాడు సఫలుడై నూరంతలు గాను, అరువదంతలుగాను, ముప్పదంతలుగాను ఫలించును అని ప్రభువు చెప్పెను. (మత్తయి 10:23; మార్కు 4:20; లూకా 8:15) దేవుని వాక్యమును విని, గ్రహించి, అంగీకరించి, అవలంబించినప్పుడు మనము బహుగా ఫలించి, అభివృద్ధి చెందుదుము!*
3. ఏఏ విషయాల్లో ఫలించాలి?
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎
ప్రభువు మనలను ఆశీర్వదించినప్పుడు మనమన్ని విషయములలో ఫలించుదుము!
💫1. శరీరములో :
🍓🍓🍓🍓🍓🍓🍓
శరీరానికి కావలసిన ఆరోగ్యము, బలము, సౌందర్యము ప్రభువు యిచ్చునవే! మోషే, దానియేలు వంటివారు ప్రభువు సన్నిధిలో గడిపినందున వారి ముఖములలో వెలుగు, కళ, సౌందర్యము కనిపించినవి.
(నిర్గమ 34:29-35; దానియేలు1:15)
💫2. జ్ఞానములో :
🍋🍋🍋🍋🍋🍋🍋🍋
మన జీవితాలకు అవసరమైన జ్ఞానము, ఈ లోకానికి దేవుని మహిమను చూపించే జ్ఞానము ప్రభువునందు ఫలించువారు పొందుదురు. యోసేపు, సొలొమోను, దానియేలు వంటివారు దేవుడిచ్చు గొప్ప జ్ఞానమును పొంది; వారున్న దేశములకు ఆశీర్వాదకరముగా మారిరి. (ఆది 41:1-57; || దిన 1:7-12; దానియేలు 1:20)
💫3. ఆర్థిక విషయాలలో :
🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏
దేవునియందు ఫలించువాడు ఆర్థిక విషయాలలో కూడా ఫలించును, లేమి లేనివాడుగా ఉండును. కరువులో, కొరతలో కూడా సమృద్ధి కలిగియుండును. గొట్టెల కాపరిగా ఉన్న దావీదు, చక్రవర్తి అగువరకు వర్ధిల్లెను. అబ్రాహాము, యోబు వంటివారు సిరి సంపదలలో కూడా వర్థిల్లిరి.
(ఆది 13:2; యోబు 1:1-3)
💫4. కుటుంబములో :
🍊🍊🍊🍊🍊🍊🍊🍊
మనం ప్రభువుతో సహవాసం కలిగియున్నప్పుడు మన కుటుంబమునకు కూడా ఆశీర్వాదకరముగా ఉందుము! భార్యాబిడ్డలతో వర్ధిల్లు దుము (కీర్తన 128:1-6). తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగాను, ఇంటివారందరికి దీవెనకరంగాను ఉందుము! యోసేపు ఫలించెడి కొమ్మవలె ఉండెను (ఆది 49:22). అతడు తన ఇంటివారికి, దేశమునకు ఆశీర్వాదకరముగా ఉండెను.
💫 5. అన్ని విషయములలో :
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు' (కీర్తన 23:1) అన్న దావీదు వలె దేవునియందు ఫలించువాడు అన్ని విషయములలో అనగా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సాంఘికంగా వర్ధిల్లి ఆశీర్వదించబడును. (ద్వితీయో 28:1-12 చదవండి!)
“ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్థిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను” (III యోహాను :2)
దేవాది దేవుడైన యేసు ప్రభువు వారు మిమ్ములను దీవించును గాక..ఆమెన్
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
Comments