- అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు..
అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా
మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా
యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.
ఆది 15:2-4
అబ్రాహాముకు దర్శనమందు దేవుని వాక్యము ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంది. అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం చేస్తాను.
*వాక్యం మాట్లాడుతుందా?*
అవును! వాక్యమే దేవుడై యుండెను.
యోహాను 1:1
దానికి అబ్రాహాము అంటున్నాడు. ప్రభువా నీవు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ప్రయోజనం ఏంటి? నాకు సంతానం లేదుకదా? నా దాసుడే నాఇంటికి వారసుడు కదా? అని దేవునికి మనవి చేసినప్పుడు, ఆ దినాన్ని అతనికి దేవుడు గొప్ప వాగ్ధానమిచ్చాడు.
నీ దాసుడు నీ ఇంటికి వారసుడు కాదు. నీ గర్భమున పుట్టబోవువాడే నీకు వారసుడవుతాడు.
ఆది 15:4
అంతేకాదు, లెక్కింప సఖ్యముకాని ఆకాశపు నక్షత్రములవలే నీ సంతానం అభివృద్ధి చెందుతుంది.
అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు.
*అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను*.
ఆది 15:6
ఇదే విషయాన్ని నూతన నిబంధన మూడు సార్లు ప్రస్తావించింది.
(రోమా 4:3 ; యాకోబు 2:23;
గలతి 3 :6)
అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు. వాగ్ధానమిచ్చిన దేవుడు నెరవేర్చకుండా తప్పిపోలేదు.
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.
ఎట్లనగా దేవుడు అబ్రాహా ముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.
ఆది 21:1,2
సృష్టి ధర్మము చొప్పున వారు బిడ్డను కనడానికి ఎట్లాంటి పరిస్థితులూ అనుకూలంగాలేవు. అసలు సాధ్యం కానీ పరిస్థితులు. కానీ, అతని నమ్మిక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
అవును! నీవు నమ్మ గలిగితే? ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు.
*నీ చుట్టూనున్న పరిస్థితులవైపు, నీ సమస్య వైపు చూడొద్దు. ఆ సమస్యను పరిష్కరించగల దేవుని వైపు చూడు. ఆయన యందు నమ్మిక యుంచు. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు.*
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
Comments