Posts

మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు.

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు. 👉 _సామెతలు 30:24-28_ *1.చీమలు..*  దూరదృష్టి బలము లేని జీవులు అవి ఆహారము సంపాదించుకొనుటకు సరియైన సమయం ముందుగా ఎంచుకొనును. సామెతలు 6: 6-8. సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ముందుచూపు అనేది తెలివైన లక్షణము.  యేసు ప్రభువు గోపురము కట్టగోరిన వ్యక్తి, యుద్ధమునకు పోవు రాజు ముందుగా ఆలోచించుకొనుటను గూర్చి చెప్పెను.(లూకా 14:28-32) అన్యాయస్తుడైన గృహనిర్వాహకుడు ఉపమానము కూడా ఇదే సూత్రం నేర్పించును.(లూకా 16:1-8) పేతురు తన రెండవ పత్రికలో దేవుని వాగ్దానాలు నమ్మి ఆత్మీయజీవితమునకు కావలసిన వాటిని అమర్చుకొనలేనివారు దూరదృష్టి లేనివారని వ్రాసెను. (2పేతురు 1:9) *2.చిన్న కుందేళ్లు...* భద్రత. సామెతలు 30: 26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. కీర్తనలు 104: 18 గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు క...

నీ అందమే నీ అతిశయమా..?

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - నీ అందమే నీ అతిశయమా..? దేవుడు సృష్టించిన సృష్టి మహోన్నతమైనది, అత్యంత సుందరమైనది. ఆ సృష్టిలో స్త్రీ అందమైనది. అయితే, తన అందాన్ని ఇంకా యినుమడింప జేసుకోవడానికి తాను పడని తిప్పలంటూ ఏమి లేవేమో? చెప్పుకొంటూపోతే దానికి అంతమంటూ వుండదేమో? పరిశుద్ధ గ్రంథములో కూడా కొందరి స్త్రీల అందమును గూర్చి ప్రస్తావించబడింది. కానీ వారి అందమునుబట్టి కొనియాడబడిన స్త్రీ ఒక్కరూ లేరు సరికదా. అందము మోసము, అది వ్యర్థమని పరిశుద్ధ గ్రంధం ప్రభోధిస్తుంది.  *శారీరిక అందము*  👉 శారాయి చక్కనిది (ఆది 12:11) 👉 రిబ్కా మిక్కిలి చక్కనిది (ఆది 24:16) 👉 రాహేలు రూపవతి, సుందరి (ఆది 29:17) 👉 అబీగయీలు రూపసి (1 సమూ 25:3) 👉 బత్షెబ బహు సౌందర్యవతి (2 సమూ 11:3) 👉 వష్తి సౌందర్యవతి ( ఎస్తేరు 1:11 ) 👉 ఎస్తేరు,  అందమైన రూపము, సుందర ముఖమును గలది (ఎస్తేరు 2:7) 👉 యెమీమా, కెజీయా, కెరెంహప్పుకు (యోబు కుమార్తెలు) ఊజు దేశమంతటిలో సౌందర్యవతులు. ( యోబు 42:15) *🤞అందము వ్యర్ధము:* అందము మోసకరము. అది నిన్ను కొన్నిసార్లు శోధనకు గురిచెయ్యవచ్చు. అట్లా అని శోధించబడటం పాపం కాదు. శోధనలో పడడమే పాపం. అంద...

నా గొర్రెలు నా మాట వినును..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - నా గొర్రెలు నా మాట వినును..   ప్రియమైన క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులారా..మీ సేవకున్ని అయిన నా స్వరము మీకు వినబడుతోందా ? పరీక్ష చేసుకోండి.. 👉 నీ కాపరి స్వరాన్ని వినగలుగుతున్నావా ? 👉 ఆ స్వరానికి లోబడగలుగుతున్నావా ?  👉 నీ కాపరిని వెంబడించగలుగుతున్నావా ? _నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. - యోహాను 10:27_ *నీవు గొర్రెవు అయితే ?* ▫️నీముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య వుండాలి. ▫️నీ కాపరి (పాస్టర్) అడుగుజాడల్లో నడవాలి. ▫️ఆయన స్వరం వినాలి. ▫️గొర్రెలకు గాయపరచే అవయవాలు( కొమ్ములు) లేవు. అట్లాంటి సాదు స్వభావం నీకుండాలి. ( సేవకుని మీద కూడా తిరగబడి మాట్లాడుతూ , సంఘం కు రాకుండా నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావంటే నీకు కొమ్ములు వున్నాయని అర్థం) ▫️ నీ మాటలు గాని, నీ క్రియలుగాని ఎవ్వరిని గాయపరచే విధంగా ఉండకూడదు. ▫️వాటి సంఖ్యా బలం వాటిని రక్షించ లేదు. ఒక్క  గొర్రెవున్నా, లక్ష గొర్రెలు కలసి వున్నా తోడేలు సులభంగా వాటిని ఎత్తుకొని పోగలదు. నీవెనుకనున్నవారు, నీ ఆస్తులు, నీ ధనము నీ బలం కాకూడదు. యేసయ్య నీ బల...

సేవకులకు సలహా -

Image
- సేవకులకు  సలహా -  సేవకులకు  సలహా -   👉 *1. బ్రతుకు భారమై సేవకు రాకు,  ఆత్మల భార మెక్కువై సేవకు రా* 👉 *2. నీ ఆకలి తీర్చుకొనుటకు సేవకు రాకు,  అనేకుల ఆత్మీయ ఆకలి తీర్చుటకు సేవకు రా* 👉 *3.సంఘ రాబడి కోసం సేవకు రాకు,  సంఘములో అనేకులను చేర్చడం కోసం సేవకు రా* 👉 *4. ఆధిక్యతల కోసం సేవకు రాకు,  అణుకువ కలిగియుండుటకు సేవకు రా* 👉 *5. ప్రతి అవసరత కోసం ప్రజల వైపు చూచుటకు సేవకు రాకు, ప్రభువు వైపు చూచుటకు సేవకు రా* 👉 *6. ప్రజల మీద నమ్మకంతో సేవకు రాకు, ప్రభువు మీద నమ్మకముతో సేవకు రా* 👉 *7. నీ వృద్ధాప్యపు ప్రారంభములో సేవకు రాకు, యౌవన కాలం ప్రారంభములో సేవకు రా* 👉 *8. సంఘములో లేఖన సత్యాలను నేర్చుకోకుండా సేవకు రాకు, లేఖన సత్యాలను నేర్చుకొని సేవకు రా* 👉 *9. ప్రభువు పిలుపు లేకుండా సంఘ సాక్షము లేకుండా సేవకు రాకు,  ప్రభువు పిలుపు సంఘ సాక్ష్యము కలిగి సేవకు రా* 👉 *10. నీ పేరు కోసం సేవకు రాకు,  ప్రభువు పేరు మహిమ పరచడం కోసం రా* ✅ _అప్పుడు ప్రభువు నిన్ను సేవలో వాడుకుంటాడు.. తద్వార దేవునికి మహిమ కలుగుతుంది!_ 👉 *అనేక విషయములలో మన మందరము తప్పిపోవు...

మోహపు చూపుతో..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మోహపు చూపుతో.. ప్రభువైనయేసు కొండమీద ప్రసంగంలో ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన యెడల అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి అతడు రెండు కళ్ళతో నరకానికి వెళ్ళుటకంటే ఒక కంటిని పెరికివేయుట మంచిదని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి అలవాటుగా ఎల్లప్పుడు మోహపు చూపు చూస్తూనే ఉన్నట్లయితే అతడు నరకానికి కూడా వెళ్ళవచ్చునని ప్రభువు చెప్పారు. ఆదాము కాలము నుండి ఈనాటివరకు ఒక మనిషి హృదయములో ఉన్న ఆ మోహమనే తలంపు ప్రతి మనిషి హృదయంలో ఉన్నది. పరిశుద్ధాత్మయొక్క అగ్ని మాత్రమే దీనిని నశింపజేయగలదు. నీ హృదయము పాపము చేయుటకు దురాశలో మండుచుండవచ్చు లేక ప్రభువైనయేసు కొరకు ప్రేమతో మండుచుండవచ్చు. *నీవు ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ఒకటి ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరచే అగ్ని లేక భవిష్యత్తులో నిన్ను కాల్చే అగ్ని. మరొకమార్గం లేదు.* ప్రభువు మాట్లాడిన యూదా ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నత ప్రమాణాలు కలిగియున్నారు. వారు అంత ఖచ్చితముగా ధర్మశాస్త్రమును వెంబడించుటవలన వ్యభిచారులుగా జీవిస్తున్న వారిని చంపి శిక్షించేవారు. ఇప్పటిలాగా లైంగిక సంబంధ ప...

నిందలు బరించడం కూడా గొప్ప భాగ్యమే..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR  నిందలు బరించడం కూడా గొప్ప భాగ్యమే.. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీ 11:24-26 *మోషే:* ▪️ఐగుప్తీయుల సకలవిద్యలను అభ్యసించినవాడు.  ▪️మాటలయందును, కార్యములయందును ప్రవీణుడు. అపో 7:22 అంతటి ప్రావీణ్యం పొందిన మోషే అరణ్యంలో తన మామ మందలను మేపుతున్నాడు.  నిర్గమ 3:1 కారణం? మోషే తేల్చుకోవలసిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి.  ▪️దేవుడా?  ▪️లోకమా? ▪️ఐగుప్తు ధనమా? ▪️క్రీస్తువిషయమైన నిందా? ▪️అల్పకాల పాపభోగమా? ▪️దేవుని ప్రజలతో శ్రమా?  ▪️ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకోవడమా?  ▪️అధికారాన్ని త్రోసివేయడమా? ..ఆలోచించడం మొదలు పెట్టాడు. ♻️ ఐగుప్తు ధనమా? నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. (మత్తయి 6:21) ధనము దేవుని నుండి దూరం చేస్తుంది. అది వద్దు అ...

విశ్వాసము

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR విశ్వాసము   ఒకవేళ పాస్ పోర్ట్, వీసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్లిపోగలవేమో గాని, యేసు క్రీస్తు లేకుండా, నిత్యరాజ్యం చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు.    యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.             యోహాను 14:6   నిత్యజీవాన్ని నీవు చేరాలంటే? దాని 'మార్గమైన' యేసు ప్రభువును నీవు చేరాలి. 'విశ్వాసమే' నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు.     *1. 'విశ్వాసమే' రక్షణకు మార్గము.*   మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు.                ఎఫెస్సి 2:8   నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును (మార్కు ‪16:16‬)   యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9)   *2. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఆయన పిల్లలు.*   తన్ను ఎందరంగ...