Posts

పరిశుద్ధ గ్రంధమును ప్రతి రోజు ఎందుకు ధ్యానించాలి..?

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - పరిశుద్ధ గ్రంధమును ప్రతి రోజు ఎందుకు ధ్యానించాలి..? ▫️పరిశుద్ధ గ్రంధమును ఎందుకు ధ్యానించాలంటే..?  🔅మన నడతను (ప్రవర్తన) సరిచేస్తుంది:  "యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?"  కీర్తనలు 119:9 హృదయం నిండిన దానినిబట్టే మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి వుంటాయి. అందుచే మొట్టమొదటగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలి అంటే? పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించాలి.  ఎందుకంటే? దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీ  4:12) 🔅దేవుని వాక్యము మనలను పాపము చెయ్యకుండా అడ్డగిస్తుంది  " నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను." (కీర్తనలు 119:11) 🔅దేవుని వాక్యము మనకు సంతోషాన్నిచ్చి, ఆలోచన పుట్టిస్తాయి.  "నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి." (కీర్తనలు 119:24) నీ మ...

సమస్యను చూచి టెన్షన్ పడకు.. ఊరక నిలుచుండి చూడు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR. - సమస్యను చూచి టెన్షన్ పడకు.. ఊరక నిలుచుండి చూడు.. - యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి.- (నిర్గమ 14:13) ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వమునుండి విమోచించబడి వాగ్ధాన దేశమునకు తిరిగి వస్తున్న సందర్భములో ఎదురుగా ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం, అంటే ముందు నుయ్య వెనుక గొయ్యి. భయబ్రాంతులైన ఇశ్రాయేలీయులు దేవునిని ప్రార్ధిస్తూనే, మోషే మీద తిరుగుబాటు చేసే పరిస్థితి. అప్పటికే వారొక నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. తిరిగి ఐగుప్తు బానిసత్వానికి వెళ్లడం, లేదా వారి చేతిలో మరణించడం. అంతేతప్ప, ఐగుప్తు ప్రజలను తెగుళ్లతో బాధిస్తూ, ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా ప్రత్యేకపరిచారో, ఆయన ఎంతటి సర్వశక్తిమంతుడో అనుభవపూర్వకంగా ఎరిగియుండికూడా, ఆయన శక్తిని ఆశ్రయించలేని పరిస్థితి. వారికి ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యం తప్ప వీరికేమి కనిపించడం లేదు.  అట్లాంటి పరిస్థితులలో సాత్వీకుడైన మోషేగారు వారికిచ్చే సమాధానం, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి (నిర్గమ 14:13) యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో ...

సమస్తము మేలు కోసమే..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - సమస్తము మేలు కోసమే.. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమీయులకు 8:28. నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మరియు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు శుభాభి వందనములు తెలియజేస్తున్నాను.  ఈరోజు మనం ధ్యానించబోయే ప్రాముఖ్యమైన వాగ్దాన వచనం, దేవుడు మన పట్ల సమస్తమును మేలు కొరకే జరిగించాలని మన పట్ల ఆయన కోరుచున్నాడు.  అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:28 వ వచనము వాగ్దానముగా ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' అని చెప్పినట్లుగానే, సమస్తమును మీ జీవితములో మేలు కొరకు జరుగునట్లుగా దేవుడు మీకు అటువంటి గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. మీరు ఈ మేలులు పొందుకోవాలంటే, దేవుని మీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆయనను ప్రేమించే వారి మేలు కోసం సమస్త కార్యాలు జరిగిస్తాడని మనకు తెలుసు మరియు ఆయన తన ఉద్దేశ్యం ప్రకారం మనము పిలువబడినవారము. కాబట్టి...

- దేవుడు మీ ఇంటిని విజిట్ చేయబోతున్నాడు..కనిపెట్టుకొని రెడీగా ఉండు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - దేవుడు మీ ఇంటిని విజిట్ చేయబోతున్నాడు..కనిపెట్టుకొని రెడీగా ఉండు.. సాధారణముగా మనము వేరే పనిమీద వెళ్తున్నప్పటికీ, మధ్యలో మనకు అత్యంత సన్నిహితులైనవారి గృహాలమీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వారిని పరామర్శించి వెళ్లడమనేది సహజం. అట్లానే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చెయ్యాలని బయలుదేరిన సందర్భంలో దారిలోనున్న అబ్రాహామును పలకరించి వెల్దామన్నట్లుగా అబ్రాహాము దగ్గరకు వచ్చిన సందర్భమిది. దేవుడే అబ్రాహామును పలకరించి వెళ్లాలనుకున్నారంటే దేవునికి, అబ్రాహాము ఎంతటి సన్నిహితుడయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ సాన్నిహిత్యమే దేవునికి, అబ్రాహాము స్నేహితుడయ్యేటట్లు చేసింది. దేవుడు అబ్రాహామును దర్శించిన సమయం “ఎండవేళ” (మధ్యాహ్నం) (ఆది 18:1). అది వృద్ధాప్యములోనున్న అబ్రాహాము విశ్రాంతి తీసుకొనే సమయం. కానీ, అబ్రాహాము నిద్రపోవడంలేదుగాని గుడారపు ద్వారమందు కూర్చొనివున్నాడట. మధ్యతూర్పు దేశాలలో మధ్యాహ్నసమయంలో ప్రయాణ బడలికచేత అసలి సొలసి దారిని వెళ్తున్న బాటసారులను వారింటికి పిలచి, త్రాగడానికి నీళ్లు, తినడానికి ఆహారము పెట్టడము ఆనవాయితీగా వుండేదట. అందుచే అబ్రాహాము అట్లాంటి వారిక...

- బాడీ మీద టాట్టుస్..విచిత్రమైన హెయిర్ స్టైల్స్..ఇవన్నీ దేవునికి ఇష్టమేనా ?

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - బాడీ మీద టాట్టుస్..విచిత్రమైన హెయిర్ స్టైల్స్..ఇవన్నీ దేవునికి ఇష్టమేనా ? - చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను” (లేవీ. 19:28) అని పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించింది. కాబట్టి, నేటి విశ్వాసులు పాత నిబంధన ధర్మశాస్త్ర ఆధీనంలో లేనప్పటికీ (రోమా. 10:4; గలతీ. 3:23–25; ఎఫెసీ. 2:15), పచ్చబొట్లకు విరోధంగా ఒక ఆజ్ఞ ఉన్నదనుట కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది.  ఒక విశ్వాసి పచ్చబొట్టు వేయించుకొనుట లేక విసర్జించుటను గూర్చి క్రొత్త నిబంధన ఏమి చెప్పుటలేదు. 1 పేతురు 3:3–4లో ఈ ఆజ్ఞ ఉంది: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”  ఈ వాక్యభాగము క్రైస్తవ స్త్రీల కొరకు అని నమ్మినట్లైతే, ఇక్కడ ఒక తగిన నియమము ఉంది: అది, ఒక వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యము మన ధ్యా...

బానిసత్వం నుండి విడుదల..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - బానిసత్వం నుండి విడుదల.. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిర్గమ 2:23 దేవుడు అబ్రాహాము గారికి తెలియజేసిన విధంగా, నీ సంతతివారు,  తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. (ఆది 15:13, 14) దీని నెరవేర్పులో భాగంగా, యోసేపును అతని అన్నలు ఇష్మాయేలీయులకు అమ్మడం, వారు తీసుకెళ్లి ఐగుప్తీయులకు అమ్మడం, అక్కడ యేసేపునకు దేవుడు తోడైయుండి ఆయనను ఆ దేశ ప్రధానిని చెయ్యడం, ఆ సమయంలో అతని తండ్రి ఇంటివారు నివసిస్తున్న కనానులో కరవు రావడం, యోసేపు సహోదరులు ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వెళ్లడం, యోసేపు వారిని గుర్తుపట్టి, తన తండ్రి ఇంటివారందరిని ఐగుప్తులో నివసించుట కొరకు ఫరోతో మాట్లాడడం, ఆరీతిగా యాకోబు గారి కుటుంబమంతా ఐగుప్తుకు చేరింది. యేసేపు జీవించియున్నంత కాలం, సమృద్ధి, సమాధానంతో గడి...

కయీను పశ్చాతాపం..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - కయీను పశ్చాతాపం.. 🔸సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు  🔸వ్యవసాయకుడు  🔸మొట్ట మొదటి నరహంతకుడు  🔸సహోదరుని ప్రేమించలేని వాడు  🔸కోపం, ద్వేషం కలిగినవాడు  🔸సత్క్రియలు లేనివాడు  🔸దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణ అర్పించలేనివాడు.  🔸దేవునిమీద ఎదురు తిరిగినవాడు  🔸రక్తం ప్రార్ధించడానికి కారకుడు  🔸నేల తన సారాన్ని కోల్పోవడానికి కారకుడు. 🔸దేవునిచే శపించబడినవాడు  🔸దేశ దిమ్మరి  సృష్టిలో అత్యున్నతమైన సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించారు. తలిదండ్రుల జన్మనివ్వడం ద్వారా భూమిమీదకు ఏతెంచనున్న మొట్టమొదటి మనిషిగా కయీనును దేవుడు నిర్ణయించారు. అంటే, కయీనుపట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళికవుందనే విషయం సుస్పష్టం. అయితే దేవుడు అతనిపట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరకుండా, తనకివ్వబడిన స్వేచ్ఛను కయీను వాడుకొని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. తాను అర్పించిన అర్పణ ద్వారా దేవునిని సంతోషపరచలేక పోవడమే కాకుండా, తన  సహోదరుడైన హేబెలును చంపి, తన పాపమును ఒప్పుకొనక, కప్పుకొని, తనను సృష్టించిన దేవునిమీదే తిరు...