✝️ CHRIST TEMPLE-PRODDATUR
- బాడీ మీద టాట్టుస్..విచిత్రమైన హెయిర్ స్టైల్స్..ఇవన్నీ దేవునికి ఇష్టమేనా ?
- చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను” (లేవీ. 19:28) అని పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించింది. కాబట్టి, నేటి విశ్వాసులు పాత నిబంధన ధర్మశాస్త్ర ఆధీనంలో లేనప్పటికీ (రోమా. 10:4; గలతీ. 3:23–25; ఎఫెసీ. 2:15), పచ్చబొట్లకు విరోధంగా ఒక ఆజ్ఞ ఉన్నదనుట కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది.
ఒక విశ్వాసి పచ్చబొట్టు వేయించుకొనుట లేక విసర్జించుటను గూర్చి క్రొత్త నిబంధన ఏమి చెప్పుటలేదు.
1 పేతురు 3:3–4లో ఈ ఆజ్ఞ ఉంది: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”
ఈ వాక్యభాగము క్రైస్తవ స్త్రీల కొరకు అని నమ్మినట్లైతే, ఇక్కడ ఒక తగిన నియమము ఉంది: అది, ఒక వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యము మన ధ్యాసైయుండకూడదు. ఇప్పటి యూత్ “హెయిర్ స్టైల్స్” “మంచి వస్త్రములు” (సినిమా హీరో లా హెయిర్ స్టైల్స్, తల మీద గీతలు, చినిగిన జీన్స్ లు) మరియు స్త్రీలు అయితే ఆభరణాలపై ఎక్కువ ధ్యాస పెడుతున్నారు గాని, ఒక స్త్రీ యొక్క నిజమైన అందం వాటిలో లేదు. అదే విధంగా, పచ్చబొట్లు మరియు శరీరమును కుట్టుట, కోసుకొనుట, సూదులు పొడుచుకొనుట “బాహ్య అలంకరణలు,” మరియు స్త్రీలైనా పురుషులైనా తమ “అంతరంగమును” ( దేవుణ్ణి) బలపరచుటకు జాగ్రత్తగా కృషిచెయ్యాలి.
పచ్చబొట్లు మరియు శరీరమును కుట్టుట విషయానికి వస్తే, దేవుడా నేను ఇలా టాట్టూ వేపించుకుంటున్నా, నేను ఇలా స్టైల్ గా ఉండాలని అనుకుంటున్నా వాటిని ఆశీర్వదించమని మన మంచి మనసాక్షిలో నిజాయితీగా దేవుణ్ణి అడగగలమా ?. “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1 కొరింథీ. 10:31). పచ్చబొట్లు మరయు శరీరమును కుట్టుటను, సూదులతో పొడుచుకొనుట గూర్చి క్రొత్త నిబంధన విశేషంగా అజ్ఞాపించదు, మరియు మనం పచ్చబొట్లు మరియు శరీర కుట్లు కలిగియుండాలని దేవుడు ఆశించుచున్నాడని నమ్ము ఏ కారణమును అది ఇవ్వదు.
బైబిల్ స్పష్టముగా జవాబు ఇవ్వని విషయాలను గూర్చి ఆలోచించునప్పుడు ఒక ముఖ్యమైన లేఖన నియమము, అది దేవుని సంతోషపెడుతుందా లేదా అని చూచుట, మరియు ఎలాంటి సందేహం ఉన్నయెడల, ఆ పనిని చేయుట మంచిదికాదు. విశ్వాసము నుండి పుట్టని ప్రతిదీ పాపమని రోమా. 14:23 మనకు జ్ఞాపకం చేస్తుంది.
మన శరీరములు మరియు ఆత్మలు విమోచించబడి దేవునికి చెందినవైయుండెనని మనం గుర్తుంచుకోవాలి. 1 కొరింథీ. 6:19-20 పచ్చబొట్లు మరియు శరీర కుట్లకు అన్వయించబడినది కానప్పటికీ, అది మనకు ఒక నియమమును ఇస్తుంది: “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” మన శరీరాలతో ఏమి చేస్తున్నాము మరియు ఎక్కడకి వెళ్తున్నాము అనుదాని మీద ఈ గొప్ప సత్యము యొక్క ప్రభావము పడాలి. మన శరీరములు దేవునికి చెందినవైనయెడల, వాటిని పచ్చబొట్లు మరియు శరీర కుట్లతో “ముద్రించుటకు” ముందు ఆయన స్పష్టమైన “అనుమతి”ని మనం పొందాలి.
మరి మీ టాట్టూ కు మీ హెయిర్ స్టైల్స్ కి దేవుని పర్మిషన్ వుందా ? మనుషులను మెప్పించడానికి చేస్తున్నావా ? జాగ్రత్త మిత్రమా.. ఈ సారి మీ దేహం మీద టాట్టూ వేపించుకునెప్పుడు, తల మీద గీతలు పెట్టించుకోవాలన్నా, విచిత్రమైన హెయిర్ స్టైల్స్ కావాలన్నా కచ్చితంగా దేవుని నుండి పర్మిషన్ వచ్చాకే ప్రొసీడ్ అవ్వండి..ప్రియ సోదరి సోదరుడా చర్చికి వెళ్లి ప్రార్థన చేసే మనకు ఒక విస్వాసిగా అలాంటి ఈ లోక స్టైల్స్ అవసరమా ? అలాంటి అర్ధ వస్త్రాలు అవసరమా ? ఆలోచించండి...మంచి నిర్ణయం తీసుకోండి... మన దేహంతో దేవుణ్ణి మహిమ పరిచి ఘణపరుచుదుము గాక. ఇతరులకు మాదిరిగా వుందుము గాక ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments