Posts

- బాడీ మీద టాట్టుస్..విచిత్రమైన హెయిర్ స్టైల్స్..ఇవన్నీ దేవునికి ఇష్టమేనా ?

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - బాడీ మీద టాట్టుస్..విచిత్రమైన హెయిర్ స్టైల్స్..ఇవన్నీ దేవునికి ఇష్టమేనా ? - చచ్చినవారికొరకు మీ దేహ మును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచు కొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను” (లేవీ. 19:28) అని పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించింది. కాబట్టి, నేటి విశ్వాసులు పాత నిబంధన ధర్మశాస్త్ర ఆధీనంలో లేనప్పటికీ (రోమా. 10:4; గలతీ. 3:23–25; ఎఫెసీ. 2:15), పచ్చబొట్లకు విరోధంగా ఒక ఆజ్ఞ ఉన్నదనుట కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది.  ఒక విశ్వాసి పచ్చబొట్టు వేయించుకొనుట లేక విసర్జించుటను గూర్చి క్రొత్త నిబంధన ఏమి చెప్పుటలేదు. 1 పేతురు 3:3–4లో ఈ ఆజ్ఞ ఉంది: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”  ఈ వాక్యభాగము క్రైస్తవ స్త్రీల కొరకు అని నమ్మినట్లైతే, ఇక్కడ ఒక తగిన నియమము ఉంది: అది, ఒక వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యము మన ధ్యా...

బానిసత్వం నుండి విడుదల..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - బానిసత్వం నుండి విడుదల.. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. నిర్గమ 2:23 దేవుడు అబ్రాహాము గారికి తెలియజేసిన విధంగా, నీ సంతతివారు,  తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. (ఆది 15:13, 14) దీని నెరవేర్పులో భాగంగా, యోసేపును అతని అన్నలు ఇష్మాయేలీయులకు అమ్మడం, వారు తీసుకెళ్లి ఐగుప్తీయులకు అమ్మడం, అక్కడ యేసేపునకు దేవుడు తోడైయుండి ఆయనను ఆ దేశ ప్రధానిని చెయ్యడం, ఆ సమయంలో అతని తండ్రి ఇంటివారు నివసిస్తున్న కనానులో కరవు రావడం, యోసేపు సహోదరులు ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వెళ్లడం, యోసేపు వారిని గుర్తుపట్టి, తన తండ్రి ఇంటివారందరిని ఐగుప్తులో నివసించుట కొరకు ఫరోతో మాట్లాడడం, ఆరీతిగా యాకోబు గారి కుటుంబమంతా ఐగుప్తుకు చేరింది. యేసేపు జీవించియున్నంత కాలం, సమృద్ధి, సమాధానంతో గడి...

కయీను పశ్చాతాపం..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - కయీను పశ్చాతాపం.. 🔸సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు  🔸వ్యవసాయకుడు  🔸మొట్ట మొదటి నరహంతకుడు  🔸సహోదరుని ప్రేమించలేని వాడు  🔸కోపం, ద్వేషం కలిగినవాడు  🔸సత్క్రియలు లేనివాడు  🔸దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణ అర్పించలేనివాడు.  🔸దేవునిమీద ఎదురు తిరిగినవాడు  🔸రక్తం ప్రార్ధించడానికి కారకుడు  🔸నేల తన సారాన్ని కోల్పోవడానికి కారకుడు. 🔸దేవునిచే శపించబడినవాడు  🔸దేశ దిమ్మరి  సృష్టిలో అత్యున్నతమైన సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించారు. తలిదండ్రుల జన్మనివ్వడం ద్వారా భూమిమీదకు ఏతెంచనున్న మొట్టమొదటి మనిషిగా కయీనును దేవుడు నిర్ణయించారు. అంటే, కయీనుపట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళికవుందనే విషయం సుస్పష్టం. అయితే దేవుడు అతనిపట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరకుండా, తనకివ్వబడిన స్వేచ్ఛను కయీను వాడుకొని, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. తాను అర్పించిన అర్పణ ద్వారా దేవునిని సంతోషపరచలేక పోవడమే కాకుండా, తన  సహోదరుడైన హేబెలును చంపి, తన పాపమును ఒప్పుకొనక, కప్పుకొని, తనను సృష్టించిన దేవునిమీదే తిరు...

చచ్చిపోవాలని అనుకోవద్దు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - సమస్య వస్తే పోరాడాలి కాని..చచ్చిపోవాలని అనుకోవద్దు.. తాను ఒక దినప్రయాణము  అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. 1రాజులు 19 : 4 🔹ప్రార్ధించిన వ్యక్తి: ఏలియా 🔹దేనికొరకు : తన ప్రాణమును తీసుకొమ్మని  🔹సందర్భము: యెజెబెలు తనను చంపజూచినప్పుడు  కర్మెలు పర్వతం మీద 850మంది బయలు, అషారాదేవి ప్రవక్తలమీద సవాలు విసిరి, ఆకాశమునుండి అగ్నినిదింపి, నిజదేవుడెవరో నిరూపించి, ఆ ప్రవక్తలందరిని కీషోను వాగుదగ్గర వధించి, సర్వోన్నతుని శక్తిని లోకానికి చాటిన వ్యక్తి, నేటి దినాన్న, యెజెబెలుకు భయపడి, తన ప్రాణాన్ని తీసుకోమని దేవుని ప్రార్ధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.  పౌరుషం కలిగిన ప్రవక్త హృదయమంతా, నిరాశతో నిండిపోయిందా? తద్వారా, ఆయన మానసికంగా కృంగిపోయారా? అయితే, గొప్ప విజయం తర్వాత, ఇట్లాంటివి జరగవచ్చు కూడా. కొన్ని పరిస్థితులు ఎట్లాంటివారికైనా భయాన్ని కలిగించవచ్చు. ఆయనేమి మానవాతీతుడు కాదు. ఆయన కూడా మనవంటి స్వభావ...

- కుటుంబ ప్రార్ధన..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR  - కుటుంబ ప్రార్ధన.. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఎందుకు వేసుకుంటాము? ఒక కంచెలాగా, భద్రత కొరకే కదా? ఇంటికి భద్రత వున్నది. మరి ఇంటిలో ఉన్న మనుషులకు భద్రత ఎట్లా? అది కుటుంబ ప్రార్ధన ద్వారానే సాధ్యం. మన కుటుంబాలలో, దేవునితో సాన్నిహిత్యం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచగలిగేది ఏదైనా ఉందంటే, అది “కుటుంబ ప్రార్ధనే” క్రైస్తవ కుటుంబములో, కుటుంబ ప్రార్ధన అత్యంత ప్రాధాన్యమైనది. లేకుంటే, పైకప్పు లేకుండా, నాలుగు గోడల మధ్య నివాసం చేసే గృహము ఏ రీతిగా భద్రతలేకుండా ఉంటుందో, అదేరీతిగా కుటుంబ ప్రార్థనలేని గృహాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు అదే రీతిగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని మనస్పర్థలు రావడం సహజమే. అయితే, కుటుంబ ప్రార్ధన కలిగిన కుటుంబాలలో ఇవి కొనసాగలేవు. కలసి  ప్రార్థిస్తే ద్వేషము, కోపము, అనుమానాలు తొలిగిపోయి వాటి స్థానంలో ప్రేమ వచ్చి చేరుతుంది. కలిసి ప్రార్థించకపోతే కలసి ప్రేమగా జీవించలేరు.  ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు  నా నామమున కూడియుందురో  అక్కడ వారి  మధ్యలో నేను వుంటాను అని యేసయ్య చెప్పారు కదా? (మత్తయి ‪18 :20‬ ) మరి ఈ...

- జ్ఞానులవలే నడుచుకొనుడి...

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - జ్ఞానులవలే నడుచుకొనుడి... దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసి 5:15,16 జీవం, మరణం మన స్వాధీనంలో లేనప్పటికీ, గతించిన కాలంలో మనిషికివున్న బలాన్ని బట్టి, యవ్వనాన్ని  బట్టి, తన ప్రాణానికి కొంత భరోసా వున్నట్లుగా అనిపించేది. అయితే, నేటి దినాల్లో పైకి ఎదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, ప్రాణ భయం వెంటాడుతూనే వుంది. ఒకవైపు తెగుళ్లు మనిషిని వెంటాడుతుంటే, మరొక వైపు మనిషే మానవత్వం విడచి, మానభంగాలు, మారణహోమం సృష్టిస్తున్నాడు. ఏదిఏమైనా మన కళ్ళముందున్న పరిస్థితులు, మనము వింటున్న వార్తలను బట్టి, రాబోయే రేపటిదినం కంటే, గడచిన నిన్నటి దినమే మంచిదనిపిస్తుంది. కారణం దినములు చెడ్డవి. అట్లా అని చెడ్డదినాలను దేవుడు నియమించలేదు గాని, మనిషి జీవించే జీవితమే చెడ్డ దినాలకు కారణమవుతుంది. దినాలు చెడ్డవి అవుతున్నాయంటే, దేవుని కృప దూరమవుతుందనేది స్పష్టం. అంటే, కృపాకాలం ముగించబడితే, దేవుని రాకడ  సమీపమనేది మరింత స్పష్టం.  💮  చెడ్డ దినములలో మనమేమి ...

- కాకులు నేర్పించే పాఠం..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - కాకులు నేర్పించే పాఠం.. కాకుల సంగతి విచారించి చూడుడి...-లూకా 12:24 ♻️ కాకులు ఐక్యతకలిగి వుంటాయి: కాకులకు చిన్న ఆహారం కనిపించినా చాలు, వాటి స్వార్ధం కోసం చూచుకోకుండా, కావ్ కావ్... అంటూ మిగిలిన కాకులన్నింటిని పిలుస్తాయి. ఒక కాకికి నష్టం వాటిల్లితే, మిగిలిన కాకులన్నీ వచ్చి చేరుతాయి. మనము ఒక కాకికి హానితలపెట్టినా గాని, కాకులన్నీ గుంపు గూడి మన వెంటబడి తరుముతాయి. కావ్ కావ్ మంటూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి. దీనినిబట్టి మనకు అర్ధమవుతుంది అవెంత ఐక్యంగా వుంటాయో! కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నానని చెప్పుకొనే మనిషి ఎంతటి దయనీయమైన స్థితికి దిగజారిపోయాడంటే? ప్రాణాపాయస్థితిలోనున్న మనిషిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి పేస్ బుక్ లో పోస్ట్ చెయ్యడానికి ఆరాటపడుతున్నాడుగాని, సాటిమనిషిని పట్టించుకొనే స్థితిలో లేడు. చిన్నప్పుడు మనమంతా పాఠ్య పుస్తకాలలో చదివినవాళ్ళమే. చలి చీమలన్నీ కలిస్తే సర్పాన్ని చంపేస్తాయి. గడ్డి పరకలన్నీ కలసి తాడుగా ఏర్పడితే, బలమైన ఏనుగును సహితం బంధించేస్తాయి. ఇట్లా కోకొల్లలు. పరిశుద్ధ గ్రంధములో కూడా ఐక్యతను గూర్చిన అనేకమైన అంశాలున్నాయి. నలుగురు కుష్...