🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏 Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL). స్వంత చిత్తం నెరవేర్చుకొని మాయని మచ్చని తెచ్చుకున్నాడు దేవుని చిత్తము కాకుండా స్వంత ఆలోచన నెరవేర్చుకునే ఇట్లాంటి ప్రార్ధనా ఫలాలు తాత్కాళికమైన మేలులు, శాశ్వతమైన కీడుకు కారణమవుతాయి. ఇటువంటి ప్రార్ధనలు మన జీవితాలకు ఎంత మాత్రమూ క్షేమకరం కాదు. "నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;" ఆది 19: 19-21 లోతు: • నీతిమంతుడు • నీతిమంతుడైన అబ్రాహాము సహవాసాన్ని విడచిపెట్టడం ద్వారా పెద్ద తప్పుచేసాడు. • సొదొమ అందాలను చూసి మోసపోయాడు. ఆ ప్రజల అలవాట్లు, జీవన విధానం తెలిసికూడా వారితోనే జీవించడానికి ఇష్టపడ్డాడు. అబ్రాహాము ప్రార్ధన సొదొమ గొమొర్రా పట్టణాలతోపాటు, లోతు కుటుంబం నాశనం కాకుండా రక్షించ గలిగిన...