నాలుగు గోడల మధ్య జరిగిస్తున్న పాపం ఎవ్వరికీ తెలియదులే అని నీవనుకోవచ్చు

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL)

*నాలుగు గోడల మధ్య జరిగిస్తున్న పాపం ఎవ్వరికీ తెలియదులే అని నీవనుకోవచ్చు*

మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను
నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.
            ఆది  18:20,21

ఇది మనుష్యులు చేసిన ప్రార్ధన కాదు. ఆ మనుష్యులు చేస్తున్న అకృత్యాలు చూడలేక, వీరి పాపాన్ని మేము చూడలేము. వీరిని నాశనం చేసెయ్యి అంటూ సొదొమ గొమొఱ్ఱా పట్టాణాలే దేవునికి చేస్తున్న ప్రార్ధన.

అదేంటి? భూమి ప్రార్ధించడానికి, దానికి నోరుందా? నోరే కాదు. నీ మాటలు వినడానికి చెవులు కూడా వున్నాయి.

ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము.  
                  యెషయా 1:2

Oh my God! అవునా?
ఇంతకీ, సొదొమ గొమొఱ్ఱా పట్టణ  ప్రజలు చేసిన పాపం ఏమిటో?

'హోమో సెక్స్' మగవారు మగవారితో కలసి లైంగిక పాపం చెయ్యడానికి పుట్టినిల్లు ఈ పట్టాణాలే. ఆనాడు అక్కడ పుట్టిన పాపమే, ఈనాడు మహా వృక్షమై విచ్చలవిడిగా ప్రపంచమంతా వ్యాపించింది. నూరంతలుగా ఇంకా వర్ధిల్లుతూనే వుంది.
హోమో సెక్సువాలిటి, లెస్బియన్ (స్త్రీ తో స్త్రీ పాపం) ఈ రెండు భూమికి, దేవునికి ఇష్టం లేనివి.

సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చెయ్యడానికి ఇద్దరు దేవదూతలు ఆ పట్టణములో ప్రవేశించగా, లోతు వారికి ఆతిధ్యమిచ్చుటకు అతని గృహానికి ఆహ్వానించినప్పుడు,

"వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచిఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా"
                ఆది 19:4,5

బాలురు మొదలుకొని వృద్ధుల వరకు, అదే పాపములో కొనసాగుతున్నారట.

అంతే కాదు,
సమృద్ధియైన ఆహారం కలిగి వుండడం వలన, విచ్చలవిడి సుఖానికి అలవాటుపడి, హృదయాలు గర్వించి, దేవుడంటే లెక్కలేకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు.

నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే;
           యెహెజ్కేలు  16:49

ఆ భయంకరమైన పరిస్థితిని చూచి ఆ పట్టణాలు తట్టుకోలేక దేవునికి మొర పెడుతున్నాయి.

ఒక్క విషయం ఆలోచించు! నాలుగు గోడల మధ్య జరిగిస్తున్న పాపం ఎవ్వరికీ తెలియదులే అని నీవనుకోవచ్చు. ఆ గోడలే, నిన్ను గూర్చి దేవునికి మొరపెడితే? ఆ పట్టణాల ప్రార్ధన విన్న దేవుడు, ఆ గోడల ప్రార్ధన వినడా? తప్పక వింటాడు. ప్రతిఫలాన్నిస్తాడు.

హేబేలు చంపబడినా, అతని రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. నీ పాదధూళి సహితం మొర పెట్టినా, తప్పక ఆయన వింటాడు.

వద్దు! అట్లాంటి పరిస్థితులు కల్పించవద్దు. మన చుట్టూ నున్న పరిస్థితులు మన మీద నేరస్థాపన చెయ్యకుండా వుండాలి అంటే? మన ప్రతీ కదలిక ఆయనకు తెలుసు అని గుర్తుపెట్టుకొని, మన ప్రతీ కదలికయందు ఆయనను ముందు పెట్టుకొని జీవించగలగాలి.

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచు కుందాం.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Join our Facebook just click here : CHRIST TEMPLE

Comments