విజయం నీ ముందు మోకరిల్లుతుంది

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL)

విజయం నీ ముందు మోకరిల్లుతుంది

అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.

యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.

అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
       1 రాజులు 18:36-38

450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు మొత్తంగా దేవత పక్షాననున్న వాళ్ళు 850 మంది. దేవుని పక్షాన నున్నవాడు ఒకే ఒక్కడు.

850 మంది కలసి ఒకని మీద సవాలు విసరడం గొప్ప విషయమేమీకాదు. కాని ఒకే ఒక్కడు 850 మంది మీద సవాలు విసరడం సామాన్యమైన విషయంకాదు. అందులోనూ, వారెవారంటే? ఆ దేశపురాణి అయిన యెజెబెలు పోషించే ప్రవక్తలు.

యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. కర్మెలు పర్వతం దానికి ప్రత్యక్ష సాక్షి అయ్యింది.

మొదటి అవకాశాన్ని వారికే ఇచ్చాడు ఏలియా. వారు ఒక ఎద్దును తీసుకొని వధించి, బలిపీఠం మీద పెట్టి, అగ్ని కొరకు వారి దేవతను ప్రార్ధించడం మొదలు పెట్టారు.

మధ్యాహ్నము కాగా ఏలీయా వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా
వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి.
    1 రాజులు 18:27,28

కాని,ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యం.

ఇప్పుడు ఏలియా వంతు. ఎద్దును తీసుకొని వధించి, బలిపీఠం మీద పెట్టాడు. అంతేకాదు నీటితో కందకం అంచులమట్టుకు నింపాడు. అగ్ని కోసం యెహోవా దేవుని నామము పేరట ప్రార్ధించడం మొదలు పెట్టాడు.

ఏలియా ఇంకా ప్రార్ధన ముగించక ముందే, ప్రార్ధించు చుండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసింది. ఎవరి దేవుడు నిజమైన దేవుడో? ఎవరు నిజమైన దేవుని సేవకులో తేలిపోయింది.

ప్రజలందరును  దానిచూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు,యెహోవాయే దేవుడు అని కేకలువేసారు.

బయలు ప్రవక్తలు ఆదినాన్న కీషోను వాగు దగ్గర వధించబడ్డారు.

నీవు ఒంటరివి అయినా, నీ శత్రువులు లెక్కకు మించినవారైనా, దేవుని కోసం నిలబడగలిగి, ప్రార్ధనా ఆయుధం ఎక్కుపెడితే? సమస్య ఏదయినా కావొచ్చు. అది ఎంతయినా కావొచ్చు. విజయం నీ ముందు మోకరిల్లుతుంది.

ఏలియా వంటి పరిశుద్ధత, నీతి, పౌరుషం కలిగి మన శత్రువైన సాతానుతో పోరాడుదాం!
విజయం సాధిద్దాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Join our Facebook just click

Comments

Popular posts from this blog

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

దావీదు దేవుని హృదయానుసారుడు..కానీ..

ప్రార్థన మందిరం