Posts

వారి కడుపే వారి దేవుడు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - వారి కడుపే వారి దేవుడు.. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు. ఫిలిప్పీయులకు 3: 19 వారి కడుపే – ఈ మాటకు బహుశా శరీర స్వభావం అని, లేదా ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధం అయిన శరీర సంబంధమైన జీవిత విధానమంతా అని అర్థం కావచ్చు. కొందరు యేసు “దేవుణ్ణి” పూజిస్తారు, దేవునికి లోబడతారు. మరియు బ్రతకడం కోసం అబద్ధాలు, మోసం, దొంగతనానికి కూడా ఒడిగడతారు. తాము క్రీస్తును అనుసరించేవారమని చెప్పుకుంటారు గానీ వేశదారులు తమ స్వంత కోరికలను అనుసరిస్తూ ఉంటారు. ఇలా వుండడం వలన దేవుడు చింతిస్తాడు..జాగ్రత్త.. ఒక ఎడారిలో ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు.వారు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోగా చాలా ఆకలితో,దాహంతో ఉన్నవారికి మార్గమధ్యంలో ఎక్కడా ఎటువంటి ఆహారం దొరకలేదు. కొంత దూరంలో ఒక మసీదు కనపడింది. అక్కడ చాలామంది ముస్లీములు విందు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు స్నేహితులు క్రైస్తవులు.అందులో ఒకడు మైఖేల్,ఇంకొకరు జాన్. మైఖేల్ తన స్నేహితునితో “జాన్ మనం చనిపోకుండా బ్రతికి ఉండాలంటే ఆ మ...

నిన్ను నీవు తగ్గించుకో..!

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - నిన్ను నీవు తగ్గించుకో..! _ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. - యాకోబు 4:10_         ఈ మాటలు వ్రాస్తున్నది ఎవరంటే, యేసు ప్రభువు సహోదరుడు. అయితే ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే. యేసు ప్రభువు దాసుడను అని తనను తనను పరిచయం చేసుకున్నారు.  ▫️  *క్రీస్తు యొక్క తగ్గింపు*             ఫిలిప్పీ 2:5-8 🔸దేవుని స్వరూపము కలిగినవాడైయుండి,  🔸దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు  🔸మనుష్యుల పోలికగా పుట్టి,  🔸దాసుని స్వరూపమును ధరించుకొని,  🔸తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 🔸సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై,  🔸తన్నుతాను తగ్గించుకొనెను.              ఫిలిప్పీయులకు 2:5-8 దేవుడే దాసునిగా మారడం అంటే? ఇక తగ్గింపుకు ఇంతకు మించిన మాదిరి ఎవరు?  ▫️ *ధూళియు, బూడిదైయునైన నేను*           — అబ్రాహాము (ఆది 18:27 ) 🔸 యేసు క్రీస్తు శరీర ధారిగా ఈ లోకానికి ర...

రేయి మొదటి జామున ప్రార్ధనా సమయం

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - రేయి మొదటి జామున ప్రార్ధనా సమయం _నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము.. - విలాపవాక్యములు 2: 19_ ప్రియమైన దేవుని బిడ్డలారా వందనములు. దేవుని బలమైన సన్నిధి మీ ఇంట్లో ఎప్పుడు సంచరిస్తూ వుంటుంది తెలుసా ? దేవుని దూతలు ఎప్పుడు మీ ఇంట్లోకి దిగి వస్తున్నారో తెలుసా ? కరెక్ట్ ప్రేయర్ టైమ్ ఎప్పుడో తెలుసా ? రేయి మొదటి జాము. నీవు తెల్లవారు జామున 3గం.ల నుండి 5 గం.ల లోపు మోకారించి ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చూడగలవు.  ఆ సమయం ఈ భూమి మీద సేవలో చరిత్ర తిరగరాసిన గొప్ప గొప్ప సేవకుల ప్రార్థనా సమయం.  ఈ లోకంలో పెద్ద పెద్ద కోటీశ్వరులు లేచి పనులు ప్రారంభించే సమయం. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో జీవితం అంతా అతలాకుతలం అయ్యి చచ్చిపోవలని అనుకొని చిట్ట చివరకు వేకువ జామున లేచి ప్రార్థన చేయడం ద్వారా దేశంలోనే మేధావులుగా కొనియాడబడిన సందర్బాలు అనేకం. అలాంటి శక్తివంతమైన ప్రార్థనా సమయం ఎలాంటిదో ధ్యానం చేద్దాం... 🔸దేవుని సహాయమును ...

మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు.

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మిక్కిలి జ్ఞానము కలిగిన నాలుగు చిన్న జీవులు. 👉 _సామెతలు 30:24-28_ *1.చీమలు..*  దూరదృష్టి బలము లేని జీవులు అవి ఆహారము సంపాదించుకొనుటకు సరియైన సమయం ముందుగా ఎంచుకొనును. సామెతలు 6: 6-8. సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ముందుచూపు అనేది తెలివైన లక్షణము.  యేసు ప్రభువు గోపురము కట్టగోరిన వ్యక్తి, యుద్ధమునకు పోవు రాజు ముందుగా ఆలోచించుకొనుటను గూర్చి చెప్పెను.(లూకా 14:28-32) అన్యాయస్తుడైన గృహనిర్వాహకుడు ఉపమానము కూడా ఇదే సూత్రం నేర్పించును.(లూకా 16:1-8) పేతురు తన రెండవ పత్రికలో దేవుని వాగ్దానాలు నమ్మి ఆత్మీయజీవితమునకు కావలసిన వాటిని అమర్చుకొనలేనివారు దూరదృష్టి లేనివారని వ్రాసెను. (2పేతురు 1:9) *2.చిన్న కుందేళ్లు...* భద్రత. సామెతలు 30: 26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. కీర్తనలు 104: 18 గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు క...

నీ అందమే నీ అతిశయమా..?

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - నీ అందమే నీ అతిశయమా..? దేవుడు సృష్టించిన సృష్టి మహోన్నతమైనది, అత్యంత సుందరమైనది. ఆ సృష్టిలో స్త్రీ అందమైనది. అయితే, తన అందాన్ని ఇంకా యినుమడింప జేసుకోవడానికి తాను పడని తిప్పలంటూ ఏమి లేవేమో? చెప్పుకొంటూపోతే దానికి అంతమంటూ వుండదేమో? పరిశుద్ధ గ్రంథములో కూడా కొందరి స్త్రీల అందమును గూర్చి ప్రస్తావించబడింది. కానీ వారి అందమునుబట్టి కొనియాడబడిన స్త్రీ ఒక్కరూ లేరు సరికదా. అందము మోసము, అది వ్యర్థమని పరిశుద్ధ గ్రంధం ప్రభోధిస్తుంది.  *శారీరిక అందము*  👉 శారాయి చక్కనిది (ఆది 12:11) 👉 రిబ్కా మిక్కిలి చక్కనిది (ఆది 24:16) 👉 రాహేలు రూపవతి, సుందరి (ఆది 29:17) 👉 అబీగయీలు రూపసి (1 సమూ 25:3) 👉 బత్షెబ బహు సౌందర్యవతి (2 సమూ 11:3) 👉 వష్తి సౌందర్యవతి ( ఎస్తేరు 1:11 ) 👉 ఎస్తేరు,  అందమైన రూపము, సుందర ముఖమును గలది (ఎస్తేరు 2:7) 👉 యెమీమా, కెజీయా, కెరెంహప్పుకు (యోబు కుమార్తెలు) ఊజు దేశమంతటిలో సౌందర్యవతులు. ( యోబు 42:15) *🤞అందము వ్యర్ధము:* అందము మోసకరము. అది నిన్ను కొన్నిసార్లు శోధనకు గురిచెయ్యవచ్చు. అట్లా అని శోధించబడటం పాపం కాదు. శోధనలో పడడమే పాపం. అంద...

నా గొర్రెలు నా మాట వినును..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - నా గొర్రెలు నా మాట వినును..   ప్రియమైన క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులారా..మీ సేవకున్ని అయిన నా స్వరము మీకు వినబడుతోందా ? పరీక్ష చేసుకోండి.. 👉 నీ కాపరి స్వరాన్ని వినగలుగుతున్నావా ? 👉 ఆ స్వరానికి లోబడగలుగుతున్నావా ?  👉 నీ కాపరిని వెంబడించగలుగుతున్నావా ? _నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. - యోహాను 10:27_ *నీవు గొర్రెవు అయితే ?* ▫️నీముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య వుండాలి. ▫️నీ కాపరి (పాస్టర్) అడుగుజాడల్లో నడవాలి. ▫️ఆయన స్వరం వినాలి. ▫️గొర్రెలకు గాయపరచే అవయవాలు( కొమ్ములు) లేవు. అట్లాంటి సాదు స్వభావం నీకుండాలి. ( సేవకుని మీద కూడా తిరగబడి మాట్లాడుతూ , సంఘం కు రాకుండా నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావంటే నీకు కొమ్ములు వున్నాయని అర్థం) ▫️ నీ మాటలు గాని, నీ క్రియలుగాని ఎవ్వరిని గాయపరచే విధంగా ఉండకూడదు. ▫️వాటి సంఖ్యా బలం వాటిని రక్షించ లేదు. ఒక్క  గొర్రెవున్నా, లక్ష గొర్రెలు కలసి వున్నా తోడేలు సులభంగా వాటిని ఎత్తుకొని పోగలదు. నీవెనుకనున్నవారు, నీ ఆస్తులు, నీ ధనము నీ బలం కాకూడదు. యేసయ్య నీ బల...

సేవకులకు సలహా -

Image
- సేవకులకు  సలహా -  సేవకులకు  సలహా -   👉 *1. బ్రతుకు భారమై సేవకు రాకు,  ఆత్మల భార మెక్కువై సేవకు రా* 👉 *2. నీ ఆకలి తీర్చుకొనుటకు సేవకు రాకు,  అనేకుల ఆత్మీయ ఆకలి తీర్చుటకు సేవకు రా* 👉 *3.సంఘ రాబడి కోసం సేవకు రాకు,  సంఘములో అనేకులను చేర్చడం కోసం సేవకు రా* 👉 *4. ఆధిక్యతల కోసం సేవకు రాకు,  అణుకువ కలిగియుండుటకు సేవకు రా* 👉 *5. ప్రతి అవసరత కోసం ప్రజల వైపు చూచుటకు సేవకు రాకు, ప్రభువు వైపు చూచుటకు సేవకు రా* 👉 *6. ప్రజల మీద నమ్మకంతో సేవకు రాకు, ప్రభువు మీద నమ్మకముతో సేవకు రా* 👉 *7. నీ వృద్ధాప్యపు ప్రారంభములో సేవకు రాకు, యౌవన కాలం ప్రారంభములో సేవకు రా* 👉 *8. సంఘములో లేఖన సత్యాలను నేర్చుకోకుండా సేవకు రాకు, లేఖన సత్యాలను నేర్చుకొని సేవకు రా* 👉 *9. ప్రభువు పిలుపు లేకుండా సంఘ సాక్షము లేకుండా సేవకు రాకు,  ప్రభువు పిలుపు సంఘ సాక్ష్యము కలిగి సేవకు రా* 👉 *10. నీ పేరు కోసం సేవకు రాకు,  ప్రభువు పేరు మహిమ పరచడం కోసం రా* ✅ _అప్పుడు ప్రభువు నిన్ను సేవలో వాడుకుంటాడు.. తద్వార దేవునికి మహిమ కలుగుతుంది!_ 👉 *అనేక విషయములలో మన మందరము తప్పిపోవు...