✝️ CHRIST TEMPLE-PRODDATUR
- రేయి మొదటి జామున ప్రార్ధనా సమయం
_నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము.. - విలాపవాక్యములు 2: 19_
ప్రియమైన దేవుని బిడ్డలారా వందనములు. దేవుని బలమైన సన్నిధి మీ ఇంట్లో ఎప్పుడు సంచరిస్తూ వుంటుంది తెలుసా ? దేవుని దూతలు ఎప్పుడు మీ ఇంట్లోకి దిగి వస్తున్నారో తెలుసా ? కరెక్ట్ ప్రేయర్ టైమ్ ఎప్పుడో తెలుసా ? రేయి మొదటి జాము. నీవు తెల్లవారు జామున 3గం.ల నుండి 5 గం.ల లోపు మోకారించి ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చూడగలవు.
ఆ సమయం ఈ భూమి మీద సేవలో చరిత్ర తిరగరాసిన గొప్ప గొప్ప సేవకుల ప్రార్థనా సమయం.
ఈ లోకంలో పెద్ద పెద్ద కోటీశ్వరులు లేచి పనులు ప్రారంభించే సమయం.
ఎంతోమంది ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో జీవితం అంతా అతలాకుతలం అయ్యి చచ్చిపోవలని అనుకొని చిట్ట చివరకు వేకువ జామున లేచి ప్రార్థన చేయడం ద్వారా దేశంలోనే మేధావులుగా కొనియాడబడిన సందర్బాలు అనేకం.
అలాంటి శక్తివంతమైన ప్రార్థనా సమయం ఎలాంటిదో ధ్యానం చేద్దాం...
🔸దేవుని సహాయమును అభ్యర్దించే సమయం.
🔸దేవునితో సంభాషించే సమయం.
🔸మనము మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే సమయం.
🔸దేవుని కృపను బట్టి ఆయనను స్తుతించే సమయం.
🔸ఆయన ఏమైయున్నాడో? గుర్తెరిగి ఆరాధించే సమయం.
🔸మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయం.
🔸దేవుని మార్గ దర్శత్వం కోసం ఎదురు చూచే సమయం.
🔸మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగే సమయం.
🔸మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం.
🔸ఇతరుల అక్కరుల నిమిత్తం విజ్ఞాపన చేసే సమయం.
🔸దేవునితో నిబంధన చేసే సమయం.
🔸దేవుని చిత్తం కోసం ఎదురు చూచే సమయం.
🔸దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం.
🔸సాతాను వాడిగల బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందే సమయం.
♻️ *ప్రార్ధన ఎంత శక్తివంతమైనదంటే?*
🔸పరలోక సింహాసన గదిని చేరుకొనేశక్తి.
🔸సాతానును ఎదిరించి ఓడించేశక్తి
🔸దేవదూతల సహాయాన్ని పొందేశక్తి.
♻️ *ప్రార్ధనా విజయాలు:*
🔹ప్రార్ధన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది.
🔹జ్ఞానమునిచ్చి, దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని నెలకొల్పుతుంది.
🔹పాపపు బంధకాలనుండి విడిపిస్తుంది.
🔹శత్రువులను సహితం మిత్రులునుగా చేస్తుంది.
🔹బలహీనులకు బలాన్నిస్తుంది.
🔹నెమ్మది లేనివారికి, నెమ్మది నిస్తుంది.
🔹కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది.
🔹సింహాల నోళ్లను మూయిస్తుంది.
🔹అగ్ని గుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది.
🔹సృష్టిని సహితం శాశించ గలుగుతుంది.
🔹సంకెళ్లను తెంపేస్తుంది.
🔹చట్టాలను మార్చేస్తుంది.
🔹ప్రశ్నకు సమాధానమవుతుంది.
🔹సమస్యకు పరిష్కారాన్నిస్తుంది.
🔹కన్నీటి ప్రార్ధన కష్టాల కన్నీటిని తుడిచేస్తుంది.
🔹పాపపు గోడలను పగలగొడుతుంది.
🔹పరిశుద్ధత లోనికి నడిపిస్తుంది.
🔹నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
పాపానికి దూరంగా వుంటూ "ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉంటూ " (కొలస్సి 4:2),
యెడతెగక ప్రార్థనచేయుదము(1థెస్స 5:15).
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
Comments