Posts

మీరు దేవుని అద్భుతాలను చూచెదరు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మీరు దేవుని అద్భుతాలను చూచెదరు.. ...నేను జనులకు అద్భుతములను కనుపరతును. మీకా 7:15 నా అమూల్యమైన సంఘమా.. ప్రియమైన స్నేహితులారా, ఈ ఫిబ్రవరి అనే నూతన మాసములో అడుగిడిన మీ జీవితములో దేవుడు మీ పట్ల అద్భుతములను జరిగిస్తాడు. ఆలాగుననే, నేడు ఈ నూతన మాసములో ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు మీతో ఉంటాడు. ఈ రోజు మిమ్మల్ని చూడడం వలన ప్రభువు మీ పట్ల ఆనందించుచున్నాడు మరియు మీ కోసం ఉత్తమమైన వాటిని భద్రపరిచియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా, బైబిల్ నుండి మనం మీకా 7:15వ వచనమును చూచినట్లయితే,  "..నేను జనులకు అద్భుతములను కనుపరతును.''  అవును, దేవుడు పరలోకం నుండి దిగివచ్చి, మిమ్మల్ని ఆనందపరిచే ఆశ్చర్యకరమైన అద్భుతాలను మీ పట్ల కనుపరుస్తాడు. బైబిల్‌లో, ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలలో కొన్నిటిని ఉదాహరణలనుగా మనము చూద్దాం. దేవుని అద్భుతాలు ఎంతో మంది జీవితాలలో ఎలా కనుపరచబడి యున్నవో మనం చూడగలము.  👉 ఫరో నుండి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి విడిపించి సముద్రాన్ని రెండు పాయలుగా చేసి, ఆ మార్గము ద్వారా వారిని నడిపించిన మోషే పట్ల చేసిన అద్భు...

మీ ప్రయత్నాలన్నిటిలో మీరు విజయాన్ని సాధిస్తారు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR  మీ ప్రయత్నాలన్నిటిలో మీరు విజయాన్ని సాధిస్తారు.. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును;...మీ సరిహద్దు వ్యాపించును. ద్వితీయోపదేశకాండము 11:24 నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు సొంతమగునట్లుగా దేవుడు మిమ్మును ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు. అంతమాత్రమే కాదు, ప్రభువైన యేసు యందు మీరు నిరీక్షణతో ఉండండి మరియు ఈరోజు ఆయన మీకు వాగ్దానం చేయుచున్నాడు.  ద్వితీయోపదేశకాండము 11:24వ వచనము. " మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును '' అని చెప్పబడిన ఈ వచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమేమనగా, ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులకు ప్రభువు ద్వారా ఇవ్వబడినది, అక్కడ ఆయన ఇలాగున సెలవిచ్చియున్నాడు,  ' అప్పుడు యెహోవా మీ యెదుట నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.'  కానీ, ఈ వచనము దేశముల కోసం లేదా గొప్ప వ్యక్తుల కోసం పోరాడటానికి మాత్రమే వర్తించదు...

మీరు ఉన్నతస్థలములో నడిచెదరు..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR మీరు ఉన్నతస్థలములో నడిచెదరు.. ఉన్నతస్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను. కీర్తనల గ్రంథము 18:16 నా ప్రియులారా, నేడు ఈ సందేశమును చదువుచున్న మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థలములో నడిపిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:16 వ వచనము తీసుకొనబడినది. " ఉన్నతస్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను"అన్న వాగ్దానము ప్రకారము ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.  ఈ రోజు మీరు *లోతైన నీటిలో మునిగి ఉండవచ్చును*  లేదా *ప్రమాదంలో ఉండవచ్చును* మరియు దానిని ఎవరితో పంచుకోవాలో ఆలోచిస్తూ ఉండవచ్చును. దానిని నుండి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి, *అలసిపోయి ఉండవచ్చును.*   నా ప్రియులారా, నేడు మీరు అనేక చిక్కుల్లో కూరుకుపోయి, ఇంకేముంది నా జీవితం నాశనం అయ్యింది ఇక చావే నాకు గతి అనే దీన స్థితికి దిగజారి ఉండవచ్చును. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చూసి, ఈ వేకువజామున దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన తన ఉన్నతమైన అధికార స్థానం నుండి దిగివచ్చ...

పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు ...అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. - రోమీయులకు 8:26 నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ నూతన మాసమైన జనవరి నెలలో వున్నారు ఒక నెల గడచి త్వరలో ఫిబ్రవరి నెలలో ప్రవేశిస్తాము. మీ బలహీనతలలో దేవుడు మీకు సహాయపడాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే, బైబిల్‌లో ‘‘...అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ’’ అని రోమీయులకు 8:26 ప్రకారం ప్రభువు మీకు వాగ్దానం చేయుచున్నాడు.  నేడు మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మీరు దీనిని అనుభవించి ఉండవచ్చని నేను నిశ్చయంగా తలంచుచున్నాను.  మనం ఏదో ఒక పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు, మనం ఏమి చేయాలో మరియు దానిని ఎలా అధిగమించాలో చెప్పుచున్న స్వరం మనలో పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉంటాము.  ఈ రోజు ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీకు ఇంతటి గొప్ప నిరీక్షణను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేనిని గురించి చింతించకండి. మీ కన్నీళ్లు దేవుడు చూసాడు. అవును, నా ప్రియులారా, ప్రభువు ఎల్లప్పుడు మీతో ఉంటానని సెలవిచ్చుచున్నాడు; ...

మీ ప్రార్థన పరిమళ ధూపముగా..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - మీ ప్రార్థన పరిమళ ధూపముగా.. ...పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను... యెహెజ్కేలు 20:41 నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించుచున్నాడు. అందుకే నేడు బైబిల్ నుండి ఈ రోజు వాగ్దానంగా మనం  యెహెజ్కేలు 20:41వ వచనమును ధ్యానముగా తీసుకొనబడియున్నాము. ఆ వచనమేమనగా, " జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనుల యెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును ''  అని చెప్పబడిన వాగ్దాన వచనాన్ని ధ్యానించబోవుచున్నాము. అవును నా స్నేహితులారా, ఆలాగుననే మీరు దేవునికి అటువంటి పరిమళ ధూపంగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు ప్రభువునందు ఎల్లప్పుడు ఆనందించండి. అయితే దీని అర్థం ఏమిటి? బైబిల్‌లో, లూకా 18:9-14 వ వచనములలో చూచినట్లయితే, యేసు తన శిష్యులకు ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన...

ఐశ్వర్యం కలిగించే 10% సీక్రెట్..

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR ఐశ్వర్యం కలిగించే 10% సీక్రెట్.. *సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.* అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దేవుని నుండి మనం నేర్చుకునే ఆర్థిక రహస్యం. మనకు ఎంత ఇచ్చే గుణం ఉంటుందో అంతగా మనం అభివృద్ధి పొందుతాము. ఎంత దాచుకుందాం అని చూస్తే అంత నష్టపోతాము. ఇది దేవుని నుండి సంపద-నిర్మాణ రహస్యం. శ్రేష్ఠమైన లేదా ధర్మబద్ధమైన కారణాల కోసం డబ్బును గనుక వెచ్చిస్తే అది ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది, అయితే దేవునికి ఇచ్చేదానిలో మాత్రం ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఇక్కడ సలహా ఏమింటంటే, డబ్బును పెట్టుబడి పెట్టవద్దు, ఇవ్వడం నేర్చుకోవాలి. పది నుండి ఒకటి తీసేస్తే తొమ్మిదని మనందరికీ  తెలుసు, అయితే అదే పది నుండి ఒకటి తీస్తే దేవుని లెక్క ప్రకారం నూరంతల ఆశీర్వాదం పొందగలం. 👉 అబ్రహాము, ఒక గొప్ప విజయం తర్వాత యాజకునికి ప్రతిదానిలో *పదోవంతు* ఇచ్చాడు. అతను చాలా ధనవంతుడు, ఇంటి నుండి ఆరు వందల మైళ్ళ దూరం, వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా, ఎవరి...

ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పోతే..!

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పోతే..! - మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. ఫిలిప్పీయులకు 1:4 మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును. ఈ మాటను మీరు నమ్ముతున్నారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం. దేవుడు నాకేమి చేయలేదు, దేవుని వల్ల నాకేమి లాభం లేదు, అసలు దేవుడే ఉంటె నాకు ఎందుకు ఇలా జరిగేది అని ఆలోచించే వారిలో మనం కూడా ఉన్నాం. ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అయితే బాగుండు అనే ఆలోచన ఎవరికీ ఉండదు చెప్పండి ? అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి; ఎప్పుడైతే ఆయనకు మనం విధేయత చూపిస్తామో అప్పుడే అవన్నీ సాధ్యం. తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు వేసుకోవడం కంటే, ఆ సమస్య నుండి దేవుడు ఎలా తప్పిస్తాడో ఓపికతో వేచి చూస్తె ఆ అనుభవం లో ఉన్న సంతృప్తి మరోలా ఉంటుంది. అలాంటప్పుడే మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు బలపడుతాయి; ప్రత్యేకంగా దేవునిపై మన విశ్వాసం రెట్టింపవుతుంది, మన వ్యక్త...