Posts

దేవుని మాటే - బైబిల్ వాక్యము

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - దేవుని మాటే - బైబిల్ వాక్యము. దేవుని వాక్యము సజీవమైనది. అది నిత్యమూ నిలచియుండును. ఆకాశమును, భూమియు గతించును గానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసు క్రీస్తు మత్తయి 24:35 లో అన్నారు. 2 తిమోతి 3:16,17 లో దేవుని వాక్యము గురించి ఇలా వ్రాసి ఉంది. 2 తిమోతి 3:16,17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,  17ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. దేవుని వాక్యము దైవావేశము వలన కలిగినది. ఈ వాక్యము విన్నప్పుడు లేదా ధ్యానించినపుడు దేవుడు మనతో మాట్లాడతారు. మనకు వాక్యము ద్వారా దేవుడు ఉపదేశిస్తారు, మనల్ని ఖండిస్తారు, మన తప్పులు దిద్దుతారు. ఈ వాక్యము మన హృదయములో ఉన్న ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది. హెబ్రీయులకు  4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను  విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని ...

ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు...

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR - ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు...  *యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.* - కీర్తనలు 40:1 👉మన జీవితాల్లో ప్రార్ధనలకు  ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం అంటే, *ప్రధాన కారణం కనిపెట్టలేక పోవడం. సహనం లేకపోవడం.*  *రాత్రి ప్రార్ధిస్తే ఉదయానికి అది జరిగిపోవాలి.*  👉కాస్త ఆలస్యం అయితే సహనం కోల్పోయి, విసిగిపోయి, ప్రార్ధించడమే మానేస్తాం.  ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు. అనే విషయాన్ని మరచిపోతాం.  *ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి వుంటుంది అనే విషయాన్ని గుర్తించలేం.*  *అనేక సందర్భాలలో దేవుడు మన ప్రార్ధనలకు సమాధానాన్ని సిద్దపరుస్తాడు.*   *ఇక అది మన చేతికి వచ్చే సమయానికి సహనం కోల్పోయి, కనిపెట్టలేక ప్రార్ధించడం మానేస్తాం.*   ఆ ఆశీర్వాదాలు మన కండ్లముందే నిలిచిపోతాయి గాని, మన చేతికి దక్కవు.  ఆయన తగిన సమయమందు నీ ప్రార్ధన ఆలకించి ప్రతిఫలమిస్తాడు.  అయితే,  *ఆ క్షణం కోసం సహనంతో కనిపెట్టుకొని వుండాలి.*  *దానికి ఎంత కాలం పట్టొచ్చ...

🇮🇳 క్రైస్తవ స్వాతంత్య్రము

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR 🇮🇳 క్రైస్తవ స్వాతంత్య్రము - ప్రియ మిత్రులందరికి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. _(యోహాను 8:31,32 లో ఇలా చెపుతుంది. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో- మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును *స్వతంత్రులుగా* చేయునని చెప్పగా...)_ *ఉపోద్ఘాతం:* ప్రతి ఆగష్టు 15న మనదేశం స్వాతంత్య్ర దినోత్సవమును జరుపుకుంటుంది. మన దేశానికి స్వాతంత్య్రము వచ్చి చాలా సంవత్సరములు అయ్యింది. రాజకీయ స్వేచ్ఛ వచ్చి మన దేశము స్వయం పరిపాలన చేసుకొనుచున్నను సగటు మనిషికి నిజ జీవితములో స్వేచ్ఛలేదు. అపవాది అదృశ్య శక్తులు, మూఢ నమ్మకాలు, దుర్నీతి, అవినీతి, లంచగొండితనము మొదలగు సాతాను దుష్ట ప్రభావములకు లోనై మనుష్యులు స్వేచ్ఛగాను, నిర్భయముగాను జీవించలేక పోతున్నారు. చివరకు క్రైస్తవులు కూడా ఏదో బంధకాల్లో నలిగిపోతున్నారు. ఆత్మలో స్వేచ్ఛ లేక నశించిపోతున్నారు. దేవుని వాక్యము యోహాను 8:31,32 లో ఇలా చెపుతుంది. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో- మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదర...

పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు.

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR -పొట్టి జక్కయ్య – ఏడవ భాగం - అబ్రహాము కుమారుడు. (గమనిక: బైబిల్ గ్రంధం ఆత్మీయ మర్మాల నిలయం. రోజూ చదువుతున్న.. ప్రతీరోజూ రోజుకో కోణంలో దేవుడు మాట్లాడుతారు. ఈ భాగం ద్వారా నాకు అర్ధమైంది మాత్రం నేను వ్రాస్తున్నాను. మరొకరికి దేవుడు మరో విధంగా మాట్లాడి ఉండొచ్చు!!) అందుకు యేసు: ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. లూకా 19:9. మనం ఇంతవరకు జక్కయ్య పాపపు పట్టణమైన యెరికోవాసి అని, సుంకపుగుత్తదారుడని, ధనవంతుడు గాని యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు గాని పొట్టివాడైనందున, జనులు గుంపుకూడి ఉన్నందున చూడలేక మేడిచెట్టు ఎక్కి కూర్చొంటే యేసుప్రభులవారు ఆ చెట్టు దగ్గరికే వచ్చి జక్కయ్యని పిలిచారు. అప్పుడు జక్కయ్య తనగృహములోనికి యేసయ్యని సంతోషముతో ఆహ్వానించినట్లు ధ్యానించాము. అయితే ఇక్కడ ఎప్పుడైతే తన ఆస్తిలో సగం బీదలకిచ్చాడో, తను అన్యాయం చేసినవారికి న్యాయం చేసాడో, యేసుప్రభులవారు తన నోటితో ప్రాముఖ్యమైన మాట అంటున్నారు: ఇతడును అబ్రహాము కుమారుడే! ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. అంటే ఎవరైతే మార్పునొంది రక్షింపబడతారో వారందరూ అబ్రహాము సంతానమన్న మ...

పొట్టి జక్కయ్య – ఆరవ భాగం - యేసయ్యను హృదయంలోను, గృహములోను చేర్చుకొనెను.

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR -పొట్టి జక్కయ్య – ఆరవ భాగం - యేసయ్యను హృదయంలోను, గృహములోను చేర్చుకొనెను. యేసు ఆచోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా! త్వరగా దిగుము! -  నేడు నేను నీ ఇంట ఉండవలసియున్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.  - లూకా 19:4-5. ఇక్కడ జక్కయ్య-యేసయ్య చేసిన పనులు వరుసగా చూద్దాం! మొదటగా యేసయ్య కన్నులెత్తి జక్కయ్యని చూసారు! ఆయన కన్నులకు మరుగైనదేది లేదు. చెట్టుమీద నున్న జక్కయ్యని యేసయ్య చూసారు. నీవు ఏ స్తితిలోనున్న యేసయ్య నిన్ను చూస్తున్నారని గ్రహించు! మరో విషయం ఏమిటంటే జక్కయ్య ఎక్కినది మేడిచెట్టు! మేడిచెట్టు గర్వానికి ప్రతీక అని పండితులు చెబుతారు! మేడిచెట్టు చూడు మేలిమై యుండు- పొట్ట విప్పి చూడు పురుగులుండు అని మన వేమన కవి చెప్పాడు. (అయితే మేడిచెట్టు అని తర్జుమా చేయబడినా మనలాంటి మేడిచేట్లులేవంట ఇజ్రాయిల్దేశంలో. ఒకరకమైన ఫిగ్ ట్రీ/ అత్తిపండు లాగ ఉంటాయంట) ఏదీఏమైనా ఎంతగర్వం ఉన్నా, యేసయ్య పిలిచిన వెంటనే దిగిపోయాడు! తన ధన గర్వాన్ని, హోదా-అంతస్తు గర్వాన్ని విడచి వెంటనే దిగిపోయాడు. ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం వ్రాయబడింది....

పొట్టి జక్కయ్య – ఐదవ భాగం - పొట్టివాడు

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR -పొట్టి జక్కయ్య – ఐదవ భాగం - పొట్టివాడు ప్రియ దైవజనమా! జక్కయ్యకున్న ఐదవ గుణగణం పొట్టివాడు. “ యేసు ఎవరో చూడగోరెను గాని, 1) పొట్టివాడైనందున, 2) జనులు గుంపుకూడినందున చూడలేకపోయెను. లూకా 19:3. జక్కయ్య యేసయ్యను చూడాలని ఎంత తహతహలాడాడో గతభాగంలో చూసాము. అయితే పొట్టివాడైనందున, ప్రజలు గుంపుగా ఉన్నందున చూడలేక, మేడిచెట్టు ఎక్కినట్లు చూస్తున్నాం. పొట్టితనం అంటే ఆదేశ ప్రజల సామాన్య ఎదుగుదల కంటే తక్కువగా ఎదగడం. పొట్టితనం తల్లిదండ్రుల జీన్స్ వలన గాని, హార్మోన్ల లోపం వలన గాని లేక ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగినా గాని పొట్టితనం వస్తుంది. మరి జక్కయ్య ఎందువలన పొట్టిగా ఉన్నాడో మనకు తెలియదు! అయితే గమనించవలసినదేమిటంటే పొట్టితనం , యేసయ్యని చూడాలనే అతని ఆకాంక్షను ఆపలేకపోయింది. ఒక మేడిచెట్టు ఎక్కి కూర్చొన్నాడు. యేసయ్య ఆ దారిలో వస్తారు, నేను చూస్తాను అని. ఎన్నిసార్లు చెట్టు ఎక్కలేక క్రింద పడిపోయాడో తెలియదు. అయినా ప్రయత్నం ఆపలేదు! చివరకు సాధించాడు. చెట్టు ఎక్కాడు! ఇప్పుడు ప్రజలందరికన్నా ఎత్తులో ఉండి చూస్తున్నాడు! ఇదంతా ఎరిగిన యేసయ్య అదే చెట్టు క్రిందకు వచ్చి పిలుస్తున్నారు – జక...

పొట్టి జక్కయ్య – నాల్గవ భాగం - యేసు ఎవరో చూడగోరెను

Image
✝️ CHRIST TEMPLE-PRODDATUR -పొట్టి జక్కయ్య – నాల్గవ భాగం - యేసు ఎవరో చూడగోరెను “యేసు ఎవరో చూడగోరెను, గాని పొట్టివాడైనందున, జనులు గుంపు కూడియుండుట వలన చూడలేకపోయెను” లూకా 19:3 ప్రియ సహోదరీ/సహోదరులారా! మనం ఇంతవరకూ జక్కయ్య యెరికో పట్టణవాసి అని, సుంకపు గుత్తదారుడని, ధనవంతుడని చూసుకొన్నాము. పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్నా, సుంకపు గుత్తదారుడిగా అన్యాయంగా జీవిస్తున్నా, ధనవంతుడిగా అహంకారిగా ఉన్నా సరే, తను చేస్తున్న అన్యాయాలు, పాపాలను తన అంతరాత్మ గద్ధిస్తున్నా, మొండిగా బ్రతికేస్తున్నాడు. ఈ స్తితిలో యేసుప్రభువు మాట విన్నాడు, చూడాలని ఆశపడ్డాడు. “ఆశగల ప్రాణమును దేవుడు తృప్తి పరచును”. ఇది నిజంగా జక్కయ్య జీవితంలో నెరవేరింది! తన జీవితంలో ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా సరే తన జీవితంలో తృప్తిలేదు! శాంతి లేదు! యేసయ్య చేసే అద్భుతాలు, ఆయన సామాన్య జనాంగంతో కలసిపోయే విధానానికి ముచ్చట పడి, యేసయ్యని చూడాలని తపన చెందాడు! ఇలాంటి స్తితిలో ఉన్న జక్కయ్యని దర్శించడానికి దేవాదిదేవుడే దిగివచ్చి, పాపపు పట్టణంలో పాపిగా జీవిస్తున్న జక్కయ్యని కలవడానికి వచ్చారు! (4-6 వచనాలు) యేసయ్య ఆ పట్టణం వస్తున్నారని తెలిసి, ...