ఒక్కసారి యేసయ్య ప్రేమ రుచి చూడు
ఒక్కసారి యేసయ్య ప్రేమ రుచి చూడు CHRIST TEMPLE - PRODDATUR Telugu Bible sermons by pastor nakkolla Balasubramanyam Daniel "ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవను కొనుచున్నవా?" (మత్తయి 26:53). గెత్సమనేలో యేసు మూడవసారి ప్రార్ధించిన తరువాత, నిద్రించుచున్న శిష్యుల దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, "లెండి, వెళ్ళుదము: ఇదిగో, నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను" (మత్తయి 26:46). తరువాత, అంధకారములో, 300 మందికి పైగా సైనికులు సమీపించారు, "…కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతును వెంట బెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను" (యోహాను 18:3). యూదా వారిని ఇక్కడికి నడిపించాడు ఎందుకంటే "యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళు చుండువాడు గనుక: ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను" (యోహాను 18:2). యూదా యేసును ముద్దుపెట్టుకొని, యేసు ఎవరో సైనికులకు చూపించాడు. అతడు ముద్దు పెట్టి క్రీస్తును అప్ప...