ఒక్కసారి యేసయ్య ప్రేమ రుచి చూడు
CHRIST TEMPLE - PRODDATUR
Telugu Bible sermons by pastor nakkolla Balasubramanyam Daniel
"ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవను కొనుచున్నవా?" (మత్తయి 26:53).
గెత్సమనేలో యేసు మూడవసారి ప్రార్ధించిన తరువాత, నిద్రించుచున్న శిష్యుల దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, "లెండి, వెళ్ళుదము: ఇదిగో, నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను" (మత్తయి 26:46). తరువాత, అంధకారములో, 300 మందికి పైగా సైనికులు సమీపించారు, "…కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతును వెంట బెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను" (యోహాను 18:3).
యూదా వారిని ఇక్కడికి నడిపించాడు ఎందుకంటే "యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళు చుండువాడు గనుక: ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను" (యోహాను 18:2).
యూదా యేసును ముద్దుపెట్టుకొని, యేసు ఎవరో సైనికులకు చూపించాడు. అతడు ముద్దు పెట్టి క్రీస్తును అప్పగించాడు. యేసు సైనికులతో అన్నాడు, "మీరు ఎవరి కొరకు చూచుచున్నారు?" వారన్నారు, "నజరేయుడైన యేసును." యేసు అన్నాడు, "నేనే ఆయనను." వారు అది వినగానే వెనుకకు తగ్గి "నేలమీద పడిరి." ఇది దేవుని కుమారునిగా తన శక్తిని చూపిస్తుంది. యేసు అన్నాడు, "నేనే ఆయనను అని మీతో చెప్పితిని: గనుక మీరు నన్ను వెదుకుచున్న యెడల, వీరిని పోనియ్యడని చెప్పెను" (యోహాను 18:8).
ఆ సమయంలో పేతురు లేచి, కత్తిని దూసి, వెంటనే చర్య మొదలెట్టెను. ప్రధాన యాజకుని దాసుని కొట్టి, అతని కుడి చెవి తెగ నరికెను. యేసు "అతని చెవిని ముట్టి, తనను స్వస్థ పరిచెను" (లూకా 22:51).
తరువాత యేసు పేతురుతో ఇలా మాట్లాడాడు. "యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము: కత్తి పట్టుకొనువారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?" (మత్తయి 26:52-53).
గెత్సమనే తోటలో సైనికులు ఆయనను బంధించినప్పుడు, ఆయన వారితో తన తండ్రియైన దేవునికి లోబడి, నిరాకరించకుండా మౌనముగా వెళ్ళాడు."అతడు దౌర్జన్యము నొందెను, బాధింప బడినను, అతడు నోరు తెరువలేదు: వధకు తెబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు" (యెషయా 53:7).
ఆయన ప్రశస్త తలపై వారు ముళ్ళ కిరీటము పెట్టారు, వారు పరిహసించి, "ఇదిగో రాజు" అన్నారు. వారు ఆయనను కొట్టి ఆయనను శపించారు, ఆయన పరిశుద్ధ నామాన్ని అపహసించారు. ఆయన ఒంటరిగా అంతా భరించాడు. ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు లోకాన్ని నశింప చేయడానికి ఆయనను విడిపించు కోవడానికి. ఆయన పదివేలమంది దూతలను పిలిచి ఉండేవాడు, కాని ఆయన ఒంటరిగా మరణించాడు, నీ కొరకు నా కొరకు. దేవునికి విధేయుడై సిలువపై ఇష్ట పూర్వకంగా, క్రీస్తు ఆవేదన అనుభవించాడు. "ఆయన వధకు తేబడిన గొర్రె పిల్ల వలే ఆయెను" (యెషయా 53:7).
ఆ రోజు రాత్రి "వధకు తేబడిన గొర్రె పిల్ల" వలే క్రీస్తు సైనికులతో వెళ్లి ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో ఆలోచించండి. ఆయన దూతల సమూహాన్ని రప్పించుకొని, సిలువను తప్పించుకొని ఉంటే ఏమై ఉండేది? మీకు నాకు ఏమి జరిగి ఉండేది? సిలువపై మన పాపాల నిమిత్తము వెల చెల్లించడానికి ఎవరు ఉండకుండా ఉండేవారు. మన పాపము నిమిత్తము మనకు బదులుగా, చనిపోవడానికి ఎవరు ఉండేవారు కాదు. నిజంగా అది మనలను భయంకరమైన పరిస్థితిలోనికి నెట్టి ఉండేది. నిత్యత్వములో అంధకారములో మన పాపము నిమిత్తము మనము శిక్షింపబడి ఉండేవారము. "వధకు తెబడు గొర్రె పిల్ల వలే" క్రీస్తు ఆ సైనికులతో వెళ్ళకుండా ఉంటే, మనకు పరిశుద్ధ నీతిమంతుడైన దేవునికి మధ్య మధ్యవర్తి ఉండకపోయేవాడు. దేవునితో మన కొరకు విజ్ఞాపన చేయువారు ఎవరు లేక ఆఖరి తీర్పులో మనము దేవుని ఎదుర్కొనవలసి వచ్చేది, "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు" (I తిమోతి 2:5).
క్రీస్తు బంధింపబడినప్పుడు సైనికులతో సిలువకు వెళ్ళకపోతే, మనకు మధ్యవర్తి ఉండకపోయేవాడు. ఒక వివాదము పరిష్కరించడానికి ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉండడం అన్నమాట. దేవునికి పాపులకు మధ్య సమాధానాన్ని పునరుద్ధరించడానికి యేసు క్రీస్తు మాత్రమే మధ్యవర్తి. దైవ కుమారుడు మాత్రమే తండ్రి దేవుని పాపియైన మానవుని కలుపగలడు. సిలువ వేయబడడానికి యేసు సైనికులతో వెళ్లకపోయి ఉంటే, పరిశుద్ధ దేవునితో మనలను శాంతియుత సంబంధములో కలపడానికి మనకు ఎవరు ఉండేవారు కాదు. ప్రియమైన స్నేహితులారా మీరు క్రీస్తును నమ్ముతారా? ఆయన మీ పాపాల నిమిత్తము ధర చెల్లిస్తాడు. దేవుని దయను పొందేలా, ఆయన మీకు మధ్యవర్తిగా ఉంటాడు. మీకు నిత్య జీవము కలుగుతుంది. మీ పాపములు దేవుని గ్రంథము నుండి తుడిచివేయబడి, క్రీస్తు ప్రశస్త రక్తములో నిత్యత్వములో కడిగి వేయబడతాయి. వనములో ఆ రాత్ర్రి బంధింప బడినప్పుడు యేసు తండ్రి దేవునికి లోబడి ఆయన వారితో పాటు అవమానము, శ్రమ, సిలువకు వెళ్లి ఉండకపోతే, ఆ ప్రశస్త విషయాలు నేను మీకు ఇవ్వగలిగేవాడను కాను. ఆ అపహసించు గుంపుకు ఆయన లొంగిపోయాడు, ఆయన కృప కొరకు మొర పెట్టలేదు. సిలువ అవమానాన్ని ఆయన ఒంటరిగా భరించాడు. "సమాప్తమైనది" అని, ఆయన కేక పెట్టినప్పుడు, ఆయన మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు; రక్షణ అద్భుత ప్రణాళిక పూర్తి చేయబడింది. ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు లోకాన్ని నశింప చేయడానికి ఆయనను విడిపించడానికి. ఆయన పదివేలమంది దూతలను పిలిచి యుండేవాడు, కాని ఆయన ఒంటరిగా మరణించాడు, నీ కొరకు నా కొరకు.
నేను ఇప్పుడు మిమ్మును అడుగుతున్నాను, లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లను మీరు నమ్ముతారా? ఇంతకాలము ఆయనను త్రోసి పుచ్చారు. చాలాసార్లు రక్షకునికి వ్యతిరేకంగా మీ హృదయాలను కఠిన పరచుకున్నారు. ఈ రోజు ఆయనకు లోబడతారా? ఓ, ఆయనను వెక్కిరించిన క్రూర సైనికుల వలే మీరు ఉండవద్దు! ఆయనను తిరస్కరించిన అహంకార కఠిన ప్రధాన యాజకుని వలే గాని, ఆయనను నమ్మకుండా ఆయన ముఖముపై ఉమ్మివేసిన పరిశయ్యల వలే గాని మీరు ఉండకండి! వారి వలే ఉండవద్దని మిమ్ములను బతిమాలుచున్నాను! చాలాకాలము, చాలాకాలముగా వారి వలే మీరు ఉన్నారు! సామాన్య విశ్వాసముతో యేసుకు మీ హృదయాలు ఇవ్వండి. "లోక పాపములను మోసుకొనిపోవు, దేవుని గొర్రె పిల్లను," మీరు విశ్వసిస్తారా? (యోహాను 1:29).
యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైనది ఇప్పుడు తెలిసింది కదా..ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఆయన ప్రేమను పొందుకో.. దేవుడు మిమ్ములను దీవించును గాక.ఆమెన్.
*CHRIST TEMPLE-PDTR*
మీ ప్రార్థనా విన్నపాలు మాకు తెలియచేయండి.
Comments