🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Telugu Bible Sermons by Pastor.N.Daniel Balu.
ప్రార్థన మందిరం
"నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును. యెషయా 56:7"
నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను'' ఆయన తన ప్రార్థనా మందిరములో తృప్తిగా ఉంటానని దేవుడు చెప్పాడు. ప్రార్థన ద్వారా మనుష్యుని తన యెదుట అంగీకృతునిగా చేస్తానని దేవుడు చెప్పాడు. మనం ప్రార్థనకు వెళ్ళినపుడు మన వ్యక్తిత్వమంతటిని దేవుడు చూస్తాడు. మనం దేవుని దగ్గరకు వెళ్ళినపుడు మన వ్యక్తిత్వమంతయు సరియైన క్రమములో నుండాలి. లేనిచో దేవుడు మనతో ఇలాగు చెప్పాడు.
''నీ పెదవుల మీద ప్రార్థన చూస్తున్నాను. కాని నీ కళ్ళలో ప్రార్థన లేదు''
మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రాణమును, మన ఆత్మను పరిశీలిస్తాడు. మనకు బహు మోసకరమైన స్వభావం ఉన్నది. చివరగా మనము ప్రార్థనలో మట్టుకే తృప్తి చెందగలం. అక్కడ నీ వ్యక్తిత్వము పూర్తిగా మార్చబడి పరిపూర్ణముగా చేయబడుతుంది.
''నీతి ననుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండు వారలారా! నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి''.యెషయా 51:1
దేవుడు సెలవిస్తున్నాడు. ''వారి హృదయములో నా ధర్మశాస్త్రము కలిగియున్న ప్రజలు'' దేవుని ధర్మశాస్త్రము ఎంతగా వారిని పట్టుకుంటుందంటే వారి ఉద్దేశ్యములన్నింటిలో వారు దేవునికి ప్రీతికరముగా ఉండగలరు. మనము మన ప్రార్థన సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. కాని మన హృదయము దేవునికి వ్యతిరేకముగా ఉండగలదు. మన ప్రార్థనల వలన దేవుని మోసగించలేము. మనలో పొరపాటు ఏమిటో దేవుడు ఎరుగును. ఈ ప్రజల మీద దేవుడు ఎలా పనిచేసాడంటే దేవుని వాక్యం వారి హృదయముల మీద లిఖించబడినది. దేవుని వాక్యం మన హృదయములో ఉంటే మనం ఎవరికీ భయపడనక్కరలేదు. ఆయన మనలను తన ప్రార్థనా మందిరములోనికి నడిపించి మనకు తృప్తి కలుగజేయును. వేరే ఎక్కడను మనము తృప్తి పొందలేము. నేను విద్యార్థిగా ఉండినకాలమున నా దుస్తులను గురించి నాకు నేర్పించేవారు. ఆలయములో ఎక్కడ కూర్చోవాలో నేర్పేవారు. వేర్వేరు పరిస్థితులలో నేనెలాగ ప్రవర్తించవలెనో ఆయన నేర్పేవారు. నా వ్యక్తిత్వము అంతటిని ఆయన అదుపులోనికి తీసుకున్నారు. నేను చాలా క్షేమంగానూ, ధైర్యముగానూ ఉండేవాడిని. నేనెవరినీ కలుసుకోవడానికి ఆలయానికి వెళ్ళేవాడిని కాను. కానీ దేవున్ని ఆరాధించడానికి మట్టుకు వెళ్ళేవాడిని. ప్రార్థనా మందిరములో దేవుడు నిన్ను తృప్తి పరుస్తాడు. దేవదూతలు నీ ప్రార్థన వినడానికి దిగి వస్తారు. ఎందుకంటే నీ వ్యక్తిత్వమంతయూ నీ హృదయ ఆలోచనలు దేవుడే తన ఆధీనంలో పెట్టుకొనును. మనం దేవుని సేవను సగం పరిశుద్ధతతో చేయగలమని అనుకోకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోనికి మనము వెళ్ళునప్పుడు మనం బహు జాగ్రత్తగా నుండాలి. సహవాసంలో అనేకమంది విషయమై నేను చాలా దు:ఖిస్తున్నాను. ఎందుకంటే వారు దేవుని దృష్టిలో తమ హృదయములను తిన్నగా పెట్టుకోలేరు, దేవుణ్ణి దూషించి వ్యతిరేకంగా మాట్లాడుతూ, సేవకులపైన కూడా తిరగబడి మాట్లాడుతూ దేవుని వాక్యం వారిలో వుండదు. వారి హృదయము యొక్క కళ్ళెం దేవుని చేతిలో లేదు.
మనం దేవునికి సరియైన విధేయత చూపించి మన సంఘంలో ఉన్న చీకటిపై పోరాడకపోతే మానవ సమాజమునకు కీడు. దేవుడు చెప్పినాడు కదా..''నా ప్రార్థనా మందిరములో వారు సంతోషిస్తారు.'' అని ఎంత గొప్ప వాగ్దానము, మనము ఆ స్థితికి వస్తే తప్ప దేవుని సేవ చేయలేము. నీవు ఇప్పటికైనా తెలుసుకో నీ మాటలు అంతరంగమందు నీ కోరికలు దేవుడు వీటన్నిటిని గమనిస్తున్నాడు. క్రీస్తు వైపు తిరిగి నీ మనసు దేవునికి ఇస్తే నీవు సంతృప్తిగా జీవించగలవు. మంచి నిర్ణయం తీసుకో...ఆల్ ది బెస్ట్.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
Pastor.N.Daniel Balu : 8142229661
No comments:
Post a Comment