Posts

లాస్ట్ సండే చర్చ్ లో ఏ ప్రసంగం విన్నావో గుర్తుందా ?

Image
✝ Christ Temple - Proddatur 🔅 లాస్ట్ సండే చర్చ్ లో ఏ ప్రసంగం విన్నావో గుర్తుందా ?  ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు ప్రకటన 1 : 3. ఒక లాయరు, ఒక పాస్టరు, ఒక డాక్టరు కలసి ఒక నదీతీరములో ఉన్న బాతులను వేటాడుటకు వెళ్లారు. అక్కడ చాల బాతులు ఉన్నవి. ముగ్గురూ తమ తుపాకీలను గురి పెట్టి కాల్చారు. ఒకే బాతు పడిపోయింది. మిగిలిన బాతులన్నీ ఎగిరిపోయాయి. ముగ్గురూ పరుగెత్తి పడిపోయిన బాతు దగ్గరకు చేరారు. 'నేను కొట్టిన తుపాకీ దెబ్బకే ఇది చచ్చిపోయింది. కాబట్టి ఇది నాది' అన్నాడు లాయరు. డాక్టర్‌ 'నేను కొట్టిన బుల్లెట్‌తో ఇది చచ్చింది' అన్నాడు. పాస్టరు 'కాదు నేను ఈ బాతుకే గురిపెట్టాను' అన్నాడు. బాతుకు ఒకే బుల్లెట్‌ తగిలింది. ఎవరి బుల్లెట్‌ వల్ల తగిలిందో నిర్ణయించడం ఎలా? ఆ దారిన ఒక మహా జ్ఞాని వెళ్లుచూ వీరి కలహం విని 'ఎందుకు మీరు కలహించుకుంటున్నారు?' అని అడిగాడు. వారు ముగ్గురూ జరిగింది చెప్పారు. 'నేను నిర్ణయిస్తాను. ముందు దానికి బుల్లెట్‌ ఎక్కడ తగిలిందో నన్ను చూడనివ్వండి' అన్నాడు. ఐదు సెకన్ల త...

నీ ఇంటిని చక్కబెట్టుకో

Image
✝ Christ Temple - Proddatur నీ ఇంటిని చక్కబెట్టుకో   నీ ఇంటిని చక్కబెట్టుకో నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యోహోవా సెలవిచ్చెను. 2 రాజులు 20:1-5 క్రీస్తునందు ప్రియ ప్రియపాఠకులారా యేసు నామమున మీకు శుభము కలుగును గాక ! ప్రస్తుతం ఈ లోకంలో జరుగుతున్న హడావిడి ఒకటే. ఇల్లు కట్టడం, ఇల్లు అమ్మడం మనం తరచుగా చూస్తున్నాం. ఈ పరంపరలో చాలామంది పెండ్లిండ్లు చేసి ఇల్లు అమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇల్లు అమ్మేవారు, సరైన ఆదాయం రావడం లేదని ఇల్లు అమ్ముతారు. కారణం బాడుగకు ఇల్లు ఇచ్చినప్పుడు వారు చెప్పినట్లు వినే వారు ఇచ్చిన డబ్బులతో తృప్తి చెందక, ఖాళీ చేయ్యి, ఖాళి చేయ్యి అని చెప్తూ ఉంటారు. ఈలాంటి ఘోరమైన రోజులలో మనం జీవిస్తున్నాం. ఇల్లు రెండు రకాలు 1.మనం నివసించే ఇల్లు 2.మన కుటుంబం అనే ఇల్లు మొదటి ఇల్లు స్థిరమైనది కాదు, ఎన్ని లక్షలు పెట్టి కట్టించుకొన్నా, ఎన్ని కోట్లు పెట్టి కట్టించుకొన్నా ఏదో ఒకరోజు వదిలి పోవాల్సిందే. రెండవ ఇంటిని చూస్తే ఈ ఇంటిలో ఉండే కుటుంబము ఐక్యమత్యంతో జీవిస్తే దీర్ఘ కాలం జీవిస్తారు లేకపోతే అది క...

వారు చీట్లు వేసినప్పుడు..చీటి యోనా పేరు మీద వచ్చింది..

Image
✝ CHRIST TEMPLE-PRODDATUR Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది.. అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా  యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా 1,2,3,4 అధ్యాయాలు ❇ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా, ఓడ బ్రద్దలైపోయే తీవ్రమైన తుఫాను రేగింది. నావికులకు భయపడి ప్రతివాడు తన తన దేవుళ్ళకి మొర పెట్టాడు, ఓడ తేలిక చేయడానికి వారు దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అప్పటికే యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోయాడు. ఓడ నాయకుడు యోనాదగ్గరికి వెళ్ళి౼“ఓయ్! నువ్విక్కడ నిద్రపోతున్నావా?లేచి నీ దేవునికి ప్రార్ధన చెయ్!ఒకవేళ ఆయన మనల్ని కనికరించి నాశనం కాకుండా కాపాడతాడేమో"అన్నాడు అప్పుడు నావికులు౼"ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో చీట్లు వేసి తెలుసుకొందాం, రండి" అని చెప్పుకొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది....

మనుష్యులు చాలా చెడ్డవాళ్లు

Image
✝ CHRIST TEMPLE-PRODDATUR Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu మనుష్యులు చాలా చెడ్డవాళ్లు ❇ భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు ఆయన చూశాడు. ఈ భూమి మీద మనుష్యులను చేసినందుకు దేవుడు విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది (ఆది 6:5,6).❇ ■ నోవహు రోజులకు భూమిపై నరులు చెడుతనం బహుగా విస్తరించింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, ఆయన్ను దుఃఖపెట్టే భక్తిహీనులైన తరం ఒకటి విస్తృతంగా ప్రబలింది. ప్రజలు భక్తిహీనులై భూమిమీద వారి జీవితాలను చెడుతనంతో చెరిపి వేసుకొన్నారు(యూదా 1:14,15). కయీను దేవుని సన్నిధి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక దేవుని గూర్చి ఆలోచనలు అతనిలో గానీ, అతని సంతానంలో గాని ఉన్న దాఖలు కనిపించవు. కయీను మొదటి నుండి ఏ మాత్రం దైవభయం లేని వాడిగా ఉంటూ, ఇహలోక విషయాల్లో ఆసక్తి పరునిగా కనిపిస్తాడు. అతని సంతతివాడైన లెమెకు దైవభయం లేకుండా (కయీను వలె) ఒకడ్ని హత్య చేసి, తన భార్యలకు గొప్పగా చెప్పుకున్నాడు. బహు భార్యత్వం మొదట ఆరంభమైనది ఈ వంశంలోనే! అంతేకాకుండా క్రొత్త విషయాలను కన...

ఇక ఏ విషయం గూర్చి దుఃఖపడాల్సిన అవసరం లేదు

Image
✝ CHRIST TEMPLE-PRODDATUR Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu ఇక ఏ విషయం గూర్చి దుఃఖపడాల్సిన అవసరం లేదు ❇ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటితో వచ్చి షోమ్రోన్ను పట్టణాన్ని ముట్టడించాడు. అప్పుడు షోమ్రోనులో తీవ్రమైన కరవు సంభవించింది. ఆ నగర బయట, ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు. వారు ఒకడితో ఒకడు౼ "మనం నగరంలోకి వెళ్లినా కరువు వల్ల చస్తాం! లేక ఇక్కడే కూర్చునివున్నా చస్తాం! గనుక మనం ఇప్పుడు సిరియనుల యుద్ధ శిబిరానికి వెళదాం పదండి! ఒకవేళ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం! చంపితే చస్తాం!" అని చెప్పుకొన్నారు. ఐతే అప్పటికే దేవుడు సిరియా సైన్యానికి, రథాలూ-గుర్రాల చప్పుడు వినిపించేలా చేశాడు గనుక ఇశ్రాయేలీయులు హిత్తియ రాజుల్నీ, ఐగుప్తు రాజుల్నీ సహాయంగా పిలుచుకొని పెద్ద సైన్యంతో దాడికి దిగారనుకొని అక్కడ నుండి ఉన్నపాటున పారిపోయారు. ఆ కుష్ఠురోగులు శిబిరం ప్రవేశించి సిరియనులు పారిపోయ్యారని తెల్సుకొని, ఆకలితో ఉన్నందున వారి గుడారాల్లోకి చొరబడి, తిని త్రాగారు. అక్కడనుంచి వెండి, బంగారం, దుస్తులు ఎత్తుకుపోయి వేరే చోట దాచారు. అప్పుడు వారు ఒకడితో ఒకడు౼...

ఒక వివాహం

Image
✝ CHRIST TEMPLE-PRODDATUR Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu                        ఒక వివాహం మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యోహాను సువార్త 2:1-11 ❇ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో పెళ్ళికి యేసుని, ఆయన తల్లిని, ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు. ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి ఆయనతో౼“వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది” అంది. యేసు ఆమెతో౼“అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” ఆయన తల్లి పనివారితో౼“మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. యేసు పనివారితో౼“ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో౼“ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు గురించి ఆ పనివారికి మాత్రమే తెలుసు. విందు ప్రధానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి౼“ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్ర...

ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని (దేవుణ్ణి) చూసినట్టే!

✝ CHRIST TEMPLE-PRODDATUR Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని (దేవుణ్ణి) చూసినట్టే! ❇ ఫిలిప్పు యేసుతో౼"ప్రభువా, తండ్రి(తండ్రియైన దేవుణ్ణి)ని మాకు చూపించు. అది మాకు చాలు " యేసు అతనితో౼"ఫిల...