మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే

✝ CHRIST TEMPLE-PRODDATUR

Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu

           మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే

❇ ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.

అప్పుడు ప్రభువు౼“పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది...

ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు౼“బోధకుడా! ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు (లూకా 11:37-54) ❇

■ మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే వారి ఆత్మీయ స్థితి గూర్చి ఇలా ఘాటుగా మాట్లాడగలమా? దేవుని వాక్యంలోని దేవుడు, సశరీరునిగా వారి మధ్యలోకి వస్తే ధర్మశాస్త్ర భోధకులు, మత నిష్ఠగల వారు ఆయన్ను తిరస్కరించారు (ద్వేషించారు). దీనిని బట్టి ఏమి అర్ధమౌతుంది? వారికి వ్రాయబడిన వాక్యం తెల్సు! కానీ వాక్యంలోని సజీవునిగా ఉన్న దేవుణ్ని వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. బైబిల్లో ఉన్న క్రీస్తు, మనం ఊహించుకొని క్రీస్తుకు చాలా తేడా ఉంటుంది. క్రీస్తు సమాధానధిపతి కనుక చాలా మృదువుగా,సున్నితంగా అందరితో మాట్లాడుతూ, అందరి మనన్నలు పొందుతాడని అనుకోవద్దు! అలావుంటే వారు ఆయనకు అసలు సిలువ వేసేవారే కాదు. మనలో చాలా మంది కూడా అందరి మన్ననలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.నిజానికి ఆ సాక్ష్యం వారు అతిశయించడానికి తప్ప ఎందుకూ పనికి రాదు.సత్యవాక్యన్ని చేపట్టి నడుస్తున్న క్రైస్తవుడు అనేకుల చేత ద్వేషించ బడతాడు.అలా జరగకపోతే క్రీస్తు కానీ వేరొక క్రీస్తును నీవు అనుసరిస్తున్నావు.

■ ఆయన వ్యభిచారులతో, అన్యాయస్తులతో, దొంగలతో, నరహంతకులతో ప్రేమగా మాట్లాడేవాడు, పైన చెప్పిన వేషధారులలాంటి వారితో కఠినంగా మాట్లాడేవాడు. ఇది లోకానికి మింగుడు పడని విషయమే! దానికి గల కారణం ఇదే! పాత్ర లోపట, బయట శుభ్రంగా లేని వారు.పాపులుగా లోపల బయట కనబడేవారు. వీరు మారుమనసుకు అవకాశాలు ఉన్నాయి. వీరిలో యదార్థవంతులైన వారంతా దేవున్ని చేరుకుంటారు. బయట శుభ్రం చేసుకుంటూ, లోపల దేవుని వాక్యాన్ని తిరస్కరించే వారినే క్రీస్తు మిక్కిలి అపాయంలో ఉన్నట్లుగా గద్దించాడు.

■ 'పాత్ర బయట మాత్రమే'౼దేవుని వాక్యం చిన్నప్పట్నుంచి తెల్సు, మాకు మనుష్యల మధ్యలో మంచి సాక్ష్యం ఉంది, పరిచర్యలో వాడబడుతున్నాను అంటూ భక్తి ముసుగులో తృప్తిపడే వ్యక్తులు. ఐతే వారి అంతరంగం దేవుని వాక్యానికి అవిధేయతతో నింపబడి ఉంటుంది. తమ చెడిపోయిన స్వభావాన్ని, దాని భావోద్రేకాలను తృప్తి పరుచుకోవడానికి వాక్యాన్ని వెతుకుతారు. వాక్యం పై వీరు అధికారం చెయ్యడానికి చూస్తారు.కనుక దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్ప జెప్పుతాడు. ఒకవేళ క్రీస్తు సశరీరునిగా వారి ముందుకు వస్తే గనుక ఖచ్చితంగా పరిసయ్యుల వలె ఆయన్ను ద్వేషిస్తారు. వీరు దేవునికి చెందిన వారు కారు!

CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661.

Comments