నిద్ర - రహస్యాలు

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details  : +91 8142229281.

  నిద్ర - రహస్యాలు

👉 ఎక్కువసేపు నిద్రపోవుట వల్ల..

1. లేమి వచ్చును.
సామెతలు 6:9-11

2. చింపి గుడ్డలు వేసుకొనెదవు.  సామెతలు 23:21

3. దరిద్రత పరిగెత్తి వచ్చును. సామెతలు 24:33

 👉 కావున స్నేహితుడా ఎక్కువ నిద్రపోకు. పెందలకడ లేచి ఆయనను ప్రార్ధించు. దేవునితో దిన ప్రారంభం చెయ్యి. దినముకు ఎన్నిసార్లు ప్రార్ధిస్తున్నావు..?

👉 నిద్ర వల్ల దరిద్రం వచ్చును.

 👉 ప్రార్ధన వల్ల ఐశ్వర్యం వచ్చును. కోతకాలము నందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు..సామెతలు 10:5

బైబిల్ ల్ కొందరి నిద్రలు:-

🔶 1. ఆదాము నిద్ర...... ఆది 2:21
🔶 2. ఫరో నిద్ర. ఆది 41:5
🔶 3. అబ్రాము నిద్ర. ఆది 15:12
🔶 4. యాకోబు నిద్ర.  ఆది 28:16
🔶 5. సీసెరా నిద్ర. న్యాయాది 4:21
🔶 6. సంసోను నిద్ర. న్యాయాది 16:14
🔶 7. యోనా నిద్ర. యోనా 1:5
🔶 8. యోసేపు నిద్ర. మత్తయి 1:24
🔶 9. ఐతుకు నిద్ర.  అపో. 20:9
🔶 10. పేతురు నిద్ర. అపో. 12:6
🔶 11. యేసు నిద్ర. మత్తయి 8:24
🔶 12. శిష్యుల నిద్ర.  మత్తయి 26:45
🔶 13. పెండ్లి కుమార్తెల నిద్ర. మత్తయి 25:5
🔶 14. ఎలీయా నిద్ర. 1రాజులు 19:5

👉 ఆదాము తన నిద్రలో తనకు తోడును తెచ్చుకున్నాడు.

👉 అబ్రాము, ఫరో, యాకోబు నిద్రలో తమ జీవితాన్ని ముందే తెలుసుకున్నారు.

👉 సీసెరా నిద్రలోనే మోకులతో తలపై కొట్టబడి చనిపోయాడు.

👉 సంసోను నిద్రలో తన శక్తిని కోల్పోయాడు.

ప్రియులారా సంసోనులా చెడు సాంగత్యానికి అలవాటు పడితే సంసోనులా ఏదో ఒక విధముగా పట్టుపడతావ్ అని మరచిపోకు.

🔬 ఇప్పుడు నిద్ర గురించి డాక్టర్స్ ఏమంటున్నారో చూద్దాం.(సేకరణ)

▪కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర...

ఈ రెండింటిలో దేనిలోనైనా తేడా వస్తే మనిషి అనారోగ్యం పాలవుతాడు. పరిస్థితి విషమిస్తే మరణానికి దగ్గరవుతాడు. తిండి తినకుండా 20 నుంచి 40 రోజుల వరకు ఉండొచ్చు కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం. ఒక్కరోజు సరిగా నిద్రలేకుంటే పని చేస్తున్నప్పుడు మధ్యలోనే కునుకుపాట్లు, తలనొప్పి ముంచుకొస్తుంటాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల సర్వే ప్రకారం ఓ మనిషి నిద్రపోకుండా 264 గంటలు.. అంటే 11 రోజుల పాటు ఉండగలడట. అంతకుమించితే చావును చూడాల్సి వస్తుందని సర్వే చేసిన వారు తేల్చిచెప్పారు.

           అయితే నేటి యువత ఫేస్‌బుక్ డేటింగ్‌లు, వాట్సప్ చాటింగ్‌లతో నిద్రను దూరం చేసుకుంటోంది. తద్వారా రోగాల బారిన పడుతోంది. అధిక రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బులు, మధుమేహం, వంటి సమస్యలకు నిద్రలేమి కారణమని డాక్టర్లు చెప్పినా, స్థూలకాయానికి దారితీస్తుందని సర్వేలు ఘోషించినా పెడచెవిన పెడుతోంది. అయితే నిద్రను దూరం చేసుకోవడం వల్ల కలిగే రోగాలు, నష్టాల గురించి చాలామందికి తెలుసు. కానీ నిద్రే రోగంగా మారి పీడిస్తుంటే... నిద్ర వద్దు బాబోయ్ అని ఎంత పట్టుదలగా ఉన్నా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి నిద్రలోనే ఉండిపోతే.... ఏంటీ విచిత్రం అని అనుకుంటున్నారా? అస్సలు నమ్మలేకపోతున్నారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిద్ర ఓ సమస్యగా మారి ఎంతో మందిని వేధిస్తోంది. ఆ వింత విచిత్ర నిద్ర రోగాలేవో ఒకసారి చూద్దాం.

కుంభకర్ణుడి గురించి భారతీయులకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఆరు నెలలపాటు ఏకధాటిగా నిద్రపోయేలా రావణుడి సోదరుడయిన కుంభకర్ణుడికి బ్రహ్మ వరమిస్తాడు. మరి దేవుడి వరమో, ఎవరు ఇచ్చిన శాపమో కానీ ఓ యువతి కూడా ఈ కుంభకర్ణుడికి పోటీనిస్తోంది. కుంభకర్ణుడిలా ఆరు నెలలు కాదు గానీ ఏకధాటిగా పన్నెండు రోజుల పాటు నిద్రపోతోంది. బ్రిటన్‌కి చెందిన లూసియా బాల్ అనే 22 ఏళ్ల యువతి పడుకుంటే చాలు 8 నుంచి 12 రోజుల పాటు నిద్రపోతోంది. స్లీపింగ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న ఈ యువతి రోజులో దాదాపు 22 గంటలపైనే నిద్రపోతుంది. మిగిలిన రెండు గంటలు కూడా మితంగా.. నిద్రలో ఉంటుందట. ఆ సమయంలో అతి కష్టం మీద ఆమె తల్లిదండ్రులు ఆహారం, నీళ్లు, కాలకృత్యాలు వంటి అవసరాలను తీరుస్తారు. వెన్వెంటనే మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. ఈ నిద్ర రోగం వల్ల అమ్మాయి చదువు కోల్పోతోందనీ, ప్రయాణాలు చేయలేకపోతోందనీ తల్లిదండ్రులు వాపోతున్నారు. క్లీనె-లెవిన్ సిండ్రోమ్ (Kleine-Levin) వల్ల ఈ విధంగా రోజుల తరబడి ఆమె నిద్రపోతోందని వైద్యులు తెలిపారు. దీనికి కచ్చితమైన వైద్యం లేదని డాక్టర్లు కూడా తేల్చేశారు. ఇలాంటి నిద్ర రోగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మందికి పైగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి.

నిద్రపోయినప్పుడు పిలిస్తే కొంతమంది ఇట్టే లేస్తారు. ఒక్కసారి ముట్టుకుంటే చాలు ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. కానీ అతి తక్కువ శాతం మంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరు పలకరు. మెలకువ వచ్చినా లేవలేరు కూడా. దీనినే స్లీప్ పెరాలసిస్ అంటారు. పెరాలసిస్ వ్యాధిగ్రస్థులు మంచం మీద నుంచి లేవలేరు. స్లీప్ పెరాలసిస్ (Sleep Paralysis) లక్షణాలు ఉన్నా అంతే! నిద్రలో నుంచి మెలకువ వచ్చినా సరే.. లేచి కూర్చోలేకపోవడాన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. మితమైన నిద్రలో ఉండి, కాళ్లు, చేతులు పట్టేసినట్లు ఉండి శరీరం మొత్తం అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. అయితే కొద్దిసేపటికి దానికదే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది కూడా. ఇలాంటి నిద్ర రోగం వల్ల నష్టం ఏమీ లేకున్నా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కొంచెం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి లక్షణాలను ‘దయ్యం మనిషిని లేవకుండా కిందకు నెట్టేస్తోంది’ అని భావిస్తుంటారు. మెక్సికోలో అయితే, ‘మరణమే మనిషిపై కూర్చుని ఉంది’ అని చెప్పుకుంటుంటారు. అక్కడి ఆచారాల ప్రకారం పూజలు పునస్కారాలు కూడా చేస్తుంటారు. 

             నిద్ర పోకపోవడం వల్ల వచ్చే రోగాలతో పాటు ఇలాంటి నిద్రరోగాలు కూడా మనుషులను వేధిస్తున్నాయి. ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయి మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు. నిద్ర రోగాలను ఎలాగూ ఆపలేము కానీ నిద్ర పోకపోవడం వల్ల వచ్చే రోగాలను ఆపడం మన చేతుల్లో పని. అందువల్ల సమయానికి నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కళ్లకు హాయి... ప్రాణానికి హాయి.

         ➡ దేవుడు నీకు అప్పగించిన పని మరచిపోయి యోనాలా నిద్రపోతున్నవా స్నేహితుడా?....

మరి దేవుని రక్షకునిగా అంగీకరిస్తావా?
అంగీకరించి నట్లయితే నిద్రలో నుండి మొల్కొని ప్రార్ధించు. అప్పుడు నీవు నిద్రపోయిన ఆయనే సురక్షితముగా నివసింపజేయును.

*యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.కీర్తనలు 4:8*

ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు కునకడు, నిద్రపోడు కీర్తన 121:4

ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక ఆమెన్!
May God bless you all..
దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪

Comments