*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకుందాం!
అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా...మత్తయి 25:11
ఆ కాలంలో యూదుల వివాహాలు ఎట్లా జరిగేవి అంటే? వివాహ వ్యవధిని 15 రోజులుగా నిర్ణయించే వారు. ఉదా: జనవరి 1 నుండి 15వ తేదీ లోపు వివాహం జరగాలని.
అందుచే ఈ పదిహేను రోజులు పెండ్లి కుమార్తెతో పాటు కొంత మంది కన్యకలు విడిది గృహంలో ఎదురు చూస్తూ వుండాలి. పెండ్లి కుమారుడే స్వయంగా అక్కడకి వచ్చి, పెండ్లి కుమార్తెను వివాహం జరిగే స్థలానికి తీసుకొని వెళ్తాడు. (నేటి దినాలలో కూడా పెండ్లి కుమార్తె వస్తుంటే? పెండ్లి కుమారుడు ఎదురు వెళ్లి, తీసుకొని వస్తాడు.)
అతడు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. పగలు కావచ్చు, అర్ధరాత్రి కావొచ్చు, తెల్లవారు జాము కావొచ్చు. ఆ 15 రోజులలో ఎప్పుడైనా రావొచ్చు. వచ్చే ముందు ఒక వ్యక్తి పెద్దగా పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేకలు వేస్తూ ముందుగా వస్తాడు. ఆ కేకలు విని ఈ కన్యకలు పెండ్లి కుమార్తెను సిద్ధ పరచి, వారునూ సిద్ధ పడాలి. కొందరు కన్యకలు దివిటీలు పట్టుకుంటారు, కొందరు పాటలు పాడుతూ నాట్యం చేస్తారు, మరి కొందరు కంజెరలు వాయిస్తారు.
ఇక్కడ దివిటీలు పట్టుకొనే పదిమంది కన్యకల కోసం వ్రాయబడింది.
• పదిమందీ కన్యకలే.
• పదిమందీ వివాహానికి పిలువ బడ్డారు.
• పదిమందీ సిద్ధెలను కలిగి యున్నారు.
• పదిమందీ విడిది గృహానికి చేరుకున్నారు.
• పది మందీ నిద్రపోయారు.
(పెండ్లి కుమారుని రాక ఆలస్యం కావడం వలన)
• పదిమందీ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక విన్నారు.
• పదిమందీ నిద్ర లేచారు.
• పదిమందీ సిద్ధెలు వెలిగించారు.
• పదిమంది సిద్ధెలూ వెలిగాయి.
*కాని, ఐదుగురు సిద్ధెలు ఆరిపోయాయి.*
కారణం?
*ఆ సిద్దెలలో నూనె లేదు*.
పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. విందుశాల గడియ వేయబడింది.
తర్వాత వచ్చి, అయ్యా! అయ్యా! అంటూ తలుపు తడుతూవున్నారు. లోపలి నుండి సమాధానం " మీరెవరో నాకు తెలియదు". ఎంత రోధించినా అది ఎన్నటికీ తెరువబడదు.
*అవును! మన జీవితాలూ అంతే కదా? ఆరాధనకు వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, అంతే బానేవుంది. క్రీస్తు బిడ్డలవలెనే చలామణి అయిపోతున్నాము. కాని నూనె అనెడి "పరిశుద్దాత్మ" లోపించింది. రక్షించబడి, బాప్తీస్మం పొందుకున్న మనము ఆ ఆత్మను కలిగి యున్నాము. కాని మన శరీర కార్యములు ఆత్మను పనిచెయ్యనివ్వ కుండా అడ్డుగా వచ్చేస్తున్నాయి.*
*తద్వారా వెలిగి ప్రజ్వలించ వలసిన జీవితాలు ఆరిపోతున్నాయి. ఒకవేళ ఈదినమే, పెండ్లి కుమారుడైన యేసు ప్రభువు వారు పెండ్లి కుమార్తె (సంఘము) అయిన నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తే? ఎత్త బడతావా? ఆ గొర్రె పిల్ల మహోత్సవపు విందులో పాల్గొంటాను అనే నిరీక్షణ నీకుందా?*
*ఒకవేళ విడువబడితే*?
రొమ్ము కొట్టుకొని రోదించినా? అది అరణ్య రోధనే తప్ప, ఫలితం శూన్యం.ఆయన చెప్పే మాట అదే. "నీవెవరో నాకు తెలియదు". నీ ప్రార్ధన నేను వినను.
*శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.*
మత్తయి 25: 41
అంటాడేమో? వద్దు అది భయంకరం. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకుందాం!
ప్రభువు రాకడకై సిద్ధ పడదాం!
ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments