🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ప్రార్థనే కరువయ్యింది. ఇక విజ్ఞాపనకు చోటెక్కడిది?
అబ్రాహాము:
• అబ్రాహాము అను మాటకు 'అనేక జనములకు తండ్రి' అని అర్ధం.
• నీతిమంతుడు
• దేవుని స్నేహితుడు
• యూదులకు, ముస్లింలకు, విశ్వాసులకు తండ్రి.
• యేసు ప్రభువు ఈయన వంశములోనుండే రావడాన్ని బట్టి, సమస్త వంశములు ఈయనయందే ఆశీర్వధించ బడినట్లయ్యింది.
లోతు:
• నీతిమంతుడు
• నీతిమంతుడైన అబ్రాహాము సహవాసాన్ని విడచిపెట్టడం ద్వారా పెద్ద తప్పుచేసాడు.
• సొదొమ అందాలను చూసి మోసపోయాడు. ఆ ప్రజల అలవాట్లు, జీవన విధానం తెలిసికూడా వారితోనే జీవించడానికి ఇష్టపడ్డాడు.
దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని. సరే, నేను నా కుటుంబం బానేవుంది కదా? ఎవరు ఏమయితే, నాకెందుకని మాట్లాడక ఊరుకోలేదు. దేవుని సన్నిధిలో 'యాచన' చేస్తున్నాడు.
• ప్రార్ధన ముఖ్యమైనది.
• విజ్ఞాపన బలమైనది.
• యాచన దానికంటే శక్తివంత మైనది.
• మూలుగు అత్యున్నత మైనది.
అబ్రాహాము యాచిస్తూ, విజ్ఞాపన చేస్తున్నాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. నీతిమంతులపట్ల అతడెంత భాద్యత కలిగియున్నాడో?
అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా?
ఆది 18:23-33
అంటూ మొదలుపెట్టి, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు వుంటే? వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? అంటూ దేవునితో యాచన ప్రారంభించి 10 మంది వరకూ తగ్గించుకొంటూ వచ్చాడు. ఆ పట్టణాలు నాశనం కాకుండా కాపాడడానికి సకలవిధమైన ప్రయత్నాలు చేసాడు.
అట్లా మన కుటుంబాల కోసం, రక్షణలేని బిడ్దల కోసం గోజాడే అనుభవం మనకుందా?
ప్రార్దనే కరువయ్యింది. ఇక విజ్ఞాపనకు చోటెక్కడిది? విజ్ఞాపనే లేదు. ఇక యాచనకు స్థానమెక్కడ? యాచన లేనేలేదు. ఇక మూలుగుకు అవకాశమెక్కడ?
రక్షించబడిన మనము రక్షణలేని వాని కొరకు ప్రార్ధించాలి, విజ్ఞాపన చెయ్యాలి, యాచించాలి, మూల్గాలి. అట్లాంటి భారం, భాద్యత తప్పక కలిగి యుండాలి.
ఆ భారం నీకుందా?
నీ భాద్యత గుర్తుందా? అయితే,
విజ్ఞాపన చేద్దాం! ఒక్కరినైనా ఆయన వైపుకు త్రిప్పుదాం! నిత్య మరణం నుండి తప్పిద్దాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే ఫాల్లో బట్టెన్ ఒకే చేయండి. ప్రతిరోజూ వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments