కీర్తనలు పాడుడి..విజయం నీదే..
కీర్తనలు పాడుడి..విజయం నీదే.. కీర్తనలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును ప్రశాంతంగా మార్చుతుంది. మనం కీర్తనలు పాడినప్పుడు అది చింత, ఒత్తిడి నుండి ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండె చప్పుళ్ళు ఒకరినోకరికి ఏకీభవిస్తాయని కొందరి పరిశోధకుల అభిప్రాయం. అపోస్థలుడు పౌలు అంటాడు “ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించమని ప్రోత్సాహిస్తున్నాడు (ఎఫెసీ 5:19). పరిశుద్ద గ్రంథంలోని అనేక సందర్భాల్లో కూడా దేవుని స్తుతించమనే చెబుతుంది. “దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.” కీర్తన 47:6. శత్రువులు యూదా జనాంగంవైపు వస్తున్నప్పుడు, భయపడిపోయిన రాజైన యెహోషాపాతు అందరినీ యెహోవా సన్నిధిని సమకూర్చాడు. సమాజాన్నంతటిని తీవ్రమైన ప్రార్ధనలో నడిపించాడు. వారు తినక త్రాగాక కేవలం ప్రార్ధన మాత్రమే చేశారు. “ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మా దిక్కు” అని ప్రార్ధన చేశారు. మరుసటి దినము యుద్ధరంగంలోనికి నడిచి శత్రువుల మీదికి వెళ్ళారు. అక్కడ వారిని నడిపించింది గాయక బృందమేగాని...