అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు..
- అతని నమ్మిక అతనిని సిగ్గుపరచలేదు.. అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఆది 15:2-4 అబ్రాహాముకు దర్శనమందు దేవుని వాక్యము ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంది. అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం చేస్తాను. *వాక్యం మాట్లాడుతుందా?* అవును! వాక్యమే దేవుడై యుండెను. యోహాను 1:1 దానికి అబ్రాహాము అంటున్నాడు. ప్రభువా నీవు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ప్రయోజనం ఏంటి? నాకు సంతానం లేదుకదా? నా దాసుడే నాఇంటికి వారసుడు కదా? అని దేవునికి మనవి చేసినప్పుడు, ఆ దినాన్ని అతనికి దేవుడు గొప్ప వాగ్ధానమిచ్చాడు. నీ దాసుడు నీ ఇంటికి వారసుడు కాదు. నీ గర్భమున పుట్టబోవువాడే నీకు ...