✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
- ఈ రోజే మీకు హామీ ఇస్తున్నాను..
నాలుగు మార్గాలు కలిసే రోడ్డు వంటి పరిస్థితిలో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉంటాయనీ తెలిసినప్పుడు, మీకు కావలసిందల్లా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణం అయిన దేవుని నుండి హామీ. బ్రతకగలను, సాధించగలను, జయించగలను అనే ధైర్యం నీలో రావాలంటే దేవుని నుండి మనకు ఒక హామీ రావాలి..అప్పుడే మనం నిమ్మళంగా ఉండగలము.
ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పౌలుకు ఏవిధంగా హామీ ఇస్తున్నాడో తెలుసుకుందాము
_నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా..- అపొస్తలుల కార్యములు 18:10_
దేవుని నుండి వచ్చిన ఈ హామీతో, అపో. పౌలు వివిధ ప్రదేశాలలో సువార్త ప్రకటించేటప్పుడు ఎలాంటి బాధనైనా భరించగలిగాడు. అంటే, క్రీస్తు శ్రమల వలన కలిగిన గాయపు మచ్చలు, మనం కూడా క్రీస్తు శ్రమలో పాలుపంపులు కలిగియున్నామని ప్రపంచానికి చూపించడానికి అవి సాక్ష్యంగా ఉంటాయి.
ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ అపొస్తలుడైన పౌలు వలె దేవుని నుండి హామీని పొందుకుందాము, ఈ భరోసా వలన జీవితం తెచ్చే ఎటువంటి సవాళ్ళనైనా, అనగా శ్రమలు, అప్పులు, సమస్యలు అన్నీ ఎదుర్కొనేలా చేస్తుంది.
మనల్ని పిలిచిన దేవుడు దానిని అద్భుతంగా పూర్తి చేయగలడని మనకు తెలిసినప్పుడు, సవాళ్లతో సంబంధం లేకుండా ముందుకు కొనసాగడానికి, పైకి ఎదగడానికి మనల్ని మనం ప్రోత్సాహించబడతాము.
దేవుడు మనకు తోడుగా ఉంటే, మనకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు. బాధపడాల్సిన అవసరం లేదు.. క్రీస్తులో దీవెనలలో మాత్రమే కాకుండా బాధలలో కూడా పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉంటామనే నిశ్చయత కలిగియుంటాము.
ఈ లోకం క్రీస్తును సిలువ వేసిందని మరచి పోవద్దు, ఒకనాడు ఆ లోకం మనల్ని కూడా వదిలిపెట్టదు, సిలివ వేయకపోయినా అలాంటి నొప్పి కలిగించే వేదనలు , కష్టాలు , అవమానాలు, నిందలు మన మీద వేస్తారు.
సమస్యలు లేని జీవితం ఎవరు జీవించలేరు, కానీ ప్రతి సమస్యలో దేవునికి దగ్గరగా, విశ్వాసంలో ఉన్న అన్ని కోణాల్లో అనుభవాలు తెలుసుకోగలిగితే, ఆ విశ్వాస పందెములో ఓపికతో అంతం వరకు పరిగెత్తే భాగ్యాన్ని పొందుకుంటాము.
దేవుని ఆశీర్వాదం గురించి గొప్పగా చెప్పుకోవడమే కాకుండా క్రీస్తులోని బాధలను గురించి కూడా గొప్పగా చెప్పుకోవడానికి దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఆమేన్.
✝️ *CHRIST TEMPLE-PRODDATUR*
Comments