✝ CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
PIT to PALACE
( ప్రతి ఒక్కరూ తప్పక చదవండి💯% దేవుడు మీతో మాట్లాడతాడు.)
❇ రెండు సంవత్సరాల తరువాత ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది. కనుక అతడు ఐగుప్తుదేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడం ఎవరి వల్ల కాలేదు.అప్పుడు రాజుకు పానపాత్ర అందించేవాడు యోసేపును గూర్చి రాజుతో చెప్పాడు. అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలో నుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు.
ఫరో యోసేపుతో౼
“నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను”
అన్నాడు.
యోసేపు౼“అది నా చేత అయ్యేది కాదు.
దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు”
అని జవాబిచ్చాడు ❇
■ చెరసాలలో ఉన్న యోసేపు దేవుడు ఇచ్చే విడుదల కోసం చాలా సంవత్సరాల నుండి కనిపెట్టసాగాడు. దేవుడు చేసిన వాగ్ధానంకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నా కూడా వాగ్ధానంకు ఆధారమైన దేవుణ్ణి యేసేపు దృష్టించాడు. దేవుడు తన కోసం ఏం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడో అతను గుర్తెరుగలేదు. ఆ చివరి రోజు చెరసాలలో అతని ప్రార్ధన(Revelation) నిజంగా గొప్పదిగా ఉండిఉండొచ్చు. చెరసాలలో దేవుడు తనకు అప్పగించిన పని శ్రద్ధగా ముగించి ఆ రాత్రి కూడా నిద్రపోయి ఉంటాడు.
మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. కీర్తనలు 127:2
అదే రాత్రి యేసేపు- రాజు ముందు కనబడటానికి కావాల్సిన పరిస్థితులను దేవుడే కలుగజేస్తున్నాడు (కలవరపర్చే కలలను దేవుడే ఫరోకు ఇచ్చాడు). వావ్ హల్లెలూయ.
దేవుని మీద విశ్వాసం పెట్టుకున్న తన దాసుణ్ణి దేవుడే తనదైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాల నుండి అంతఃపుర (prison to palace) ప్రయాణానికి తీసుకెళ్లడానికి దేవునికి ఒక గడియ చాలు. యస్ దేవుని బలాన్ని గుర్తించి, ఆనుకోవడమే విశ్వాసం!
■ దాదాపు 13 సం౹౹ నిరీక్షణలో(pit to palace)ఎన్నో ఒడిదుడుకులు మధ్య నుండి దేవుడు యోసేపును తీసుకెళ్ళాడు. దేవుని యెదుట, ఆయన ఉంచిన చోట తన నమ్మకత్వాన్ని కనపరచాడు. ఐగుప్తును గొప్ప కరువు నుండి రక్షించగల జ్ఞానం కలిగిన యేసేపును చెరసాలలో ఒక ఖైదీగా, ఖైదీల మధ్య ఉండటానికి దేవుడు అనుమతిచ్చాడు. దేవుని(Sovereignty) సర్వభౌమాధికారాన్ని గుర్తించి,దాన్ని గౌరవిస్తూ, లోబడం తెల్సిన వానిగా రూపుదిద్దబడ్డాడు. ఆ రోజు తెల్లవారినప్పుడు ఫరో సేవకులు తనను ఫరో ముందుకు సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుడు కదుపుతున్న పావులను యేసేపు గుర్తుపట్టి ఉండి ఉండొచ్చు.ఐతే ఎందుకు తనను దేవుడు ఐగుప్తుకు నడిపాడో గ్రహించడానికి దేవుని చేతిలోని పరిస్థితులనే గ్రంథాన్ని(Scroll) విప్పేదాక గుర్తించలేదు.
మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50:20
మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. నేడు దేవుడుంచిన ప్రదేశంలో దేవునికి లోబడుతున్నప్పుడు ఆయన చిరకాల ఉద్దేశ్యలనే (Scrollను) గ్రంథాన్ని విప్పుతూ వెళ్తాడు. ఆ సమయంలో దేవుడు తన శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పుతాడు. ఆ పాఠాలు తరువాతి ఆయన చిత్తం నెరవేర్పుకు ఎంతగానో దోహతపడతాయి.
౼ పరలోకం వైపు(దేవుని మీదకి) మన దృష్టి మరలినప్పుడు పరిస్థితులు, వ్యక్తులు కనుమరుగవుతారు. ఎంత ఆశ్చర్యం... ఆయన్ను మనం ప్రేమిస్తున్నట్లైతే, మేలు కొరకు నడిపించేది ఆయనే అని మరువోద్దు.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమీయులకు 8:28
అప్పుడు ప్రతి చెడు మనల్ని మేలు వైపుకే నడిపిస్తాయి. దేవునిపై ఒకని నిరీక్షణ అతణ్ని ఎన్నడూ సిగ్గుపరచదు.
'దేవుడు లేకుండా నేను ఒట్టివాణ్ని-నరుణ్ణి(మానవ బలాన్ని)నమ్ముకోవటం వ్యర్థం-దేవుని ద్వారానే సమస్తం సాధ్యం' అనేది నిరంతరం పాఠంగా ఆయన నేర్పుతూనే ఉంటాడు. ఎందుకంటే అదే సత్యం గనుక! యోసేపు చెరసాలలో నుండి ఒక సాధారణ స్థితిలో నుండి ఒక ఘణమైన ఆశీర్వాదంతో నింపియున్నాడు.
ప్రియ సహోదరీ సహోదరులారా కొన్నిసార్లు మనకు ముఖ్యమైన వారు, మనవారు అని మనం అనుకునేవారు మనల్ని త్రునీకరిస్తారు, అవమానాలు, నిందలు మనలను చుట్టూ చేరి ఇక నీ పని అయిపొయింది. అన్నట్లుగా నిరుస్తాహపరిస్తాయి. అయినా భయపడకండి దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుందని గ్రహించి యోసేపు వలే ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే నువ్వు జయిస్తావు.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
Comments