🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
ఓర్పు లేకపోతే ఏమి అవుతుందో తెలుసా?
👉ఈ రోజులలో అందరిలో ఓర్పు నశించిపోతోంది. టెక్నాలజీ పెరుగుతోంది, ప్రభుత్వం Digital India అంటోంది. కంపెనీలు 4G అంటున్నాయి.
▪వేగము ఎక్కువ అయిపోతోంది.
▪నిర్ణయాలలో వేగము, పాపములో వేగము ఎక్కువ అయిపోతోంది.
▪సహనము నశించిపోతోంది.
▪స్నేహితుడా తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబాలే రోడ్ మీదకి, పోలీస్ స్టేషన్ వద్దకు వస్తున్నాయి.
👉నేను మీ అందరికి తెలిసిన ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను.
అబ్రాము 99 సంవత్సరాల వయస్సులో దేవుడైన యెహోవా వచ్చి నేను నిన్ను ఆశీర్వాధిస్తాను, నీ సంతానమును గొప్ప చేస్తాను అంటే అబ్రాముకి నమ్మకం కలగలేదు అప్పటి వయస్సు అటువంటిది. అందుకే అబ్రాము దేవునితో ఇష్మాయేలుని నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించు అని అడిగాడు. అందుకు దేవుడు అబ్రాముకి దేవునికి మధ్య నిబంధన స్థిరపరిచారు.
👉 'తనతోడు' అని దేవుడు ప్రమాణము చేసాడు.
ఆ మాట నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలము పొందెను (హెబ్రీ 6:15)
ఓర్పుతో గొప్ప జనాంగాన్ని అబ్రాము పొంది అబ్రహాము అని పిలువబడ్డాడు.
కాని చాల మంది ఓర్పు లేక చెడ్డవారుగ పిలువబడుతున్నారు.
ప్రియులారా...
👉 దేవుని బిడ్డలమైన మనము అన్ని విషయాలలో మాదిరిగా, దేవుని పోలి నడుచుకోవాలి.
మనం క్రైస్తవులం అని చెప్పకముందే మన ప్రవర్తన బట్టి వీళ్ళు క్రైస్తవులు అనుకోవాలి.
👉అటువంటి ఓర్పు ప్రసాదించమని ఆ దేవుడిని మనం ప్రార్ధించాలి.
అటువంటి ఓర్పు లేకపోతే ఏమి అవుతుందో తెలుసా?
ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును అదే ఓర్పు లేకపోతే ని ఉద్యోగమే ఉడిపోవును (ప్రసంగి 10:4).
👉 పౌలు కొలస్సి సంఘానికి వ్రాస్తూ మీరు పూర్ణమైన ఓర్పు కలిగి, దేవునికి కృతాజ్ఞత స్థుతులు చెల్లించాలి (కొలస్సి 1:11) అని,
👉థెస్సలోక సంఘానికి గల ఓర్పుని చూసి పౌలు దేవునికి కృతాజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు (1థెస్స 1:2).
ప్రియులారా కొలస్సయుల వలే కాకుండా థెస్సలోనికయులవలే ఓర్పు కలిగి ఉందాము.
👉 పౌలు వలే శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. (2కోరింథి6:5). పౌలు గారు ఓర్పు తో ఉండటమే కాదు మనల్ని కూడా ఓర్పు కలిగి ప్రార్ధన యందు పట్టుదల కలిగి ఉండమన్నారు( రోమా 12:12).
పౌలు తనకు ఇష్టమైన, కుమారుడా అని సంబోధించిన తిమోతికి చెప్తున్నాడు, నువ్వు నా శ్రమలను, ఓర్పును తెలుసుకొని నన్ను వెంబడించావు ( 2తిమోతి 3:10) అని,
🔺మరి అటువంటి ఓర్పు కలిగి ఉందామా??
ఎటువంటి ఓర్పు కలిగి ఉండాలి??
▪ఆనందముతో కూడిన ఓర్పు.
(కొలస్సి1:11)
▪నిరీక్షణతో కూడిన ఓర్పు.
( 1థెస్స 1:2)
▪క్రీస్తు చూపిన ఓర్పు.
(2 థెస్స 3:5)
ఓర్పు వలన ఏమి కలుగును..?
👉 ఓర్పు వలన శోధనలలో మహాదానందము కలుగును.
(యాకోబు 1:2)
👉 ఓర్పు వలన వాగ్దాన ఫలములు పొందెదము.
(హెబ్రీ 6:15)
👉 ఓర్పు వలన ద్రోహకార్యములు జరగవు.
(ప్రసంగి 10:4)
👉 ఓర్పు వలన ప్రాణమును దక్కించుకొందుము.
(లూకా 21:19).
🔺ఇటువంటి ఓర్పు కావాలి అనుకుంటున్నావా?
▪ఓర్పు నకు కర్త దేవుడే (రోమా 15:4) కాబట్టి దేవుడిని ఈ రోజే అడుగు.
👉 దేవా శ్రమలలో, నిందలలో బాధపడకుండా, నీకు దూరము కాకుండా నీ ఓర్పు నాకు ప్రసాదించు దేవా అని అడుగు.
ఆ ఓర్పు నీవు కలిగి ఉంటె రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడెదను (ప్రకటన 3:10) అంటున్నాడు.
కాబట్టి కోపము, ద్వేషము లేకుండా ఓర్పు కలిగి దేవునిలో కొనసాగాలి అని వేడుకొంటున్నాను. అట్టి ఓర్పు దేవుడు మీకు అనుగ్రహించును గాక!
ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!
ప్రార్థనా సహాయం కోసం సంప్రదించండి.
CHRIST TEMPLE-PRODDATUR
Brother.N.Daniel
8⃣1⃣4⃣2⃣2⃣2⃣9⃣6⃣6⃣1⃣
Comments