🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details : +91 8142229281.
పరలోకము నిజముగానే ఉంది
అనేకమంది చెప్పే ఈ పరలోకము నిజముగా నిత్యమైన పట్టణానికి సాదృశ్యముగా బైబిల్ చెప్పేటువంటి "నూతన యెరూషలేము" అని పిలవచ్చు.
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.ప్రకటన గ్రంథము 21:2
అది రమ్యమైనటువంటిది. ఉదాహరణగా, పరలోకము ఇలా ఉంటుందని చెప్పొచ్చు.
ఒక నది, స్పటికమువలె స్పష్టమైనది, పట్టణపు మధ్యలో ఉన్న దేవుని సింహాసనము మరియు గొఱ్ఱెపిల్ల (ప్రభువైన యేసు) వద్ద నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండువైపులా జీవపు వృక్షాలు వున్నాయి, ప్రతి నెల పన్నెండు రకాల ఫలాలన్ని ఫలిస్తుంటాయి. ఆ పట్టణపు వీధులు స్పష్టమైన బంగారంతో నిండి ఉంటాయి, అద్దం లాంటి దారి. పట్టణపు ద్వారము మరియు పట్టణపు గోడ అమ్మూల్యమైనటువంటి బంగారము వెల గలిగిన రాళ్ళతో, పచ్చ, గోమేధిక,పుష్పరాగము మొదలగునవి. పట్టణానికి సూర్యుడును, చంద్రుడును అవసరము లేదు, సంఘమును మందిరము యొక్క అవసరము కూడ లేదు. దేవుని సన్నిధి ఆ ప్రాంతమునకు వెలుగుగా ఉండును.
ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలు
పరలోకము యొక్క అందము ఈ రీతిగా ఉంటుంది.
“అప్పుడు - ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు - ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు - ఈ మాటలు నమ్మకమును నిజమునైయునవి; నేనే అల్ఫాయు ఓమెగము, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొనువానికి జీవజలములు బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.”
ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.ప్రకటన గ్రంథము 21:4
పరలోకము దేవునిది. ఆయన దానిని సృజించాడు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుతత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను.. కొలస్సయులకు 1:16
యేసుప్రభువారు మొదటిగా భూమి మీదకి రక్షకుడిగా వచ్చిన్నపట్టికిను, ఆయన ఒకరోజు న్యాయాధిపతిగా ఉంటారు. "ప్రజలందరు శరీర సంబధితమైన పుణరుద్ధానాని అనుభవిస్తారు, అందరును యేసుప్రభు వారి న్యాయాసింహాసనము ఎదురుగా నిలబడతారు.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.ప్రకటన గ్రంథము 20:12
ఒక వ్యక్తి పరలోకమునకు ఎలా చెరతాడో అన్న విషయాన్ని యేసుప్రభు వారు మాటలతో చూడటం మనకి ఉపయోగకరం
అనేక మంది అనుకుంటారు నలుగురు మెచ్చుకునేటట్లు జీవించిన్నట్లయితే, అతి గోరమైన పాపాలు అయిన నరహత్య మొదలగు వాటికి దూరముగా ఉంటే చాలు.
కాని యేసుప్రభు వారు పరలోకానికి ఎలా వెళ్తారో ఈ రీతిగా చెప్పారు.
"మీ యొక్క నీతి శాస్త్రులు యొక్క నీతి కంటె మరియు పరిసయుల యొక్క నీతికంటే అధికముగా లేని యెడల నీవు పరలోకరాజ్యములో అడుగు పెట్టలేవు." శాస్త్రులు పరిసయులు సంఘములో గౌరవించదగినటువంటి మత పెద్దలు. వారు మంచి వారు పవిత్రమైన వారు!
యెషయా ప్రవక్త చెప్పిన మాట తిరిగి యేసుప్రభువారు ఈ రీతిగా చెప్పారు. పరలోకానికి వెళ్ళటానికి ఎవరు అర్హులు కాదు. ఎవరి నీతి క్రియలు అంత గొప్పవి కాదు. ఆయన నీతిక్రియల ద్వార మనం పరలోకం చేరుకోలేము. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మనము చేరుకోలేని పరలోకానికి నిత్యజీవమిచ్చి చేర్చాలని.
అది ఈ రీతిగా జరుగుతుంది.
ఎవరైతె యేసుప్రభు వారి యందు విశ్వాసము ఉంచుతారో వారు నశింపక నిత్యజీవము పొందుకుంటారు. దేవుడు తన కుమారుడను లోకమునకు తీర్పుతీర్చటానికి పంపలేదు కాని, ఈ లోకాన్ని ఆయన ద్వార రక్షించడానికి పంపారు.
ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. యోహాను సువార్త 3:18
మనము ఎప్పుడైతే యేసుప్రభు వారితో సంబంధాన్ని ప్రారంభిస్తున్నామో, ఆ సంబంధము నిత్యత్వము దాక కొనసాగె సంబంధము. జీవ గ్రంధములో మన పేర్లు వ్రాయబడివున్నవి. యేసుప్రభు వారు ఇలా అన్నారు.
నా మాటవిని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వారు తీర్పు లోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5:24
వాక్యము మనకి ఈ రీతిగా చెప్పుచున్నది. ప్రతి గోత్రము నుండి, ప్రతి భాష నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి రాజ్యము నుండి గుంపులుగా ప్రజలు పరలోకములో ఉంటారు. వీరందరు నిత్యజీవాన్ని యేసుప్రభు వారి మీద విశ్వాసము ఉంచడం ద్వార పొందుకున్నారు.
యేసుప్రభు వారి మీద విశ్వాసము ఉంచటం అంటే ఏమిటి, కేవలం యేసుప్రభు వారి గురించిన విషయాలు నమ్మడం కాదు. యేసు ప్రభు వారు దేవుడని నీవు నమ్మవచ్చు. కాని ఆయనని నీ జీవితములో చేర్చుకోకుండా ఉన్నావెమో. ఈ రోజే నీ జీవితంలోకి యేసయ్య ను చేర్చుకో..
ఈ రీతిగా నీవు యేసుప్రభు వారి మీద నమ్మకము విశ్వాసం ఉంచితే నీవు నిత్యజీవాన్ని పొందుకోగలవు.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
Comments