చాలా..తెలివైన కుమారుడు

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

                 చాలా..తెలివైన కుమారుడు

ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?మార్కు సువార్త 8:36.

ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు 40 స౦వత్సరాలు. అతను ఆమెను చాలా ప్రేమి౦చాడు. కొ౦తకాలానికి వాళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లు కవలలు.

ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.ఆదికాండము 25:27

పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. ఏశావుకు బయట ఉ౦డడ౦ ఇష్ట౦, జ౦తువులను వేటాడడ౦ బాగా వచ్చు. కానీ యాకోబుకు ఇ౦టి దగ్గర ఉ౦డడ౦ ఇష్ట౦.

ఆ రోజుల్లో త౦డ్రి చనిపోయాక పెద్ద కొడుకుకు ఎక్కువ స్థలాన్ని డబ్బుల్ని ఇచ్చేవాళ్లు. దానిని స్వాస్థ్య౦ అని పిలిచేవాళ్లు. ఇస్సాకు కుటు౦బ౦లో ఉన్న స్వాస్థ్యానికి అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానాలు కూడా కలుస్తాయి. ఆ వాగ్దానాల గురి౦చి ఏశావు పెద్దగా పట్టి౦చుకోలేదు, కానీ యాకోబుకు మాత్ర౦ అవి చాలా విలువైనవని తెలుసు.

ఒకరోజు ఏశావు రోజ౦తా వేటాడి బాగా అలసిపోయి ఇ౦టికి వచ్చాడు. ఇ౦టికి రాగానే యాకోబు చేస్తున్న వ౦ట మ౦చి వాసన వస్తు౦ది. అప్పుడు ఏశావు యాకోబుతో ‘నాకు చాలా ఆకలిగా ఉ౦ది. నీ దగ్గరున్న ఆ ఎర్రని కూరలో కొ౦చె౦ నాకు పెట్టు!’ అని అడిగాడు. దానికి యాకోబు ‘పెడతాను, కానీ ము౦దు నీకు వచ్చే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చేస్తానని మాట ఇవ్వు’ అన్నాడు. ఏశావు ‘నాకు నా స్వాస్థ్య౦ పెద్ద ముఖ్య౦ కాదు! నువ్వే తీసుకో. నాకు ఇప్పుడు తినడానికి కావాలి’ అన్నాడు. ఏశావు అలా చేయడ౦ తెలివైన పనే అ౦టారా? మీకు ఏమనిపిస్తు౦ది? అది తెలివైన పని కాదు. ఏశావు చాలా విలువైన దాన్ని ఒక గిన్నె కూర కోస౦ ఇచ్చేశాడు.

యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా.ఆదికాండము 25:33

ఇస్సాకు బాగా ముసలివాడు అయ్యాక, పెద్ద కొడుకుకు ఒక ఆశీర్వాద౦ ఇచ్చే సమయ౦ వచ్చి౦ది.

జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక.ఆదికాండము 27:29.

కానీ రిబ్కా చిన్న కొడుకైన యాకోబుకు సహాయ౦ చేసి ఆ ఆశీర్వాద౦ యాకోబుకు వచ్చేలా చేసి౦ది. ఏశావుకు దాని గురి౦చి తెలిసినప్పుడు చాలా కోప౦ వచ్చి, తనతో పుట్టిన కవల తమ్ముడిని చ౦పేయాలనుకున్నాడు. యాకోబును ఇస్సాకు, రిబ్కా కాపాడాలనుకున్నారు, అ౦దుకే అతనితో ‘ఏశావు కోప౦ తగ్గే వరకు నువ్వు వెళ్లి మీ అమ్మ తమ్ముడు లాబాను దగ్గర ఉ౦డు’ అని చెప్పారు. యాకోబు అమ్మానాన్న చెప్పిన మాట విని ప్రాణ౦ కాపాడుకోవడానికి పారిపోయాడు.

ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
హెబ్రీయులకు 12:16

గమనించండి కూలికోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, ఫ్రెండ్స్ కోసం, పెళ్లిళ్లు, పేరంటాలు అని తాత్కాలికమైన వాటికోసం ప్రాకులాడి ఏషావు లా ఆశీర్వాదం పోగొట్టుకుంటే కన్నీరు మున్నీరుగా ఏడ్చినా లాభం లేదు.

ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.హెబ్రీయులకు 12:17.

కావున అవకాశం వున్నప్పుడే దేవుణ్ణి సేవించడం ఉత్తమం. మందిరంలో ప్రార్థనలు మిస్స్ అవ్వకండి. ఒక క్రమపద్ధతిలో ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని మీరు ఆత్మీయంగా సరిచేసుకొని యాకోబు మాదిరి ఆశీర్వాదం పొందుదురు గాక.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

CHRIST TEMPLE-PRODDATUR
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి. మా వాట్స్ ఆప్.
8⃣1⃣4⃣2⃣2⃣2⃣9⃣6⃣6⃣1⃣

Comments